ఐఐపీఎస్ పాపులేషన్ సెన్సైస్.. కెరీర్ అవకాశాలు
Sakshi Education
సంప్రదాయ కోర్సుల కంటే వైవిధ్య కోర్సులకు నేటి తరం యువతలో క్రేజ్ ఎక్కువ. ఆర్ట్స్ విద్యార్థులకు ఉన్నత విద్యపరంగా పెద్దగా అవకాశాలు ఉండవనే అపోహ ఉంది. కానీ, వారికోసం కూడా కొన్ని ప్రత్యేక విద్యాసంస్థలు ఉన్నాయి.
వీటిలో చేరితే కార్పొరేట్ ఉద్యోగానికి తీసిపోని రీతిలో కొలువులు దక్కించుకోవచ్చు. అంతేకాదు నేరుగా సమాజాభివృద్ధికి కృషిచేసే అవకాశం దక్కుతుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో మేటిగా నిలుస్తోంది... ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సైస్(ఐఐపీఎస్). ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలకు ఢోకాలేదు. తాజాగా 2019 విద్యా సంవత్సరానికి ఐఐపీఎస్ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఆయా కోర్సుల పూర్తి వివరాలు...
ఐఐపీఎస్‌ను 1956లో యునెటైడ్ నేషన్స్, భారత ప్రభుత్వం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ కలిసి డెమోగ్రఫిక్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా ముంబైలో ప్రారంభించారు. తర్వాత దీన్ని ఐఐపీఎస్‌గా మార్చారు. 1985లో ఈ సంస్థను డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉన్న జనాభా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను అంచనా వేయడానికి, వారి సంక్షేమానికి పథకాలు రూపొందించడానికి సర్వేలు నిర్వహించడం పరిపాటి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఐఐపీఎస్ ముందుంటోంది. ఈ రంగంలోని మానవ వనరులకు పాపులేషన్ స్టడీస్‌లో నైపుణ్యం అందించేందుకు, శాస్త్రీయ పద్ధతులను నేర్పడంలో ఐఐపీఎస్ పేరుగాంచింది. ఈ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, జిల్లా స్థాయి ఇంటి సర్వే, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, యూత్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ వంటి ఎన్నో ముఖ్యమైన సర్వేలు చేసింది.

- ఐఐపీఎస్‌లో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఎన్‌జీవోలు, యూనివర్సిటీలు, కాలేజీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు నేరుగా ప్రభుత్వాలతో కలిసి పనిచేసే వీలుంది. ఇక్కడి పూర్వ విద్యార్థులు పేరున్న సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు.
- ఐఐపీఎస్‌లో అందుబాటులో ఉన్న పాపులేషన్, హెల్త్ సంబంధ బోధన, రీసెర్చ్ కోర్సుల్లో చేరడానికి ఆసియా, పసిఫిక్ రీజియన్, ఆఫ్రికా, నార్త్ అమెరికా దేశాల విద్యార్థులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.
- పాపులేషన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కెరీర్ అవకాశాలు ఆశాజనకమని చెప్పొచ్చు. విధానాల రూపకల్పనలో పాపులేషన్ నిపుణులు అందించే గణాంకాలు చాలా కీలకం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత. అందుకోసం విద్య, వైద్యం, హౌసింగ్ వంటి మౌలిక వసతులపై దృష్టిసారిస్తాయి. వీటిపై అవగాహన, వాటి మధ్య ఉన్న సంబంధాలను లోతుగా అర్థం చేసుకునే పాపులేషన్ స్టడీస్ విద్యార్థులు ఈ రంగంలో ఉన్నతంగా రాణించే వీలుంది.
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూమరసీ, స్టాటిస్టిక్స్, రీసెర్చ్ మెథడ్స్ మొదలైన నైపుణ్యాలు ఉన్నవారికి వాలంటరీ సంస్థలు, ఎన్‌జీవోలు, ప్రభుత్వ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యూఎన్‌వో, ఇతర యూఎన్ ఆర్గనైజేషన్స్, మీడియా ఆర్గనైజేషన్స్, ఓపినియన్ సర్వే కంపెనీలు వంటి వాటిలోనూ ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు.
ఐఐపీఎస్ కోర్సుల వివరాలు...
పాపులేషన్ స్టడీస్‌లో ఎంఏ/ఎంఎస్సీ :
అర్హత: 55 శాతం మార్కులతో నిర్దేశిత సబ్జెక్టులతో బీఏ/బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు. (ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు).
కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.
సీట్ల సంఖ్య: 50.
గరిష్ట వయోపరిమితి: 25 ఏళ్లు.
ఫెలోషిప్ నెలకు: రూ.5,000.
బయో స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీలో ఎమ్మెస్సీ :
అర్హత: 55 శాతం మార్కులతో నిర్దేశిత సబ్జెక్టులతో బీఏ/బీఎస్సీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు (ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు).
కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.
సీట్ల సంఖ్య: 50
గరిష్ట వయోపరిమితి: 25 ఏళ్లు.
ఫెలోషిప్ నెలకు: రూ. 5,000.
మాస్టర్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్(ఎంపీఎస్) :
అర్హత: 55 శాతం మార్కులతో నిర్దేశిత సబ్జెక్టులతో ఎంఏ/ఎంఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. (ఫైనల్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు)
కోర్సు వ్యవధి: ఏడాది ఊ సీట్ల సంఖ్య: 50
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు.
ఫెలోషిప్ నెలకు: రూ. 5,000
పాపులేషన్ స్టడీస్/బయో స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీలో ఎంఫిల్ :
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు.
కోర్సు వ్యవధి: ఏడాది ఊ సీట్ల సంఖ్య: 50
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.
ఫెలోషిప్ నెలకు: రూ. 6,000
పాపులేషన్ స్టడీస్/బయో స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ :
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన వారు అర్హులు.
కోర్సు వ్యవధి: 3 ఏళ్ల నుంచి 7 ఏళ్లు.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.
యూజీసీ/సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫెలోషిప్ అందుతుంది.
పాపులేషన్ స్టడీస్/బయో స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీలో పీహెచ్‌డీ :
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఎంఫిల్ పూర్తిచేసిన వారు అర్హులు.
కోర్సు వ్యవధి: 2 నుంచి 6 ఏళ్లు.
గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.
దూరవిద్యలో ఎంఏ (పాపులేషన్ స్టడీస్) :
కోర్సు వ్యవధి: 2-4 ఏళ్లు
సీట్ల సంఖ్య: 100
అర్హత: సోషల్ సైన్స్ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/హెల్త్ సైన్స్/మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ లేదా సంబంధిత కోర్సులు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ :
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫెలోషిప్: నెలకు రూ.50,000
వ్యవధి: ఏడాది
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2019, జనవరి 4.
హార్డ్‌కాపీలు పంపేందుకు చివరి తేది: 2019, జనవరి 11.
ఆన్‌లైన్ టెస్ట్ తేది: 2019, ఫిబ్రవరి 10.
ఎంపిక జాబితా విడుదల: 2019, ఫిబ్రవరి 20.
తరగతులు ప్రారంభం: 2019, జూలై 3 నుంచి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iipsindia.org

Published date : 13 Dec 2018 05:25PM