జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్స్‌లో ‘ఎంసీఏ’ ప్రవేశానికి సరైన మార్గం...నిమ్‌సెట్-2020
Sakshi Education
దేశంలో ప్రముఖ విద్యా సంస్థలైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో ఏ కోర్సు చదివినా.. అద్భుతమైన కెరీర్ సొంతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సంస్థలు అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా నిట్‌ల్లో ఎంసీఏ కోర్సుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎన్‌ఐటీల్లో ఎంసీఏ(మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే.. ‘నిమ్‌సెట్-2020’ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సాధించిన ర్యాంక్ ఆధారంగా దేశంలోని 10 ఎన్‌ఐటీల్లో ఎంసీఏలో చేరొచ్చు.
ఏయే సంస్థల్లో ప్రవేశం :
నిమ్ సెట్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నిట్ రాయపూర్ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ ఆధారంగా పది నిట్‌ల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. నిమ్‌సెట్-20లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అగర్తల, అలహాబాద్, భోపాల్, కాలికట్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్కల్, తిరుచురాపల్లి, వరంగల్ ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్రవేశం పొందొచ్చు.
సీట్ల వివరాలు :
10 నిట్‌ల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 871. ఎలాంటి స్టేట్‌వైడ్ కోటా లేదు. నిట్ కురుక్షేత్రలో సెల్ఫ్‌ఫైనాన్సింగ్ స్కీమ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నిట్ వరంగల్ 58 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు :

- కనీసం మూడేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్)/బీసీఏ/బిఐటీ /బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్(కంప్యూటర్ సైన్‌స/కంప్యూటర్ అప్లికేషన్)లో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా బీఈ/బీటెక్ చదివిన వారు నిమ్‌సెట్-20కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పైకోర్సులు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- డిగ్రీలో 60 మార్కులు లేదా సీజీపీఏ 6.5/10, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ తప్పనిసరి.
పరీక్ష విధానం :
ఆన్‌లైన్‌లో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 120 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది.
మ్యాథమెటిక్స్: 50 ప్రశ్నలు
అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్: 40 ప్రశ్నలు
కంప్యూటర్ అవేర్‌నెస్: 10 ప్రశ్నలు
జనరల్ ఇంగ్లిష్: 20 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.

గమనిక: నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తే.. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
అవకాశాలు..
నిమ్‌సెట్‌లో ప్రతిభ ద్వారా నిట్‌ల్లో ఎంసీఏ పూర్తి చేస్తే ఐటీ రంగంలో ఉజ్వల అవకాశాలు అందుకునే వీలుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నిట్‌ల్లో ఎంసీఏ పూర్తిచేసిన విద్యార్థులకు సీఎస్‌ఈ విద్యార్థులతో సమానంగా ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్స్ లభిస్తున్నాయి.
దరఖాస్తు ఫీజు :

- జనరల్/ఓపెన్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ రూ. 2,500,ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు రూ.1,250.
- దరఖాస్తు పూర్తిచేసేటప్పుడు అవసరమైన గుర్తింపు పత్రాలు సైతం అప్‌లోడ్ చేయాలి.
పరీక్ష కేంద్రాలు : తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్‌లో నిమ్‌సెట్
పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06 మార్చి 2020
దరఖాస్తులకు చివరి తేదీ: 31 మార్చి 2020
హాల్‌టికెట్ల జారీ: మే 11 నుంచి
పరీక్ష తేది: 24 మే 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nimcet.in

Published date : 03 Mar 2020 01:37PM