APPSC: గ్రూప్–1, 2 పోస్టుల భర్తీకి అనుమతి.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండిలా..
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మార్చి 31న ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
గ్రూప్–1 పోస్టులు
విభాగం |
పోస్టులు |
డిప్యూటీ కలెక్టర్లు |
10 |
రోడ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్లు (ఆర్టీవో) |
07 |
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (సీటీవో) |
12 |
జిల్లా రిజిస్ట్రార్ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు) |
06 |
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి |
01 |
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి |
01 |
జిల్లా బీసీ సంక్షేమ అధికారి |
03 |
డీఎస్పీ (సివిల్) |
13 |
డీఎస్పీ (జైళ్లు –పురుషులు) |
02 |
జిల్లా అగ్రిమాపక అధికారి (డీఎఫ్‌వో) |
02 |
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ |
03 |
మున్సిపల్ కమిషనర్ |
01 |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 |
08 |
డిప్యూటీ రిజిస్ట్రార్ (కోపరేటివ్ డిపార్ట్‌మెంట్) |
02 |
లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్–2 |
05 |
ఏటీవో/ఏఏవో (ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్) |
08 |
ఏఏవో (డీఎస్‌ఏ) (స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) |
04 |
ఏవో (డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) |
15 |
ఎంపీడీవో |
07 |
మొత్తం |
110 |
గ్రూప్–2 పోస్టులు..
విభాగం |
పోస్టులు |
డిప్యూటీ తహసీల్దార్ |
30 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 |
16 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోపరేటివ్ |
15 |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 |
05 |
ఏఎల్‌వో (లేబర్) |
10 |
ఏఎస్‌వో (లా) |
02 |
ఏఎస్‌వో (లేజిస్లేచర్) |
04 |
ఏఎస్‌వో (సాధారణ పరిపాలన) |
50 |
జూనియర్ అసిస్టెంట్స్ (సీసీఎస్) |
05 |
సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
10 |
జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
20 |
సీనియర్ అడిటర్ (స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) |
05 |
ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్) |
10 |
మొత్తం |
182 |