Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్-1 తెలుగు సిలబస్

గ్రూప్-1

ప్రిలిమ్స్: జనరల్ స్టడీస్అండ్మెంటల్ ఎబిలిటీ

మార్కులు : 150

  1. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
  2. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు
  3. సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి.
  4. ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం, భారత భూగోళ శాస్త్రం మరియు ప్రపంచ భూగోళ శాస్త్రం.
  5. పాచీన, మధ్యయుగ మరియు ఆధునిక భారతదేశ చరిత్ర - జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు.
  6. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాల రూపకల్పన మరియు అమలు, పరిపాలన సంస్కరణలు, ఈ - పరిపాలన(e-governance) కార్యక్రమాలు.
  7. స్వాతంత్య్రానంతరం భారత ఆర్థికాభివృద్ధి మరియు ప్రణాళికల పాత్ర, భారతదేశం సమస్యలైన పేదరికం మరియు నిరుద్యోగం, వ్యవసాయ రంగ సమస్యలు, నీటిపారుదల మరియు నీరు, సుస్థిరాభివృద్ధి ద్రవ్యోల్బణం మరియు చెల్లింపుల శేషం (Balance of Payments), నిలకడతో కూడిన అభివృద్ది, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ది, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్, విత్తం వాణిజ్యం, మరియు సామాజిక రంగం, ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన సవాళ్లు, ప్రపంచ పోటీ, విత్త మార్కెట్ల అస్థిరత, విదేశీ ప్రత్యక్ష పెటుటబడుల ప్రవాహాలు తదితరాలు.
  8. పర్యావరణ క్షీణత మరియు సవాళ్లు - సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ
  9. విపత్తు నిర్వహణ, విపత్తు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలు, నివారణ మరియు ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్ మరియు జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా.
  10. తార్కిక విశ్లేషణా సామర్థ్యాలు, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ.
  11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
    ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
    బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
    సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
    డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
    ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
    ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
    జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
    హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు.

మెయిన్స్
ఇందులో మొత్తం 6 పేపర్లుంటాయి. కేవలం క్వాలిఫైయింగ్ కోసం నిర్దేశించిన జనరల్ ఇంగ్లిష్ పేపర్‌ను ప్రతి అభ్యర్థి తప్పక రాయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చిన మార్కులను మిగతా పేపర్లకు కలపరు.

పేపర్ -1: జనరల్ ఎస్సే

మార్కులు : 150

ఈ పేపర్‌లో మూడు విభాగాలుంటాయి. ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలు (వ్యాసాలు) ఉంటాయి. ప్రతి విభాగం నుంచి ఒక వ్యాసం చొప్పున మూడు వ్యాసాలు తప్పక రాయాలి. ప్రతి వ్యాసానికి 50 మార్కులు ఉంటాయి.

విభాగం-1: సంక్షోభ నిర్వహణ (Crisis Management), సామాజిక, ఆర్థికమరియుఆరోగ్య సమస్యలు, విశ్లేషణ మరియు పరిష్కారాలు. సంఘర్షణల విశ్షేషణలు, విధాన నిర్ణయాలు (Decision Making), ఎకలాజికల్ ఇంటెల్లిజెన్స్.
విభాగం-2: జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యమున్న వర్తమాన సంఘటనలు
విభాగం-3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన సంఘటనలు

పేపర్ - 2, 3, 4: పాఠ్య ప్రణాళిక మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగంలో ఐదు యూనిట్ల చొప్పున మొత్తం 15 యూనిట్లు ఉంటాయి.పతి యూనిట్‌లో రెండు ప్రశ్నలు ఉంటాయి. యూనిట్‌కు ఒక ప్రశ్న చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు కేటాయించారు.

పేపర్ -2

మార్కులు : 150

భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు రాజ్యాంగ విహంగ వీక్షణం
విభాగం-1: 20వ శతాబ్దంపై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర - సాంస్కృతిక వారసత్వం
  1. సింధూ నాగరికత, వేదకాలం నాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులు - క్రీ.పూ. 6వ శతాబ్దంలో నూతన మత శాఖల ఆవిర్భావం, - జైన, భౌద్ద మతాలు మరియు వాటి ప్రభావం - మౌర్యుల అభివృద్ధి - అశోకుని ధర్మ విధానం - సాంఘిక, సాంస్కృతిక జీవన విధానం - సంగం యుగం మరియు వారి సాహిత్యం - కుషాణులు మరియు సంస్కృతిలో వారి పాత్ర - గుప్తులు, వారి సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులు, హర్షవర్ధనుడు మరియు బుద్ధిజంలో అతని భాగస్వామ్యం.
  2. కంచి పల్లవులు, బాదామి చాళుక్యులు మరియు తంజావూరు చోళుల సామాజిక, మత పరిస్థితులు, భాషా సాహిత్యాలు, కళలు మరియు వాస్తుశిల్పం - ఢిల్లీ సుల్తానులు - సాంస్కృతిక అభివృద్ధి - భక్తి మరియు సూఫీ ఉద్యమాల ప్రాముఖ్యత మరియు వాటి ప్రభావం - మిశ్రమ సంస్కృతి - విజయనగర సామ్రాజ్యం సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులు.
  3. మొఘలులు - సామాజిక, మత జీవన విధానం మరియు సాంస్కృతిక అభివృద్ది - శివాజీ ప్రాభవం - యూరోపియన్ల రాక - వర్తక స్థాపన - ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ అభివృద్ధి - దాని ప్రాబల్యం - పరిపాలనా సంబంధమైన మార్పులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు - క్త్రెస్తవ మిషనరీల పాత్ర - బ్రిటీష్ పాలనకు అవరోధాలు - 1857 తిరుగుబాటు మరియు దాని ప్రభావం.
  4. సామాజిక మత సంస్కరణోద్యమాలు, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనిబీసెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు ఇతరులు - బ్రాహ్మనేతర మరియు ఆత్మగౌరవ ఉద్యమాలు, జ్యోతిబాపూలే నారాయణ గురు మరియు పెరియార్ రామస్వామి నాయకర్, మహాత్మగాంధీ, అంబేద్కర్ మరియు ఇతరులు.
  5. భారత జాతీయవాదం - జాతీయవాదం వృద్దికి కారణాలు - భారత స్వాతంత్య్రోద్యమంలో మూడు దశలు - 1885-1905, 1905-1920 మరియు గాంధీయుగం 1920-1947 - గిరిజన రైతాంగ మరియు కార్మికోద్యమాలు, భూసామ్య వ్యతిరేఖ మరియు వలసవాద వ్యతిరేక ఉద్యమాల్లో వామపక్షాల పాత్ర - మహిళా మరియ దళిత ఉద్యమాలు - కమ్యూనలిజం ఆవిర్భావం మరియు అభివృద్ధి - స్వాతంత్య్ర సిద్ధి మరియు భారతదేశ విభజన.

విభాగం-2: ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర
  1. ప్రాచీన ఆంధ్ర: శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు మరియు విష్ణుకుండినుల సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు - మతం, భాష, సాహిత్యం, కళలు మరియు వాస్తు శిల్పం - వేంగి చాళుక్యుల సామాజిక జీవనం, మత విధానం, తెలుగు భాష, సాహిత్యం, అభ్యాసం, కళలు మరియు వాస్తు శిల్పం.
  2. మధ్యయుగ ఆంధ్ర: క్రీ.శ 1000-1565 మధ్య ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక మరియు మత పరిస్థితులు - తె లుగు భాషా మరియు సాహిత్యం అభివృద్ధి - (కవిత్రయం - అష్టదిగ్గజాలు) - లలిత కళలు, చిత్రలేఖనం మరియు వాస్తు శిల్పం - కట్టడాలు ప్రాముఖ్యత - ఆంధ్రచరిత్ర మరియు సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీలు చేసిన సేవలు
  3. ఆధునిక ఆంధ్ర: ఆంధ్రలో యూరోపియన్ల వర్తక స్థాపన - కంపెనీ పాలన కింద ఆంధ్ర - విద్యా విధానం - క్త్రెస్తవ మిషనరీల పాత్ర - సామాజిక సాంస్కృతిక చైతన్యం - వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు మరియు ఇతరులు - వార్తాపత్రికల పాత్ర.
  4. ఆంధ్రలో జాతీయోద్యమం మరియు జాతీయోద్యమంలో ఆంధ్ర నాయకుల పాత్ర - బ్రాహ్మనేతర ఉద్యమం మరియు జస్టిస్ పార్టీ - జాతీయవాద మరియు విప్లవవాద కవిత్వం - గుర్రం జాషువ, బోయి బీమన్న, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, గరిమెళ్ల సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి మరియు ఇతరులు - ఆంధ్ర హహాసభలు - ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమం - 1903 నుంచి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు 1953 వరకు - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ మరియు దాని సిఫార్సులు - ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు 1956 - 1956-2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనలు.
  5. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
    ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
    బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
    సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
    డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
    ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
    ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
    జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
    హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
    ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు

విభాగం - 3: భారత రాజ్యాంగం విహంగ వీక్షణం
  1. భారత రాజ్యాంగం - రాజ్యంగ నిర్మాణం, బ్రిటిషు పాలన వారసత్వాలు - రాజ్యాంగ సభ - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రత్యేక లక్షణాలు - ప్రవేశిక, ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు మరియు వాటి మధ్య సంబంధం - ప్రాథమిక విధులు - భారత రాజకీయ వ్యవస్థపై సామాజిక ఆర్థిక అంశాల ప్రభావం.
  2. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం మరియు విధులు - శాసన నిర్వహణ వ్యవస్థ, కార్య నిర్వహణ వ్యవస్థ, న్యాయ నిర్వహణ వ్యవస్థ మరియు వాటి మధ్య సంబంధం - రాష్ర్ట ప్రభుత్వాలు - శాసన, కార్య నిర్వాహక, మరియు న్యాయ నిర్వాహక సంబంధాలు - శాసన వ్యవస్థ రకాలు - ఏకసభ, ద్విసభా, కార్యనిర్వాహక మరియు పార్లమెంటరీ విధానాలు, న్యాయ నిర్వహణ - న్యామసమీక్ష మరియు న్యాయవ్యవస్థ క్రియాశీలత.
  3. భారత దేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు - పరిపాలన, శాసన మరియు ఆర్థిక సంస్కరణల ఆవశ్యకత -రాజ్‌మన్నార్, సర్కారియా మరియు ఎంఎం పూంచీ కమిషన్ల సూచనలు - నీతి ఆయోగ్ పాత్ర - భారతదేశం సమాఖ్య లేదా ఏకకేంద్ర వ్యవస్థనా? - రాజ్యాంగబద్ధ సంస్థల అధికారాలు మరియు విధులు - కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు మరియు కాగ్.
  4. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ - రాజ్యాంగ సమీక్ష కమీషన్ - సామాజిక అభివృద్ధి పథకాలు - ప్రజాస్వామ్య మూలాలు - పట్టణ మరియు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు - 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలు మరియు వాటి అమలు.
  5. రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - పార్టీ వ్యవస్థ రకాలు - ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళపార్టీ వ్యవస్థలు - ప్రాంతీయతత్వం - ఉప ప్రాంతీయతత్వం, కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ -శ్రీ కృష్ణ కమిటీ - జాతీయ సమగ్రతకు ముప్పు - ఎన్నికలు - ఎన్నికల విధానం - ఎన్నికల కమీషన్ పాత్ర - సంస్కరణల అవసరం - ఓటింగ్ సరళి.
  6. సామాజిక ఉద్యమాలు మరియు భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - రైతులు, పౌరహక్కులు, మహిళలు, గిరిజన, దళిత మరియు పర్యావరణం - ఎస్సీ, ఎస్టీ, మరియు బీసీల సంస్కరణల ఆవశ్యకత - ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం - జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ కమీషన్లు - మహిళా కమిషన్ - జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమీషన్స్ - మానవ హక్కుల కమీషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్ మరియు లోకాయుక్త.

పేపర్ - 3
విభాగం-1: భారతదేశంలో ప్రణాళికలు మరియు భార తదేశ ఆర్థిక వ్యవస్థ
  1. భారతదేశంలో జాతీయదామం మరియు ఇతర స్థూలఆర్థిక సముదాయాలు - ధోరణులు, జాతీయాదాయంలో వివిధ రంగాల వాటా - మానవాభివృద్ధి సూచికలు - వాటి ప్రాముఖ్యత మరియు మాపనాలు.
  2. భారత ఆర్థిక ప్రణాళిక - లక్షణాలు - రకాలు -లక్ష్యాలు - విజయాలు మరియు వైఫల్యాలు, - 12వ పచవర్ష ప్రణాళిక దార్శనికత - సామర్థ్యం - ఆర్థిక సంస్కరణలు మరియు సరళీకరణ - ఆర్థిక సంక్షోభం పుట్టుక (Meltdown in 2007-08) మార్కెట్ వైఫల్యం-ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల పాత్ర.
  3. భారత దేశంలో పేదరికం మరియు నిరుద్యోగిత - భావనలు - తీవ్రత - మాపనాలు - కారణాలు, పేదరిక నిర్మూలన చర్యలు, నిరుద్యోగిత స్వభావం - రకాలు - కారణాలు - నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధానాలు - మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - ఆదాయ అసమానతలు - కారణాలు - మాపనాలు - దిద్దుబాటు చర్యలు.
  4. ద్రవ్య విధానం - లక్ష్యాలు - భారత రిజర్వు బ్యాంక్ విధులు - ద్రవ్య నియంత్రణ - భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం - ఆర్థిక రంగ సంస్కరణలు - కేంద్ర రాష్ట్రాల ఆదాయ మరియు వ్యయాల ధోరణులు - భారత ప్రభుత్వ రుణం - కేంద్ర బడ్జెట్ విశ్లేషణ.
  5. భారతదేశ ఆర్థిక సమస్యలు - పౌష్టిక మరియు సంతులిత ఆహారం - అందరికీ ఆరోగ్యం మరియు ప్రాథమిక విద్యను అందిచడం - ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఆర్థిక అవస్థాపనా సౌకర్యాల కల్పన - వ్యవసాయిక సంక్షోభం - వలసలు - పట్టణీకరణ - మురికివాడల వృద్ధి, వాతావరణ మార్పులు, నీటిపారుదల మరియు నీరు, నైపుణ్యాభివృద్ధి మరియు జనాభా రూపురేఖలు, పర్యావరణ క్షీణత.

విభాగం-2: స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కర ణలు మరియు సామాజిక మార్పులు
  1. భూసంస్కరణల ప్రారంభం - దళారీల రద్దు - కౌలుసంస్కరణలు - ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిమితి.
  2. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం - రంగాల వారీ మరియు ప్రాంతీయ విశ్లేషణ - పేదరిక పరిమాణం - వ్యవసాయ ఉత్పాదకాలు మరియు సాంకేతికత.
  3. జనాభా రూపు రేఖలు మరియు సామాజిక వెనుకబాటు - అక్షరాస్యత మరియు వృత్తి పరమైన నిర్మాణం - ఆదాయ మరియు ఉద్యోగాలకు రంగాల వారీ పంపిణీలో మార్పులు - మహిళల సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక సాధికారత.
  4. రాష్ర్ట ఆర్థిక మరియు బడ్జెటరీ విధానాలు - రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మరియు వ్యయాల ధోరణులు - ప్రభుత్వ రుణం - రాష్ట్ర బడ్జెట్‌పై విశ్లేషణ.
  5. ఆంధ్రప్రదేశ్‌లో పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు, ప్రాంతీయ అసమానతలు - ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వ్యూహాలు.

విభాగం-3: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి, బలాలు మరియు బలహీనతలు
  1. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటు మరియు వృద్ధి, ఫ్యాక్టరీలు, సూక్ష్మ మరియు చిన్న రంగాలు, వాటి కూర్పు మరియు వృద్ధి - సమస్యలు - దిద్దుబాటు చర్యలు.
  2. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధి - వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత ధోరణులు - వ్యవసాయ ధరల విధానం - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ.
  3. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, పారిశ్రామికోత్పత్తి, నీటి పారుదల, ఆరోగ్యం మరియు విద్యలో ప్రాంతీయ అసమానతలు.
  4. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలు - గ్రామీణ రుణ వనరులు -సంస్థాగత మరియు సంస్థాగతేతర - సహకార రుణ సంస్థలు - సూక్ష్మరుణం మరియు అభివృద్ధి - రుణ లభ్యత. విద్యుత్, రవాణా, సమాచారం, పర్యాటకం మరియు ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టితో ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం.
  5. వృద్ధి కేంద్రాలు - ఖనిజాన్వేషణ - ఆంధ్రప్రదేశ్‌లో అవస్థాపన ప్రాజెక్టులు - ఓడరేవుల అభివృద్ధి - ప్రపంచస్థాయి విద్యాసంస్థలు.

పేపర్ - 4
విభాగం-1:
భారతదేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర మరియు ప్రభావం
యూనిట్-1: శాస్త్ర మరియు సాంకేతిక రంగాలు - సాంప్రదాయ మరియు ఆధునిక క్షేత్రాలు, దైనందిన జీవితంలో వాటి ఉపయోగం, శాస్త్ర, సాంకేతిక జాతీయ విధానం దాని మార్పులు, జాతి నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక అంశాల ప్రాధాన్యత.

యూనిట్-2: శాస్త్ర మరియు సాంకేతిక జాతీయ విధానాలు - విధానాలలోని బలాలు, టెక్నాలజీ మిషన్స్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రాథమిక అంశాలు - గ్రామీణ భారతంలో సమాచార మరియు సాంకేతిక రంగం పాత్ర, ఆర్థిక ప్రగతిలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, నానో టెక్నాలజీ అభివృద్ధి, విభిన్న రంగాల్లో నానో టెక్నాలజీ పాత్ర.

యూనిట్-3: భారత్‌లో అంతరిక్ష కార్యక్రమాలు, వ్యవసాయ, పారిశ్రామిక మరియు ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో దాని అనువర్తనాలు, ఐఎన్‌ఎస్‌ఏఆర్, ఐఆర్‌ఎస్, ఎడ్యుశాట్, చంద్రయాన్, మంగళయాన్, మరియు ఇతర భవిషత్తు కార్యక్రమాలు, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష కార్యక్రమాల పాత్ర.

యూనిట్-4: శక్తి వనరులు: శక్తి అవసరాలు, భారతీయ ఇంధన శాస్త్రాలు, సాంప్రదాయక ఇంధన వనరులు, థర్మల్, పునరుత్పాదక శక్తి వనరులు, సౌర, పవన, జీవ మరియు వ్యర్థ ఆధారిత శక్తి విధానాలు, జియోథర్మల్ మరియు అలల వనరులు, భారత్‌లో శక్తి విధానాలు, శక్తి భద్రత.

యూనిట్-5: భారత్‌లో వర్తమాన శాస్త్ర సాంకేతికాంశాల అభివృద్ధి, భూతాపం మరియు వాతావరణ మార్పు, వరద లు, తుఫానులు మరియు సునామీ, సహజ మరియు మానవ కారక విపత్తులు, సునామీ, సమీకరణ మరియు పారిశ్రామికీకరణ.

విభాగం-2: జీవ సంబంధ వనరులు, మానవ సంక్షేమం, జీవశాస్త్రాల్లో ఆధునిక ధోరణులు
యూనిట్-1: జీవ సంబంధ వనరులు: మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవుల ప్రాథమిక వర్గీకరణ, సూక్ష్మజీవ వనరులు - కిణ్వన అభివృద్ధి చరిత్ర, పారిశ్రామికంగా కిణ్వన ఉత్పత్తుల ప్రాముఖ్యత, యాంటీ బయాటిక్స్, ఆర్గానిక్ యాసిడ్స్, ఆల్కహాల్స్, విటమిన్స్, అమైనో ఆమ్లాలు, ఇన్సులిన్ మరియు పెరుగుదల హర్మోన్లు.

యూనిట్-2: మొక్కలు మరియు జంతు వనరులు: ఆహారం, గ్రాసం, ఔషధాలు, నారలు మరియు ఇతర ఉత్పత్తుల్లో మొక్కల ఉపయోగాలు, వ్యవసాయ సేద్యపు మొక్కలు - వాటి మూలాలు మరియు స్థానికమైనవి. విషపూరిత మొక్కలు, వన్యప్రాణులు మరియు సాధు జంతువులు, ఆహారం, మరియు ఔషధాల తయారీలో జంతువుల ఉపయోగం.

యూనిట్-3: మానవ వ్యాధులు - సూక్ష్మజీవ ఇన్ఫెక్షన్లు: సాధారణ ఇన్ఫెక్షన్లు మరియు నివారణ చర్యలు. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్ మరియు ఫంగస్‌ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు. డయోరియా డీసెంట్రీ, కలరా, క్షయ, మలేరియా మరియు వైరల్ వ్యాధులైన హెచ్‌ఐవీ, ఎన్‌సెఫలైటిస్, చికన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ వంటి వ్యాధుల గురించి ప్రాథమిక పరిజ్ఞానం - వ్యాధి సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

యూనిట్-4: జన్యు ఇంజనీరింగ్ మరియు జీవ సాంకేతికత: జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాథమిక భావనలు, కణజాల వర్ధనం - పద్ధతులు మరియు అనువర్తనాలు. వ్యవసాయంలో జీవసాంకేతికత - బయోపెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్, జీవ ఇంధనాలు, జన్యుపరివర్తన మొక్కలు, పశుపోషణ - సంకతజాతి జంతువులు.

యూనిట్-5: వ్యాక్సిన్లు: రోగ నిరోధకత పరిచయం, వ్యాక్సినేషన్ ప్రాధమిక భావనలు, ఆధునిక వ్యాక్సిన్ల ఉత్పత్తి (హెపటైటిస్ వ్యాక్సిన్ల ఉత్పత్తి)

విభాగం-3: జీవావరణం, సహజవనరులు మరియు పర్యావరణ అంశాలు
యూనిట్-1: జీవావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం: జీవావరణ వ్యవస్థ నిర్మాణం మరియు విధులు. జీవావరణం, ఉత్పాదకత మరియు ఆహారపు గొలుసులోకి శక్తి ప్రవాహం, జీవ భౌగోళిక రసాయన వలయాలు - సిద్ధాంతాలు. జీవావరణ రకాలు, భౌగోళిక మరియు సమద్ర జీవావరణం - సహజ జన్యు జాతుల జీవావరణ వైవిధ్యాలు, దాని విలువ - ఆర్థిక విలువలు(ఆహారం, నార, ఔషధాలు) మరియు జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లు. జీవ వైవిధ్యానికి ముప్పు, సహజ మరియు బాహ్య ప్రాంతాల్లో జీవ వైవిధ్య పరిరక్షణ.

యూనిట్-2: సహజ వన రులు రకాలు: పునరుత్పాదక మరియు పునరుత్పాదకం కానివి. అటవీ వనరులు. ఫిషింగ్ వనరులు. శిలాజ ఇంధనాలు - బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు. ఖనిజ వనరులు. జల వనరులు - రకాలు. వాటర్ షెడ్ నిర్వహణ. భూ వనరులు - మృత్తిక రకాలు మరియు మృత్తిక పునరుద్ధరణ, సాంప్రదాయేతర శక్తి వనరులు.

యూనిట్-3: పర్యావరణ కాలుష్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ: వాయు, జల మరియు మృత్తిక కాలుష్య కారకాలు, ప్రభావం మరియు నియంత్రణ. శబ్ద కాలుష్యం. ఘన వ్యర్థాల నిర్వహణ - ఘన వ్యర్థాల రకాలు మరియు ఉత్పత్తి కారకాలు, ఘన వ్యర్థాల ప్రభావం, పునరుత్పత్తి మరియు పునర్వినియోగం.

యూనిట్-4: ప్రపంచ పర్యావరణ అంశాలు మరియు మానవ ఆరోగ్యంలో సమాచార సాంకేతికత పాత్ర, ఓజోన్ క్రమక్షయం, ఆమ్లవర్షాలు. వాతావరణ మార్పు మరియు దాని ప్రభావాలు.

యూనిట్-5: పర్యావరణ చట్టాలు: అంతర్జాతీయ చట్టాలు, మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ యునెటైడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, సీఐటీఈఎస్. పర్యావరణ పరిరక్షణ చట్టం -1986, అటవీ సంరక్షణ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టం, భారత్‌లో జీవ వైవిధ్య బిల్లు.

పేపర్-5
దత్తాంశాల విశదీకరణ మరియు సమస్యల పరిష్కారం (Data Interpretation & Problem Solving)
  1. దత్తాంశ విశ్షేషణ: గణాంక దత్తాంశ విశ్లేషణ మరియు వివరణ, గ్రాఫ్స్ మరియు చార్టుల అధ్యయనం, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ మరియు పై చార్ట్స్ వినియోగం ద్వారా ముగింపునకు రావడం.
  2. సమస్యా పరిష్కారం:
    ఎ. కాలం మరియు పని, వేగం-కాలం-దూరం, బారువడ్డీ మరియు చక్రవడ్డీ, క్యాలెండర్ మరియు గడియారాలపై సమస్యలు, రక్త సంబంధాలు మరియు సీటింగ్ అరేంజ్‌మెంట్.
    బి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - నంబర్ సిస్టమ్ మరియు నంబర్ సీక్వెన్సెస్, సిరీస్, సగటు, నిష్పత్తి మరియు అనుపాతం, లాభనష్టాలు.
    సి. కోడింగ్ & డీకోడింగ్: ఇంగ్లిష్లో ఇచ్చిన ఒక పదం లేదా కొన్ని అక్షరాలను ఇచ్చిన కోడ్‌ల ఆధారంగా కోడ్ లేదా డీకోడ్ చేయాలి.
  3. ప్యాసేజ్ విశ్లేషణ: అభ్యర్థులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఎదురయ్యే సమస్యను విశ్లేషించి దానికి వారి సొంత పరిష్కారాన్ని రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ పరిస్థితి అభ్యర్థులకు ఎంతవరకు అర్థమయిందో తెలుసుకోవడానికి కూడా పరిస్థితి ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
Published date : 08 Aug 2016 03:38PM

Photo Stories