ఈ విధానంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందా..?
ఇప్పుడు చాలామంది విద్యార్థులు తమకు ఆసక్తి లేని కోర్సుల్లో చేరి.. భవిష్యత్తులో రాణించలేక ఇబ్బంది పడుతున్నారు. ముందుగా దీనికి క్రెడిట్ బ్యాంక్ విధానం ద్వారా తెరపడుతుంది. ఫలితంగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో ముందంజలో నిలిచే అవకాశం ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఫలితంగా.. విద్యార్థులకు విభిన్న నైపుణ్యాలు లభిస్తాయి. దాంతో కోర్ ఏరియాస్‌లోనే కాకుండా.. ఇతర విభాగాల్లోనూ రాణించే వీలుంది. ఈ కొత్త విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఫ్యాకల్టీ, ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తే ఈ విధానం సమర్థవంతంగా అమలవుతుంది.
-ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, వైస్ ఛాన్స్‌లర్, జేఎన్‌యూ- ఢిల్లీ
ఇంకా చదవండి: part 1: ఇష్టం లేకుండా చదువుతూ కోర్సు మారాలని ఆలోచించే వారికి గుడ్‌న్యూస్.. నేషనల్ అకడమిక్ క్రెడిట్ బ్యాంక్‌ను ప్రారంభించనున్న కేంద్రం!