MBA Tea Stall : ఎంబీఏ చదవలేకపోయాడు..ఓ చిన్న టీ కొట్టుతో కోట్లు సంపాదించాడిలా..
మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్‌ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం.
మూడు సార్లు ఫెయిల్..
మధ్యప్రదేశ్‌లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు.
తండ్రి వద్ద చదువు కోసం రూ.10,000 తీసుకుని..దాంతో..
అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు.
వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి..
మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కస్టమర్ బేస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్‌ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.