Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్-3 తెలుగు సిలబస్

గ్రూప్-3: పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-4)
పేపర్-1 జనరల్ స్టడీస్
  1. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
  2. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు
  3. సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి
  4. భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర
  5. స్వాతం్రతా్యనంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి
  6. తార్కిక విశ్లేషణా సామర్థ్యం, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ (Logical reasoning, analytical ability and data interpretation)
  7. విపత్తు నిర్వహణ ప్రాథమిక భావనలు (సీబీఎస్‌ఈ 8, 9వ తరగతి స్థాయి)
  8. భారతదేశ భూగోళ శాస్త్రం - భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం
  9. భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ
  10. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ
  11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
    ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
    బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
    సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
    డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
    ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
    ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
    జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
    హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు

పేపర్-2
  1. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిణామం
  2. పంచాయతీ కార్యదర్శి, విధులు, బాధ్యతలు
  3. గ్రామీణ సమాజం: గ్రామీణ పేదల అభవృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాల చరిత్ర మరియు పరిణామ క్రమం
  4. కేంద్రరాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు - ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు
  5. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య పథకాలు
  6. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ - వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు
  7. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం (Rural Credit Scenario) - బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మవిత్త సంస్థల పాత్ర
  8. సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాల కేంద్రీకరణ
  9. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి
  10. స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ
  11. వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ.
Published date : 09 Aug 2016 12:48PM

Photo Stories