ఆయుష్ కోర్సులు పూర్తి చేస్తే.. రూ.50 వేల వరకు వేతనంతో కొలువు పొందే అవకాశం..!
Sakshi Education
ఆయుష్ కోర్సులు.. వాటికి ప్రస్తుతం లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుంటే..
ఇవి ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలుగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ఈ విభాగాల్లోనూ కార్పొరేట్ తరహా ఆస్పత్రులు ఏర్పాటవుతుండటం కూడా భవిష్యత్తు అవకాశాలు విస్తృతం చేసేందుకు దోహదం చేస్తోంది. కోర్సు వారీగా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల వివరాలు...
బీహెచ్‌ఎంఎస్..
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్‌ఎంస్) వైద్య విధానం కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఇప్పుడు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ప్రజల్లో హోమియోపతిక్ వైద్య విధానంపై ఆసక్తి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పలు కార్పొరేట్ వైద్య సంస్థలు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాయి. ఫలితంగా బీహెచ్‌ఎంఎస్ అభ్యర్థులు నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనంతో కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది. బీహెచ్‌ఎంఎస్‌లోనూ ఎంబీబీఎస్ కరిక్యులంలో ఉండే విభాగాలు (ఉదాహరణకు అనాటమీ, ఫిజియాలజీ తదితర) ఉంటాయి. ఉన్నత విద్య కోణంలో.. మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంది. వీటిని కూడా పూర్తిచేస్తే భవిష్యత్తులో కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సి అవసరం ఉండదు.
బీఏఎంఎస్..
సహజ సిద్ధ పద్ధతులతో వైద్యం చేయగలిగే నైపుణ్యాలు అందించే కోర్సు.. బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ). ఈ కోర్సు.. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. బీఏఎంఎస్ కోర్సు కాల వ్యవధి అయిదున్నరేళ్లు. ఇందులో అనాటమీ, ఫిజియూలజీ, పెడియూట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఉన్నత విద్యలో ఎండీ స్థాయిలో.. ఆయుర్వేద, ఎంఎస్-ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే కాయ చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సులు పీజీ స్పెషలైజేషన్లుగా ఉన్నాయి. ఆయుష్ శాఖల్లో, ప్రైవేటు ఆయుర్వేద ఆస్పత్రుల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
యునానీ (బీయూఎంఎస్)..
బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంది. బీయూఎంస్ పూర్తి చేసిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో చేరొచ్చు.
బీఎన్‌వైఎస్..
బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సెన్సైస్.. బీఎన్‌వైఎస్. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రకృతి వైద్యం పట్ల అవగాహన పెరుగుతున్న కారణంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు దీటైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి.
ఆయుష్ కౌన్సెలింగ్... ముఖ్యాంశాలు
కొద్ది రోజుల్లోనే స్పష్టత..
ఫీజుల విషయంపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. సీట్ అలాట్‌మెంట్ సమయానికంటే ముందే ఈ విషయాలు తెలియజేస్తాం. ఆయుష్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విద్యార్థుల మాదిరిగానే అకడమిక్ కరిక్యులం అమలవుతోంది. కాబట్టి నైపుణ్యాల పరంగా ఆందోళ చెందక్కర్లేదు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ కోర్సులకు కెరీర్ అవకాశాలు కూడా మెరుగయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఉన్నత విద్యను కూడా పూర్తి చేయడం మరింత మేలు చేస్తుంది.
- డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్, ఏపీ హెల్త్ వర్సిటీ
ఇంకా చదవండి: part 1: ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఆయుష్ కోర్సులు.. 2020-21 సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం..

- ఎంబీబీఎస్, బీడీఎస్ మాదిరిగానే నీట్-యూజీ ర్యాంకు ఆధారంగా ఆయుష్ కౌన్సెలింగ్.
- ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా మెరిట్ జాబితా రూపకల్పన.
- మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే తమ కోర్సుల ప్రాథమ్యాలు పేర్కొనాలి.
- సీట్ అలాట్‌మెంట్ జరిగాక.. నిర్దేశిత ఫీజులు (యూనివర్సిటీ ఫీజు, ట్యూషన్ ఫీజు తదితర) చెల్లించి.. సీట్ బ్లాక్ చేసుకోవాలి.
- రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. అందులోనూ పాల్గొనే అవకాశం ఉంది.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్స్: https://tsbhanu.tsche.ac.in, https://apmedadm.apntruhs
కొద్ది రోజుల్లోనే స్పష్టత..
ఫీజుల విషయంపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది. సీట్ అలాట్‌మెంట్ సమయానికంటే ముందే ఈ విషయాలు తెలియజేస్తాం. ఆయుష్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విద్యార్థుల మాదిరిగానే అకడమిక్ కరిక్యులం అమలవుతోంది. కాబట్టి నైపుణ్యాల పరంగా ఆందోళ చెందక్కర్లేదు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ కోర్సులకు కెరీర్ అవకాశాలు కూడా మెరుగయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఉన్నత విద్యను కూడా పూర్తి చేయడం మరింత మేలు చేస్తుంది.
- డాక్టర్ కె.శంకర్, రిజిస్ట్రార్, ఏపీ హెల్త్ వర్సిటీ
ఇంకా చదవండి: part 1: ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఆయుష్ కోర్సులు.. 2020-21 సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభం..
Published date : 26 Jan 2021 02:33PM