College Admissions: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తులు
Sakshi Education
ఐటీఐ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకొనేందుకు తేదీ విడుదల చేసారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేసుకోవాలని తెలిపారు. ప్రకటించిన తేదీలోగా అవసరమైన వెరిఫికేషన్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. అభ్యర్ధులంతా ప్రకటించిన తేదీలోపు తమ ప్రవేశాన్ని భర్తీ చేసుకోవాలన్నారు.
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో నాల్గో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఆర్.కృష్ణమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరానికి మొదటి, రెండు, మూడు విడతల ప్రవేశాల తర్వాత మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Education Hub: ఎడ్యుకేషన్ హబ్‌గా రాజమహేంద్రవరం
వీరు 20వ తేదీన ఆయా కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీల్లో 22న, ప్రైవేటు కాలేజీల్లో 23న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఆయా కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా ప్రాంతాల్లోని కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు.
Published date : 08 Sep 2023 03:48PM