Skip to main content

గేట్, ఈఎస్‌ఈ పరీక్ష ప్రిపరేషన్ ఎలా ఉండాలి?

రెండు పరీక్షలను ఒకే సమయంలో ప్రిపరేషన్ సాగించడం సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. రెండింటి లక్ష్యం.. సంబంధిత ఇంజనీరింగ్ విభాగంపై అభ్యర్థులోఉన్న నైపుణ్యాలను పరీక్షించడమే.
  • గేట్, ఈఎస్‌ఈ పరీక్ష పత్రాల సరళిని పరిశీలిస్తే.. రెండింటి మధ్య ప్రధానంగా రెండు వ్యత్యాసాలు కనిస్తాయి. అవి.. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ విషయంలో ప్రశ్నలన్నీ అభ్యర్థుల్లోని కాన్సెప్ట్యువల్ క్లారిటీ (భావనలపై స్పష్టత స్థాయి)ని పరీక్షించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో జనరల్ అవేర్‌నెస్ (సామాజిక సమకాలీన అంశాలు)ను పరీక్షిస్తారు.
  • గేట్ విషయానికొస్తే ఇది అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి నిర్దిష్ట సిలబస్ పరిధిలోనే ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు కూడా అభ్యర్థుల్లోని ప్రాబ్లమ్ సాల్వింగ్(సమస్య సాధన) సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. దీంతోపాటు అభ్యర్థుల ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీని పరీక్షించే ప్రశ్నలు కూడా ఎదురవుతాయి.
బేరీజు వేసుకుంటూ..
సిలబస్, పరీక్ష శైలిలో గేట్, ఈఎస్‌ఈ మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తున్నందున అభ్యర్థులు ముందుగా.. రెండిటి సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించాలి.
  • ఆ తర్వాత అభ్యర్థులు ఉమ్మడి అంశాలను అన్ని కోణాల్లో చదవడం పూర్తి చేయాలి. అనంతరం ముందుగా జరిగే పరీక్ష గేట్ సిలబస్ టాపిక్స్ పూర్తిచేయాలి. గేట్ తర్వాత ఈఎస్‌ఈ ప్రిలిమినరీకి అందుబాటులో ఉన్న సమయంలో మిగతా అంశాలనూ పూర్తిచేయాలి. ఆయా టాపిక్స్‌ను చదివేటప్పుడు వాటి ఉద్దేశం, భావనలు మొదలు అప్లికేషన్ వరకూ.. అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేస్తే ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది.
ఇంకా చదవండి: part 4: గేట్, ఈఎస్‌ఈ.. డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ చేయాలి?
Published date : 19 Nov 2020 05:16PM

Photo Stories