ఎక్స్‌ఏటీ-2020
Sakshi Education
జాతీయస్థాయిలో ఎంబీఏ ప్రవేశ పరీక్షల్లో క్యాట్ తర్వాత అంతటి పేరున్న ఎంట్రెన్స్.. ఎక్స్‌ఏటీ(జేవియర్ అప్టిట్యూడ్ టెస్ట్). దేశంలో క్యాట్, మ్యాట్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు రాసే పరీక్ష ఎక్స్‌ఏటీ. స్టీల్ సిటీ జంషెడ్‌పూర్‌లో ఏర్పాటైన ప్రతిష్టాత్మక బీస్కూల్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ (జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్).. ఎక్స్‌ఏటీని ప్రతిఏటా నిర్వహిస్తోంది. దీని స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్నదాదాపు 150 బీస్కూల్స్‌లో ఎంబీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశముంది. ఎక్స్‌ఏటీ 2020 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. దరఖాస్తు విధానం.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ.. పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ కోర్సులు :
ఎంపిక ప్రక్రియ :
ఎక్స్‌ఏటీలో ప్రతిభ, అకడెమిక్ రికార్డ్, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ప్రవేశాలు కల్పిస్తుంది. ఎక్స్‌ఏటీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు ఎక్స్‌ఏటీ స్కోర్ ఆధారంగా వివిధ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
అర్హత :
గుర్తింపు పొంది యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (కనీసం మూడేళ్లు) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఎక్స్‌ఏటీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష విధానం :
ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు (సీబీటీ-కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్). దీనిలో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో మూడు సెక్షన్లలో పరీక్ష జరుగుతుంది.
పరీక్ష కేంద్రం మార్పు ఇలా..
గత ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశాన్ని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే ఆ ఆప్షన్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ఇది అభ్యర్థులకు వన్‌టైం ఛాన్స్‌కింద ఒక్కసారి మాత్రమే పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు admia@xlri కు తమ ఐడీ, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఏ నగరానికి సంబంధించి పరీక్ష కేంద్రాన్ని కోరుకుంటున్నారో నవంబర్ 30, 2019లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2019
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: డిసెంబర్ 20, 2019 నుంచి
పరీక్ష తేదీ: జనవరి 5, 2020
పరీక్ష కేంద్రాలు: వరంగల్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
ఫలితాలు: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.xatonline.in
- 70 ఏళ్లుగా జంషెడ్‌పూర్ క్యాంపస్‌కే పరిమితమైన ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ మరో మూడు క్యాంపస్‌లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని ఉత్తరం, పశ్చిమం, దక్షిణ ప్రాంతాల్లో ఒక్కో క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటిల్లో ఉత్తర ప్రాంతానికి సంబంధించి ఢిల్లీ క్యాంపస్‌లో 2020 జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది.
- ఫుల్‌టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్: ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ.. పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం- రెండేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ హుమాన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్; పీజీడీఎం బీఎం-రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్; పీజీడీఎం జీఎంపీ-15 నెలల జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్; నాలుగేళ్ల ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. వీటితోపాటు వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను సైతం అందిస్తోంది.
ఎంపిక ప్రక్రియ :
ఎక్స్‌ఏటీలో ప్రతిభ, అకడెమిక్ రికార్డ్, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ ప్రవేశాలు కల్పిస్తుంది. ఎక్స్‌ఏటీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. అభ్యర్థులు ఎక్స్‌ఏటీ స్కోర్ ఆధారంగా వివిధ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
అర్హత :
గుర్తింపు పొంది యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (కనీసం మూడేళ్లు) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఎక్స్‌ఏటీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. అన్ని వర్గాల (ఎస్సీ, ఎస్టీ, జనరల్, దివ్యాంగుల,మహిళ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1700. క్రెడిట్, డెబిట్ కార్డ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించ వచ్చు.
పరీక్ష విధానం :
ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు (సీబీటీ-కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్). దీనిలో మొత్తం రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో మూడు సెక్షన్లలో పరీక్ష జరుగుతుంది.
- మొదటి విభాగం: సెక్షన్ (ఎ) వెర్బల్ అండ్ లాజికల్ ఎబిలిటీ నుంచి 26 ప్రశ్నలు, సెక్షన్(బి) డెసిషన్ మేకింగ్-21 ప్రశ్నలకు, సెక్షన్(సి) క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 27 ప్రశ్నలు వస్తాయి.
- రెండో విభాగం: ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు( 0.25) మార్కుల కోత విధిస్తారు.
- మొత్తం 99 ప్రశ్నలకు 3గంటల సమయం ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రం మార్పు ఇలా..
గత ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశాన్ని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే ఆ ఆప్షన్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ఇది అభ్యర్థులకు వన్‌టైం ఛాన్స్‌కింద ఒక్కసారి మాత్రమే పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు admia@xlri కు తమ ఐడీ, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఏ నగరానికి సంబంధించి పరీక్ష కేంద్రాన్ని కోరుకుంటున్నారో నవంబర్ 30, 2019లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2019
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: డిసెంబర్ 20, 2019 నుంచి
పరీక్ష తేదీ: జనవరి 5, 2020
పరీక్ష కేంద్రాలు: వరంగల్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
ఫలితాలు: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.xatonline.in
Published date : 30 Sep 2019 05:03PM