నెస్ట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు పొందితే ఉజ్వల భవిష్యత్తు..!
Sakshi Education
నెస్ట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు పొందితే విద్యార్థులకు సైన్స్ విభాగంలో ఉజ్వల భవిష్యత్ ఖాయమని చెప్పొచ్చు.
ముఖ్యంగా పరిశోధనల దిశగా విస్తృత నైపుణ్యాలు సొంతమవుతాయి. కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు.. ఐదేళ్ల వ్యవధిలో పది సెమిస్టర్లుగా ఉండే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పూర్తి చేసుకోవాల్సి ఉంంది. ఈ పది సెమిస్టర్లలోనూ.. ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్‌లోని ఫ్యాకల్టీ సభ్యులు చేస్తున్న రీసెర్చ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్ కేటాయిస్తారు.
కోర్సులివే..
నెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా– బయలాజికల్ సైన్సెస్, –కెమికల్ సైన్సెస్,– మ్యాథమెటిక్స్, –ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
ఇంకా చదవండి: part 4: నెస్ట్ ద్వారా సీటు పొందితే నెలకు రూ.5వేల వరకూ ఆర్థిక ప్రోత్సాహకం.. దరఖాస్తుకు చివరి తేది..
Published date : 25 Feb 2021 06:37PM