జీవ వైవిధ్యం
1. ఐక్యరాజ్యసమితి ‘జీవ వైవిధ్య దశాబ్దం’గా దేన్ని ప్రకటించింది?
ఎ) 2001-10
బి) 2011- 20
సి) 2021-30
డి) 1991-2000
- View Answer
- సమాధానం: బి
2. ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ ఏ రోజు నిర్వహిస్తారు?
ఎ) ఏప్రిల్ 22
బి) మే 22
సి) జూన్ 20
డి) డిసెంబర్ 21
- View Answer
- సమాధానం: బి
3. "Convention on Biological Diversity" అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది?
ఎ) యునెస్కో
బి) యూఎన్ఈపీ
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
4. భారత్లోని ఏ ప్రాంతంలో ‘లయన్ టెయిల్డ్ మకాక్’ అనే కోతి కనిపిస్తుంది?
ఎ) పశ్చిమ కనుమలు
బి) ఈశాన్య హిమాలయాలు
సి) తూర్పు కనుమలు
డి) అండమాన్ నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: ఎ
5. "Conservation International" అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) మెక్సికో
బి) నైరోబి
సి) లండన్
డి) వాషింగ్టన్
- View Answer
- సమాధానం: డి
6. ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది?
ఎ) శ్రీలంక
బి) వెనిజులా
సి) కొలంబియా
డి) ఇండోనేసియా
- View Answer
- సమాధానం: ఎ
7. ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం?
ఎ) 3
బి) 5
సి) 7
డి) 9
- View Answer
- సమాధానం: సి
8. జీవవైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న "Convention on Biological Diversity" (BD) అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1993
బి) 1994
సి) 1995
డి) 1996
- View Answer
- సమాధానం: ఎ
9. ‘నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ’ ఎక్కడ ఉంది?
ఎ) చెన్నై
బి) బెంగళూరు
సి) తిరువనంతపురం
డి) గాంగ్టక్
- View Answer
- సమాధానం: ఎ
10. యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) జెనీవా
బి) న్యూఢిల్లీ
సి) వాషింగ్టన్
డి) నైరోబి
- View Answer
- సమాధానం: డి
11. ‘వరల్డ్ ఎర్త్ డే’ను ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) మార్చి 22
బి) ఏప్రిల్ 22
సి) సెప్టెంబర్ 16
డి) అక్టోబర్ 12
- View Answer
- సమాధానం: బి
12. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది?
ఎ) వింధ్య పర్వతాలు
బి) పశ్చిమ కనుమలు
సి) పశ్చిమ హిమాలయాలు
డి) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: బి
13. బట్టమేక పక్షులు (Great Indian Bustard) ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) మధ్యప్రదేశ్
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: డి
14. కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి?
ఎ) 4
బి) 5
సి) 6
డి) 7
- View Answer
- సమాధానం: సి
15. ఏ జీవి నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) చింకారా
బి) కృష్ణజింక
సి) కస్తూరి జింక
డి) సాంబారు దుప్పి
- View Answer
- సమాధానం: సి
16. ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ చిహ్నం ఏది?
ఎ) ధ్రువ ఎలుగుబంటి
బి) పాండా
సి) నీలి తిమింగలం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
17. ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు
బి) గౌహతి
సి) డెహ్రాడూన్
డి) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: సి
18. దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది?
ఎ) గిర్ అడవులు
బి) వేనాడ్ అభయారణ్యం
సి) పెంచ్ జాతీయ పార్కు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ