ఈ కోర్సులు రెండేళ్లు అయితే.. ప్రయోజనాలు, ప్రతికూలతలు ఇలా..
ఆ తర్వాత ఏడాది వ్యవధిలో ఎల్‌ఎల్‌ఎం చదవొచ్చు. అంటే.. 10+2+5 విధానం అనంతరం మరో ఏడాది సమయం వెచ్చిస్తే ఎల్‌ఎల్‌ఎం సర్టిఫికెట్ చేతికందుతుంది. కానీ.. తాజా నిర్ణయంతో 10+2+5 విధానంతోపాటు మరో రెండేళ్లు చదివితే తప్ప ఎల్‌ఎల్‌ఎం పట్టా అందదు. ఇతర కోర్సుల విద్యార్థులు మాస్టర్ డిగ్రీ అందుకోవడానికి 15 ఏళ్లు వెచ్చిస్తే.. న్యాయవిద్య విద్యార్థులు మాత్రం మాస్టర్ డిగ్రీ కోసం 17ఏళ్లు చదవాల్సి ఉంటుంది.
ఎల్‌ఎల్‌ఎం రెండేళ్లు.. ప్రయోజనాలు
- ఎల్‌ఎల్‌ఎం కోర్సు వ్యవధిని రెండేళ్లు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా బీసీఐ స్పష్టం చేసింది.
- అభ్యర్థులకు స్పెషలైజేషన్‌తోపాటు ఇతర న్యాయ పరమైన అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన లభిస్తుంది.
- వృత్తి పరమైన అంశాలు, క్లినికల్ ఎడ్యుకేషన్, కోర్ట్ మేనేజ్‌మెంట్, టెక్నాలజీ తదితర అంశాలపై పూర్తి స్థాయి పట్టు చిక్కుతుంది.
- మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఫలితంగా ఇతర అంశాల్లోనూ నైపుణ్యం సాధించే అవకాశం ఉంటుంది.
- స్పెషలైజేషన్ బ్రాంచ్‌లోని అన్ని పేపర్లలో సగం పేపర్లను కచ్చితంగా ఎంచుకోవాలనే నిర్ణయం కారణంగా ఆ బ్రాంచ్‌కు సంబంధించి అన్ని అంశాలపై అవగాహన పెరుగుతుంది.
బీసీఐ తాజా నిర్ణయాలు.. ముఖ్యాంశాలు
- ఎల్‌ఎల్‌ఎంకు రెండేళ్ల వ్యవధి తప్పనిసరి.
- ఎగ్జిక్యూటివ్ ఎల్‌ఎల్‌ఎం వ్యవధి మూడేళ్లు.
- నిబంధనలకు ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి.
- జాతీయ స్థాయిలో ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశానికి సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్.
- విదేశాల్లో ఏడాది వ్యవధిలోని ఎల్‌ఎల్‌ఎంలు చెల్లుబాటు కావు.
రెండు కోణాలు..
బీసీఐ ప్రతిపాదించిన తాజా నిబంధనల ప్రకారం-సానుకూలం, ప్రతికూలం అనే రెండు కోణాలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో సంపూర్ణ అవగాహన లభిస్తుంది అనే ఉద్దేశాన్ని సానుకూలంగా భావించాలి. ఏడాది వ్యవధిని తొలగించడం వల్ల ముఖ్యంగా కెరీర్ పరంగా త్వరగా ఎదగాలనుకునే వారికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. వాస్తవానికి న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎల్‌ఎల్‌బీ సరిపోతుంది. సంబంధిత విభాగంలో పూర్తి స్థాయి అవగాహన పొందడం.. ఆయా సంస్థల్లో లీగల్ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగం చేస్తున్న లా గ్రాడ్యుయేట్లు పదోన్నతులు,సబ్జెక్ట్ పరిజ్ఞానం కోణంలో ఏడాది ఎల్‌ఎల్‌ఎంకు ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఇలాంటి వారికి తాజా నిర్ణయం ఇబ్బంది కలిగించేదే.
-ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్
ఇంకా చదవండి: part 1: ఎల్‌ఎల్‌ఎం ఇక రెండేళ్లు.. బీసీఐ కొత్త నిబంధనలు తెలుసుకోండిలా..