ఎఫ్‌ఆర్‌ఐ నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక ప్రక్రియ ఇలా..
Sakshi Education
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
- ఈ పరీక్ష మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం మూడు గంటలు.
- సోషల్ సెన్సైస్ కలుపుకొని బేసిక్ సైన్స్ నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు.
- అర్థమేటిక్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, కంప్యూటేషనల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ టేబుల్స్, గ్రాఫ్ తదితర అంశాల నుంచి 40 ప్రశ్నలను అడగుతారు.
- జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్ విభాగాల నుంచి 30 ప్రశ్నలు వస్తాయి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, వొక్యాబులరీ, గ్రామర్, ఇడెయమ్స్ నుంచి 30 ప్రశ్నలుంటాయి.
నెగిటివ్ మార్కింగ్..
ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు కోతను విధిస్తారు.
దరఖాస్తు విధానం..
ఈ పరీక్షకు ఆఫ్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు ఎఫ్‌ఆర్‌ఐ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: Kaulagarh Road, Forest Research Institute University, Dehradun, P.O.I.P.E., Kaulagarh Road, Dehradun, 248195
- దరఖాస్తులకు చివరి తేదీ : 16.04.2021
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://fridu.edu.in
ఇంకా చదవండి: part 1: అడవుల అధ్యయనంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎఫ్‌ఆర్‌ఐ..
Published date : 03 Feb 2021 06:21PM