Skip to main content

ఇకపై ఎల్‌ఎల్‌ఎంకి జాతీయ స్థాయిలో ఒకే ఎంట్రన్స్..?

జాతీయ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్)ను నిర్వహించాలని బీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఏటా.. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ లాలో ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. మెరిట్ ఆధారంగా యూనివర్సిటీలు ప్రవేశాలు ఖరారు చేయాలని స్పష్టం చేసింది.

స్పెషలైజ్డ్ కోర్సులు..
పీజీ స్థాయిలో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌లతో ఉన్న లా కోర్సులు.. ఎల్‌ఎల్ ఎంకు తత్సమానం కావని కూడా బీసీఐ పేర్కొంది. ఇటీవల కాలం లో మార్కెట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకొని పీజీ స్థాయిలో పలు స్పెషలైజ్డ్ లా కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. ఉదాహర ణకు.. పీజీ-బిజినెస్ లా, లేదా మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేదా మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ లా వంటివి. వీటిలో చేరుతున్న విద్యా ర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ వీటివైపు దృష్టి సారిస్తున్నారు. వారు సంబంధిత విభాగంలో స్పెషలైజ్డ్ కోర్సు చేసినట్లు భావిస్తున్నారు. కాని బీసీఐ తాజా నిర్ణయంతో ఇలాంటి కోర్సులు ఎల్‌ఎల్‌ఎంకు తత్స మానం కావు. ఏదైనా ఒక స్పెషలైజేషన్‌లో పీజీ లా డిగ్రీ పొందాలంటే.. తప్పనిసరిగా ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి.. ఆ స్పెషలైజేషన్‌తో దాన్ని పూర్తి చేయాల్సిందే. ఏదైనా బ్రాంచ్‌లో స్పెషలైజేషన్ పొందా లంటే.. సదరు విద్యార్థి తప్పనిసరిగా ఆ బ్రాంచ్‌కు సంబంధించిన మొత్తం పేపర్లలో సగం పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

నాలుగు సెమిస్టర్లు..
బీసీఐ ప్రతిపాదిస్తున్న రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సును నాలుగు సెమిస్టర్లలో బోధించాల్సి ఉంటుంది. నాలుగు కంపల్సరీ పేపర్లతోపాటు, మరో ఎనిమిది పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ నుంచి లేదా ఉమ్మడి కరిక్యులం నుంచి ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

ఎగ్జిక్యూటివ్ ఎల్‌ఎల్‌ఎం..
ఎగ్జిక్యూటివ్ ఎల్‌ఎల్‌ఎం కోర్సును మూడేళ్ల వ్యవధిలో ఆరు సెమిస్టర్ల విధానంలో నిర్వహించాలని బీసీఐ పేర్కొంది. ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులం, ఇతర బోధన పద్ధతులు రెగ్యులర్ ఎల్‌ఎల్‌ఎం మాదిరిగానే ఉండాలని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి: part 3: న్యాయవాదులకు ప్రత్యేకంగా రెండు కోర్సుల ప్రారంభం.. మాస్టర్స్, పీహెచ్‌డీతో సమానంగా..

Published date : 29 Jan 2021 04:54PM

Photo Stories