Skip to main content

Cannabis: వ్య‌స‌నానికి బానిసైతై జీవితం చిధ్రమే.. గంజాయి మ‌త్తులో యువ‌త‌..!

బెల్లంపల్లి: గంజాయి ఘాటు బెల్లంపల్లిని మత్తెక్కిస్తోంది. మహారాష్ట్ర నుంచి నిత్యకృత్యంగా గంజాయి సరఫరా అవుతుండడంతో ఎక్కడ చూసినా వాసన గుప్పుమంటోంది. తేలికగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో కొందరు మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రపూర్‌, తదితర ప్రాంతాల నుంచి కిలోలకొద్దీ గంజాయిని రైలుమార్గం ద్వారా తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Cannabis
వ్య‌స‌నానికి బానిసైతై జీవితం చిధ్రమే.. గంజాయి మ‌త్తులో యువ‌త‌..!

ఇటీవల బెల్లంపల్లికి చెందిన బాల్మీకి అనుదీప్‌ అనే యువకుడు రైల్వేస్టేషన్‌ ఆవరణలో గంజాయితో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరకు అమ్ముతుంటానని నిందితుడు బాహాటంగానే చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. 

ఇవీ చ‌ద‌వండి: ఈ టూల్స్ నేర్చుకుంటే ఫుల్‌ డిమాండ్‌... అర్హతలేంటంటే

నిర్మానుష్య ప్రాంతాలన్నీ అడ్డాలే...
పట్టణంలోని రైల్వే ఫ్లైవోవర్‌ బ్రిడ్జి కింద నిర్మాణుష్య ప్రాంతాలు, చెట్ల పొదలు, ఆర్టీసీ బస్టాండ్‌ ఏరియా, శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు, పోచమ్మ చెరువుకట్ట, రైల్వే స్టషన్‌ ఏరియా తదితర ప్రాంతాలు అడ్డాలుగా మారినట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు గ్రామాలు కూడా గంజాయి దమ్ముకు ప్రధాన స్థావరాలుగా మారినట్లు తెలుస్తోంది.

cannabis

మత్తులో యువకులు...
యువకులు మత్తులో జోగుతున్నారు. విద్యాభ్యాసం చేసే వయస్సులోనే గంజాయికి బానిస అవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీధి రౌడీల అవతారం ఎత్తుతున్నారు. మత్తులో ఎంతకై నా తెగించడానికి సిద్ధపడుతున్నారు. బెల్లంపల్లి, తాండూర్‌, సోమగూడెం పారిశ్రామిక ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల యువకులుసైతం దురలవాటుకు ఆకర్శితులవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చ‌ద‌వండి: చ‌దువుల్లో రారాజులు.. చంద్ర‌యాన్ 3లో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌ల విద్యార్హ‌త‌లు ఇవే!

కట్టడి చర్యలు కరువు...
మహారాష్ట్ర నుంచి జరుగుతున్న గంజాయి రవాణాపై అధికారులు సరిగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జీఆర్పీ పోలీసులు రైళ్లలో సోదాలు చేయక పోవడంతో యువకులు దర్జాగా గంజాయిని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏడాదికాలంలో అడపా దడపా చేసిన తనిఖీల్లో బెల్లంపల్లిలో 6, తాండూర్‌లో 2 కేసులు నమోదయ్యాయి. అదే రెగ్యులర్‌గా నిఘా పెట్టి తనిఖీలు చేపడితే గంజాయిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

bellampalli acp

పట్టుబడితే కఠిన చర్యలు
గంజాయితో పట్టుబడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. రోజువారీగా పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. నిఘా వ్యవస్థను అప్రమత్తం చేసి గంజాయి రవాణా చేస్తున్న యువకులపై ఓ కన్నేసి ఉంచాం. ఎవరైనా గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 
– పంతాటి సదయ్య, ఏసీపీ, బెల్లంపల్లి

Published date : 30 Aug 2023 01:18PM

Photo Stories