Skip to main content

దేశంలో వేగంగా విస్తరిస్తున్న నిర్మాణ రంగం.. అద్భుత అవ‌కాశాలు అందుకోండిలా..

దేశంలో నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తోంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగానికి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఎక్కువగా ఉంది. నిర్మాణ రంగంతోపాటు, రియల్‌ ఎస్టేట్, మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తవ్వాలంటే.. సుశిక్షుతులైన మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం, దాని అనుబంధ రంగాలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(నిక్మర్‌) కోర్సులు అందిస్తోంది. ఇటీవల పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నిక్మర్‌ అందిస్తున్న కోర్సులు, అర్హతలు, ప్రవేశ విధానం గురించి తెలుసుకుందాం..
నిర్మాణం, దాని అనుబంధ రంగాలకు అవ సరమైన శిక్షణ, పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటైన లాభాపేక్ష లేని సంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌(నిక్మర్‌). దీనికి హైదరాబాద్, పుణె, గోవా, ఢిల్లీ, ముంబయిల్లో క్యాంపస్‌లున్నాయి.

అందిస్తున్న కోర్సులు..
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సు నిక్మర్‌కు చెందిన నాలుగు క్యాంపస్‌లు పుణె, గోవా, హైదరాబాద్, ఢిల్లీల్లో అందుబాటులో ఉంది. ఇది రెండేళ్ల కోర్సు.
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సును పుణె, హైదరాబాద్‌ క్యాంపస్‌లు అందిస్తున్నాయి.ఇది రెండేళ్ల కోర్సు.
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌: దీన్ని పుణె క్యాంపస్‌ అందిస్తుంది. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు.
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌: పుణె క్యాంపస్‌ ఈ కోర్సును అందిస్తుంది. ఇది రెండేళ్ల కోర్సు.
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌: ఈ కోర్సును పుణె క్యాంపస్‌ అందిస్తోంది. ఇది ఏడాది కోర్సు.
  • పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సును అన్ని క్యాంపస్‌లు అందిస్తున్నాయి. ఇది ఏడాది కోర్సు.

అర్హతలు..
కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.


ఎంపిక విధానం..

  • నిక్మర్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎన్‌క్యాట్‌)లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వూ్య నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
  • క్యాట్‌/గేట్‌/జీమ్యాట్‌/సీమ్యాట్‌ అర్హత గల అభ్యర్థులకు కామన్‌ ఎంట్రన్స్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది.
  • నిక్మర్‌ నిర్వహించే ఎన్‌క్యాట్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూలకు ఇంటి నుంచే హాజరయ్యే వెసులుబాటు కూడా ఉంది.

పరీక్ష విధానం..
ఎన్‌క్యాట్, పర్సనల్‌ ఇంటర్వూ కలిపి మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఎన్‌క్యాట్‌–180 మార్కులకు ఉంటుంది. ఎన్‌క్యాట్‌ ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ–72 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటిషన్‌–36 మార్కులు, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీల నుంచి 72 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. దీంతోపాటు ఇంటర్వూ–50 మార్కులకు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు–70 మార్కులు కేటాయిస్తారు.


ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 29, 2021
  • ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 2021 జులై 3, 4 తేదీల్లో
  • పర్సనల్‌ ఇంటర్వూ: 2021 జులై 6, 7 తేదీల్లో
  • ఫలితాల వెల్లడి: జులై 09, 2021
  • తరగతులు ప్రారంభం: సెప్టెంబర్‌ 06, 2021
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://nicmar.ac.in  
Published date : 18 Jun 2021 05:15PM

Photo Stories