జేఈఈ మెయిన్-2020 పిపరేషన్ టిప్స్..
Sakshi Education
ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్ 2020కు నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్‌తో నేరుగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సైతం అర్హత పరీక్ష జేఈఈ మెయిన్. ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో పరీక్ష జరగనుంది. లక్షల మంది ఇంటర్ ఎంపీసీ/10+2 విద్యార్థులు ఎదురు చూసే జేఈఈ మెయిన్ పరీక్షలో జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) కీలక మార్పులు చేసింది. మరో నాలుగు నెలల్లోనే పరీక్ష జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్‌లో మార్పులు, దరఖాస్తు తీరు తెన్నులు, పరీక్ష విధానంపై సమగ్ర కథనం...
మార్పులు ఇవే...
గతేడాది వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రతీ దాంట్లో నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలు ఉండేవి. వచ్చే జనవరి మెయిన్ పరీక్షల నుంచి వాటిలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఐదు ప్రశ్నలను తగ్గించి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలను ఇవ్వనుంది. గతంలో మొత్తం 360 మార్కులకు పరీక్షలను నిర్వహించగా.. ఇకపై వాటిని 300 మార్కులకే పరిమితం చేసింది. గతంలో అన్నీ బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఉండగా.. ఇకపై 20 బహుళ ఐచ్చిక ప్రశ్నలు, 5 దశాంశ స్థాన తరహ(న్యూమరికల్ వాల్యు) ప్రశ్నలు అడగనున్నారు. గతంలో అన్ని ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండేది. ఇకపై దశాంశ స్థాన ప్రశ్నలకు రుణాత్మక మార్కుల విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు.
బీఆర్క్ పేపర్‌లో జరిగిన మార్పు :
బీఆర్క్‌లో ప్రవేశానికి నిర్వహించే మెయిన్ పేపర్ 2 పరీక్షల్లోనూ జేఏబీ మార్పులు చేసింది. బీఆర్క్ పరీక్షల్లో ఇప్పటి వరకు 100 ప్రశ్నలు ఉండేవి. ఇకపై వాటి సంఖ్యను 77కు తగ్గించింది. వీటిలో అయిదు ప్రశ్నలను న్యూమరికల్ వాల్యూ తరహా ప్రశ్నలు ఇవ్వనుంది. గతంలో డ్రాయింగ్‌కు సంబంధించి 3 ప్రశ్నలు అడిగితే.. ఇకపై వాటి సంఖ్యను 2 కే పరిమితం చేసింది. బీఆర్క్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్-2.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లై న్‌లో జరుగుతాయి. డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్-పేపర్ విధానంలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.
బీప్లానింగ్ పేపర్‌లో ఇలా..
గతంలో బీ ప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి, ఇప్పుడు మ్యాథ్స్ మినహా మిగతా ఏ సబ్జెక్టు ఉన్న పర్వాలేదు. దీంతో ఎంఈసీ విద్యార్థులు కూడా బీప్లానింగ్‌లో ప్రవేశానికి అర్హులవుతారు. బీప్లానింగ్‌లో మ్యాథమెటిక్స్ పార్ట్-1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్-2, ప్లానింగ్ బేస్డ్ కొశ్చన్స్ పార్ట్-3 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతాయి.
పరీక్ష :
జేఈఈ మెయిన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్-2020(జనవరి) పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక అభ్యర్థి రెండుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు. రెండు పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అడ్మిషన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 25కు 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్‌విగా ఉంటాయి. మిగిలిన ఐదు ప్రశ్నలు దశాంశ స్థాన తరహావి అడుగు తారు. 20 ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం ఉండగా.. మిగతా ఐదు ప్రశ్నలకు మా త్రం రుణాత్మక మార్కుల నుంచి మినహయింపు ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కు లు కేటాయిస్తే; ప్రతి తప్పు సమాధానానికి ఒక మా ర్కు కోత ఉంటుంది. న్యుమరికల్ వాల్యూ ప్రశ్నలకు సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి, తప్పు సమాధానానికి ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు.
అర్హత :
ఇంటర్(ఎంపీసీ)/10+2 2018, 2019లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు. అలాగే 2020లో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌కు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు. కానీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి నిబంధన ఉంది.
ప్రిపరేషన్ టిప్స్ :
జేఈఈ మెయిన్‌లో మంచి స్కోర్ సాధించేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై పట్టు సాధించడం తప్పనిసరి. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఉందో గుర్తించాలి. సిలబస్‌లోని అన్ని టాపిక్స్ ముఖ్యమైనవే అయినప్పటికీ.. పరీక్ష కోణం లో కొన్ని అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆయా సబ్జెక్టుల ప్రిపరే షన్‌కు ప్రణాళిక రూపొందించుకొని ప్రతిరోజూ చదు వుతుండాలి. నాలుగు నెలల సమయం మాత్రమే అందుబాటులో ఉన్నందున అందుకు తగ్గట్లు ఎవ్రీ డే, వీక్లీ, మంత్లీ ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. కష్టమైన టాపిక్స్‌కు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదు వుతూ.. తొలుత కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచు కోవాలి. ఆ తర్వాత రోజూ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆయా పుస్తకాలు చదివేటప్పుడే ముఖ్యాంశాలు, సూత్రాలు నోట్స్‌లో రాసుకోవాలి. ఈ షార్ట్‌నోట్స్ పరీక్షకు ముందు వేగంగా రివిజిన్ చేయడంలో దోహదపడుతుంది.
దరఖాస్తు ఫీజు :
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 3, 2019.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: డిసెంబర్ 6, 2019.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో.
పరీక్ష సమయం: 3 గంటలు.
పరీక్ష తేదీ : 2020, జనవరి 6 నుంచి 11 వరకు.
ఫలితాల వెల్లడి : 31.01.2020.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nta.ac.in

- జనరల్, ఓబీసీ (అబ్బాయిలు) రూ.650; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలకు (జనరల్, ఓబీసీ) రూ.325.
- ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.
- తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్.
ముఖ్య సమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 3, 2019.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: డిసెంబర్ 6, 2019.
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో.
పరీక్ష సమయం: 3 గంటలు.
పరీక్ష తేదీ : 2020, జనవరి 6 నుంచి 11 వరకు.
ఫలితాల వెల్లడి : 31.01.2020.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nta.ac.in
Published date : 09 Sep 2019 02:17PM