Skip to main content

ఆర్మీ బీఎస్సీ నర్సింగ్-2020కి దరఖాస్తులు

ఆర్మీ మెడికల్ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్-2020 నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మిలటరీ నర్సింగ్ సర్వీసెస్‌లో పర్మినెంట్/షార్ట్ సర్వీస్ కమిషన్ హోదా కల్పిస్తారు. ఆర్మీలో బీఎస్సీ నర్సింగ్-2020 నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ టిప్స్...

కాలేజీలు- సీట్లు..
కళాశాల భర్తీ చేసే సీట్లు
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఏఎఫ్‌ఎంసీ పుణే 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సీహెచ్(ఈసీ) కోల్‌కతా 30
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్విని 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఏహెచ్ (ఆర్ అండ్ ఆర్) న్యూఢిల్లీ 30
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సీహెచ్(సీసీ) లక్నో 40
కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సీహెచ్(ఏఎఫ్) బెంగళూరు 40
మొత్తం 220
అర్హతలు:
  • అవివాహిత మహిళలు, చట్టబద్ధంగా భర్త నుంచి విడిపోయిన మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
  • ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష తొలి ప్రయత్నంలోనే కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ), ఇంగ్లిష్ సబ్జెక్టులను చదివుండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
అర్హులకు ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్ పరీక్షను ఏప్రిల్, 2020లో నిర్వహించే అవకాశం ఉంది.

ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు :
ఆన్‌లైన్ టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్టులో పొందిన మార్కులు, ఇంటర్వ్యూ ప్రదర్శన, అభ్యర్థి మెడికల్ ఫిట్‌నెస్, పేర్కొన్న చాయిస్, సదరు కళాశాలలో అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

పరీక్ష విధానం :
ఆన్‌లైన్ పరీక్షలో ఫిజిక్స్ నుంచి 45 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 45 ప్రశ్నలు, బయాలజీ నుంచి 45 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్, లాజిక్ నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు.

ప్రిపరేషన్ :
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్‌ఎమ్‌సీ) -2020 సిలబస్ ఆధారంగా అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధాన టాపిక్స్ ఇవే..
ఫిజిక్స్: మెజర్‌మెంట్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ఫోటాన్స్ తదితరం.
కెమిస్ట్రీ: అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఎనర్జిటిక్స్, కెమికల్ బాండింగ్, ఈక్విలిబ్రియమ్, సొల్యూషన్స్, కెమికల్ కైనటిక్స్ మొదలైనవి.
బయాలజీ: జెనిటిక్స్ అండ్ ఎవాల్యుయేషన్; ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ తదితరం.

టిప్స్
  • ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని ప్రాథమిక భావనలను అధ్యయనం చేయాలి.
  • గత 3-4 ఏళ్ల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • మోడల్ పేపర్లను సేకరించుకొని ప్రాక్టీస్ చేయాలి.
  • ఏకాగ్రతతోపాటు ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి.
ముఖ్యతేదీలు
 దరఖాస్తు ఫీజు: రూ.750.
 దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2019
 ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2019
 వయసు: 1995, అక్టోబర్ 1-సెప్టెంబర్ 30, 2003 మధ్య జన్మించి ఉండాలి.
 తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.joinindianarmy.nic.in
Published date : 25 Nov 2019 12:39PM

Photo Stories