భారత సామాజిక ఆర్థిక సర్వే, కుల గణన
- గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది.
- పట్టణ ప్రాంతానికి సంబంధించిన సమాచార సేకరణను మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ చేపట్టింది.
- కుల గణనకు సంబంధించిన సమాచార సేకరణను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టాయి.
- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011, జూన్ 29న సమగ్రసర్వే విధానంలో గడప గడపకు సామాజిక, ఆర్థిక, కుల గణనను ప్రారంభించింది.
సామాజిక ఆర్థిక, కుల గణన- ముఖ్యాంశాలు (2011- గ్రామీణ పట్టణ కుటుంబాల వివరాలు)
వివరాలు | భారతదేశం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ రాష్ర్టం |
మొత్తం కుటుంబాలు | 24,49,21,406 | 1,22,70,164 | 82,44,441 |
మొత్తం గ్రామీణ కుటుంబాలు | 17,97,87,454 | 93,44,180 | 56,43,739 |
గ్రామీణ కుటుంబాల శాతం | 73.41% | 76.15% | 68.46% |
మొత్తం పట్టణ కుటుంబాలు | 6,51,33,952 | 29,25,984 | 26,00,702 |
పట్టణ కుటుంబాల శాతం | 26.59% | 23.85% | 31.54% |
మొత్తం జిల్లాలు | 640 | 13 | 10 (31) |
మొత్తం గ్రామ పంచాయతీలు | 2,96,770 | 13,061 | 9,477 |
మొత్తం గ్రామాలు | 6,44,648 | 17,521 | 10,582 |
మొత్తం పట్టణాలు | 4,460 | 94 | 71 |
- సామాజిక, ఆర్థిక, కుల గణన గణాంకాలు భారత సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలపడంతోపాటు విధానాల రూపకల్పన లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గ దర్శకంగా నిలుస్తాయి.
- 2011 జన గణనను ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణన 2011-2012 మధ్య జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో 2013లో కూడా అంతిమ పరిశీలన జరిపారు.
- సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం జనాభా లెక్కలను నిర్వహిస్తారు. దీని ప్రకారం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచాలి. ఆర్థిక వ్యవస్థను స్థూలంగా అవగాహన చేసుకోవడమే దీని ముఖ్యోద్దేశం.
సామాజిక ఆర్థిక, కుల గణనలోని ఇతర అంశాలు
- మన దేశంలోని మొత్తం కుటుంబాలు 24,49,21,406. ఇందులో గ్రామీణ కుటుంబాలు 17,97,87,454 (73.41%), పట్టణ కుటుంబాలు 6,51,33,952 (26.59%)
- జాతీయ స్థాయిలో గ్రామీణ కుటుంబాలు 73.41% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ కుటుంబాలు 76.15%.
- భారతదేశంలో మొత్తం 6,44,648 గ్రామాలుండగా, గ్రామ పంచాయతీలు 2,96,770 ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17,521 గ్రామాలుండగా, 13,061 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
- తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 10,582 గ్రామాలుండగా, గ్రామ పంచాయతీలు 9,477 ఉన్నాయి,
- భారతదేశంలో మొత్తం 4,460 పట్టణాలుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 94, తెలంగాణలో 71 పట్టణాలున్నాయి.
- 56.25% గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయ భూమి లేదు.
- 9.68% గ్రామీణ కుటుంబాల్లోని సభ్యులు మాత్రమే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కలిగి ఉన్నారు.
- 1.61% కుటుంబాలు వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తున్నాయి.
- 75% గ్రామీణ కుటుంబాల్లోని వ్యక్తుల నెలసరి గరిష్ట సంపాదన రూ.5000 లోపే ఉంది.
- 40% గ్రామీణ కుటుంబాల్లోని వారు మాన్యువల్ శ్రామికులుగానే ఉన్నారు.
- 25% గ్రామీణ కుటుంబాలకు సొంత ఫోన్ లేదు.
- గ్రామీణ కుటుంబాల్లో 8.29 శాతం సభ్యులు మాత్రమే నెలవారీగా 10,000 పైగా సంపాదిస్తున్నారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో షెడ్యూల్ కులాల మొత్తం జనాభా 20,13,78,086. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 15,38,50,562 మంది, పట్టణ ప్రాంతంలో 4,75,27,524 మంది ఉన్నారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో మొత్తం జనాభా 121,08,54,977. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 16.63%
గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, ఇతర కుటుంబాల వివరాలు
వివరాలు | భారతదేశం | శాతం | ఆంధ్రప్రదేశ్ | శాతం | తెలంగాణ | శాతం |
ఎస్సీకుటుంబాలు | 3,31,64,085 | 18.45 | 17,34,814 | 18.57 | 10,17,057 | 18.02 |
ఎస్టీ కుటుంబాలు | 1,97,37,399 | 10.98 | 5,62,239 | 6.02 | 6,50,414 | 11.52 |
ఇతర కుటుంబాలు | 12,31,61,662 | 68.50 | 70,43,605 | 75.38 | 39,74,328 | 70.42 |
కులం పేర్కొననివి | 36,79,958 | 2.07 | 3,231 | 0.03 | 1,582 | 0.04 |
ఎక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు
1. పంజాబ్ | 31.9% |
2. హిమాచల్‌ప్రదేశ్ | 25.2% |
3. పశ్చిమబెంగాల్ | 23.5% |
4. ఉత్తరప్రదేశ్ | 20.7% |
5. హర్యానా | 20.2% |
తక్కువ శాతం షెడ్యూల్డ్ కులాల జనాభా కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. మిజోరం | 0.1 శాతం |
2. మేఘాలయా | 0.6 శాతం |
3. గోవా | 1.7 శాతం |
4. దాద్రా, నగర్‌హవేలీ | 1.8 శాతం |
5. డామన్ అండ్ డయ్యూ | 2.5 శాతం |
- షెడ్యూల్డ్ తెగల మొత్తం జనాభా 10,42,81,034 (8.61%)
- షెడ్యూల్డ్ తెగల మొత్తం గ్రామీణ జనాభా 9,38,19,162
షెడ్యూల్డ్ తెగల జనాభా ఎక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
1. లక్షద్వీప్ | 94.8 శాతం |
2. మిజోరం | 94.4 శాతం |
3. నాగాలాండ్ | 86.5 శాతం |
4. మేఘాలయ | 86.1 శాతం |
5. అరుణాచల్‌ప్రదేశ్ | 68.8 శాతం |
షెడ్యూల్డ్ తెగల జనాభా తక్కువ శాతం కలిగిన రాష్ట్రాలు
1. ఉత్తరప్రదేశ్ | 0.6 శాతం |
2. తమిళనాడు | 1.1 శాతం |
3. బిహార్ | 1.3 శాతం |
4. కేరళ | 1.5 శాతం |
5. ఉత్తరాఖండ్ | 2.9 శాతం |
- 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో హిందువులు 96.62 కోట్లు (79.80 శాతం).
- 23 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువుల జనాభా శాతం ఇతర మతాల కంటే ఎక్కువగా ఉంది.
- ముస్లింల జనాభా 17.22 కోట్లు (14.23 శాతం).
- జమ్మూకశ్మీర్ రాష్ట్రంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ముస్లింల జనాభా ఎక్కువ శాతం ఉంది.
- క్రైస్తవుల మొత్తం జనాభా 2.78 కోట్లు (2.30%).
- మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో క్రైస్తవుల జనాభా ఎక్కువ శాతం ఉంది.
2011 లెక్కల ప్రకారం మతాల వారీగా జనాభా వివరాలు
మతం | జనాభా | శాతం | మెజారిటీ రాష్ట్రాలు | మెజారిటీ యు.టి |
హిందువులు | 96.62 కోట్లు | 79.80 | 23 | 06 |
ముస్లింలు | 17.22 కోట్లు | 14.23 | 01 | 01 |
క్రైస్తవులు | 2.78 కోట్లు | 2.30 | 04 | 00 |
సిక్కులు | 2.08 కోట్లు | 1.72 | 01 | 00 |
బౌద్ధులు | 84.43 లక్షలు | 0.70 | 00 | 00 |
జైనులు | 44.52 లక్షలు | 0.37 | 00 | 00 |
ఇతర మతాలు | 79.38 లక్షలు | 0.66 | 00 | 00 |
ఏ మతం పేర్కొనని వారు | 29.67 లక్షలు | 0.24 | 00 | 00 |
మొత్తం | 121.08 కోట్లు | 100 | 29 | 07 |
ఆధారం: సామాజిక, ఆర్థిక, కుల గణన-2011