కాంతి: దృష్టి లోపాలు- రకాలు
Sakshi Education
హ్రస్వదృష్టి: కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి, దూరంగా ఉన్న వాటిని సరిగా చూడలేకపోవడాన్ని ‘హ్రస్వదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న వికేంద్రీకరణ (పుటాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.
దూరదృష్టి(లేదా)దీర్ఘదృష్టి: కంటికి దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోవడాన్ని ‘దూరదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ(కుంభాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.
అసమదృష్టి: కంటిలోని కార్నియాలో లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లోపం ఉన్న వ్యక్తులు ఒక వస్తువును చూసినప్పుడు అది అడ్డుగీతలు లేదా నిలువు గీతలుగా మాత్రమే కనిపిస్తుంది. ఈ లోపాన్ని సవరించడానికి స్తూపాకార కటకం వాడతారు.
చత్వారం: కొంత మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను దాని నేత్రానుగున్యతను కోల్పోతుంది. ఫలితంగా దగ్గరగా ఉన్న వస్తువును లేదా కొంత దూరంలో ఉన్న వస్తువును చూడటం వీలుకాదు. ఈ దృష్టి లోపాన్ని సవరించడానికి ద్వినాభి కటకాన్ని ఉపయోగిస్తారు.
రేచీకటి: విటమిన్-ఎ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రేచీకటితో బాధపడే వారు పగటి సమయంలో మాత్రమే చూడగలుగుతారు. రాత్రివేళలో కృత్రిమ కాంతి జనకాల నుంచి వచ్చే కాంతి తీవ్రత వీరిలో దృష్టిజ్ఞానాన్ని ప్రేరేపించదు. ఈ సమస్య నివారణకు విటమిన్-ఎ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
వర్ణాంధత్వం: కంటిలోని కోన్లలో తలెత్తే లోపం వల్ల వర్ణాంధత్వం కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు అన్ని రంగులను గుర్తించలేరు. తల్లిదండ్రుల జన్యువుల ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ దృష్టి లోపాన్ని నివారించడానికి ఎలాంటి ఔషధాలు, చికిత్సా విధానం అందుబాటులో లేదు.
అదృశ్య వికిరణాలు
పరారుణ కిరణాలు: వీటిని విలియం హెర్షెల్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి 7,500 Å- 40,00,000Å. అన్ని రకాల గాజు పదార్థాలు ఈ కిరణాలను శోషించుకుంటాయి. రాతి ఉప్పుతో తయారైన పట్టకాలు, కటకాల ద్వారా ఈ తరంగాలు చొచ్చుకొని వెళ్లలేవు. కాబట్టి ఈ కటకాలను ఉపయోగించి పరారుణ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
పరారుణ కిరణాలు తమ వెంట ఉష్ణాన్ని మోసుకెళుతూ ఎదురుగా ఉన్న వస్తువులను తాకినప్పుడు వాటికి ఉష్ణాన్ని బదిలీ చేస్తాయి. అందువల్ల ఈ కిరణాలను ఉష్ణ వికిరణాలు అని కూడా అంటారు. ఉష్ణ వికిరణ సూత్రం ఆధారంగా థర్మోఫైల్, బోలోమీటర్ సాధనాలను ఉపయోగించి పరారుణ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
అనువర్తనాలు:

- కండరాల నొప్పి, బెణకడం వల్ల వచ్చే నొప్పుల నివారణకు పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. పక్షవాతానికి చికిత్సలో, టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లో వీటిని వినియోగిస్తారు.
- ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రహస్య సాంకేతికాలను ప్రసారం చేయడానికి ఈ కిరణాలు ఉపయోగపడతాయి.
- రిమోట్ సెన్సింగ్ విధానంలో వాడతారు.
- గోడలపై ఉన్న పాత చిత్రలేఖనాలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
- పరారుణ కిరణాల తరంగదైర్ఘ్యం ఎక్కువ. అందువల్ల పొగమంచు, దుమ్ము, ధూళి కణాల ద్వారా ఈ తరంగాలు తక్కువ పరిక్షేపణం చెందుతాయి. రుజుమార్గంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి ఇలాంటి పదార్థాల ద్వారా వస్తువులను చూడటానికి, ఫొటోలు తీయడానికి ఈ కిరణాలను వాడతారు.
- భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలను నియంత్రించడానికి వాడతారు.
- నైట్ విజన్ కెమెరా, బైనాక్యులర్లలో ఈ కిరణాలను వాడతారు. రాత్రి వేళల్లో ఈ పరికరాలతో వస్తువులను స్పష్టంగా చూడవచ్చు.
- పరిశ్రమల బట్టీలు, కొలిమిల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలను సృష్టించడానికి వాడతారు.
- పరారుణ కిరణాల ఆధారంగా వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచే పద్ధతిని థర్మోగ్రఫీ అంటారు.
- గ్లోబల్ వార్మింగ్‌ను, ఒక ప్రదేశంలోని శీతోష్ణస్థితులను అధ్యయనం చేయడానికి ఈ తరంగాలను ఉపయోగిస్తారు.
- టెలిస్కోప్ పనిచేయడానికి కూడా ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
అతినీలలోహిత కిరణాలు: వీటిని రిట్టెర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి 100Å- 4000Å. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల శక్తి చాలా ఎక్కువ. క్వార్ట్జ గాజు మినహా మిగతా గాజు పదార్థాలన్నీ ఈ కిరణాలను శోషించుకుంటాయి. అందువల్ల క్వార్ట్జతో నిర్మించిన కటకాలు, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
గమనిక: అతినీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి.
అనువర్తనాలు:
గమనిక: అతినీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి.
అనువర్తనాలు:
- పాలు, నీళ్లలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నశింపజేయడానికి, ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.
- వైద్య రంగంలో స్టెరిలైజేషన్ కోసం (హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేయడానికి) ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
- పాడైన కోడిగుడ్లను గుర్తించడానికి వాడతారు.
- సహజ, కృతిమ దంతాల మధ్య తేడాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
- టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లోనూ వినియోగిస్తారు.
- తొలిదశలో ఉన్న కేన్సర్ గడ్డలను కరిగించడానికి వీటిని వాడతారు.
- వేలిముద్రలను విశ్లేషించడానికి వాడతారు.
- వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి వీటిని ఉపయోగించుకుంటాయి.
- అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు 1 మి.మీ. లోతుకు చొచ్చుకెళ్లి విటమిన్-డిని ప్రేరేపిస్తాయి. రికెట్స్ వ్యాధి రాకుండా విటమిన్-డి తోడ్పడుతుంది.
- నకిలీ డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను గుర్తించడానికి వినియోగిస్తారు.
రేడియో తరంగాలు: వీటిని జేమ్స్ మాక్స్వెల్ కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి 1 మిల్లీ మీటరు నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఒక రకమైన విద్యుదయస్కాంత కిరణాలు. కాబట్టి శూన్యంలో, గాలిలో రేడియో తరంగాల వేగం కాంతి వేగానికి (C = 3×108 m/s) సమానంగా ఉంటుంది.
అనువర్తనాలు:
- రేడియో కార్యక్రమాల ప్రసారాల్లో వినియోగిస్తారు.
- టెలిస్కోప్‌లు పనిచేయడానికి వాడతారు.
- రాడార్లు పనిచేయడానికి ఉపయోగిస్తారు.
- వాతావరణంలోని మార్పులను ముందుగా గుర్తించడానికి ఈ తరంగాలను ఉపయోగిస్తారు.
అనువర్తనాలు:
- నావిగేషన్ విధానంలో (వాహనాలు, నౌకలు, విమానాల మార్గాలను తెలుసుకోవడానికి) ఉపయోగిస్తారు.
- టెలిమెట్రీ విధానంలో వాడతారు. భూమి నుంచి ఒక అంతరిక్ష నౌక మధ్య ఉండే దూరాన్ని కొలిచే పద్ధతిని టెలిమెట్రీ అంటారు.
- భూమి ఉపరితలం నుంచి మేఘాల ఎత్తు, అవి కదిలే దిశను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
- ఆప్టికల్ ఫైబర్ ద్వారా సమాచార ప్రసారం కోసం వీటిని వినియోగిస్తారు.
- మైక్రో ఓవెన్లో ఆహార పదార్థాలను వేడిచేయడానికి వాడతారు.
- ఈ తరంగాలు ఆహార పదార్థంలోని అణువుల లోపలికి చొచ్చుకెళ్లి వాటి కంపనాలను పెంచుతాయి. అందువల్ల ఈ కణాల కంపన శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. ఫలితంగా ఆహార పదార్థాలు వేడుక్కుతాయి.
Published date : 10 Sep 2015 03:14PM