పార్లమెంట్
1. అధికరణలు - అవి తెలిపే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
a) 253 అంతర్జాతీయ ఒప్పందాల గురించి పార్లమెంటు చట్టాలు
b) 250 అత్యవసర పరిస్థితి విధింపు
c) 245 దేశం మొత్తానికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్ చట్టాలను చేస్తుంది
d) 247 దేశంలో అదనపు న్యాయస్థానాల ఏర్పాటు
1) a, b, c
2) a, c, d
3) b, c
4) c, d, a
- View Answer
- సమాధానం: 2
2.కింది వాటిలో భారత పార్లమెంట్‌కు లేని అధికారం ఏది?
1) లోక్‌సభ కాలపరిమితి పెంచడం
2) రాష్ట్రాల విధాన మండలిని రద్దు చేయడం
3) సైనికుల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం
4) పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం
- View Answer
- సమాధానం: 4
3. పార్లమెంట్.. కింది వాటిలో సాధారణ మెజారిటీతో సవరించే అంశాలేవి?
a) సుప్రీంకోర్టు అధికార పరిధిని పెంచడం
b) రెండో షెడ్యూల్లో పేర్కొన్న ప్రముఖుల జీతాలను పెంచడం
c) ప్రాథమిక విధులు
d) పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంచడం
1) a, b, c, d
2) b, c, d
3) a, b, d
4) c, d
- View Answer
- సమాధానం: 3
4. సుప్రీంకోర్డు, హైకోర్టు అధికారాల్లో మార్పులు చేయడానికి ఏవిధమైన పద్ధతి అనుసరిస్తారు?
1) పార్లమెంట్ 2/3 మెజారిటీ తీర్మానం
2) పార్లమెంట్ 2/3 ప్రత్యేక మెజారిటీ, సగం రాష్ట్రాల శాసనసభల సాధారణ మెజారిటీ
3) పార్లమెంటు సాధారణ మెజారిటీ
4) అలాంటి అధికారం పార్లమెంట్‌కు లేదు
- View Answer
- సమాధానం: 2
5. పార్లమెంట్‌కు నూతన పన్నులు విధించే అధికారం ఉందని తెలిపే అధికరణ ఏది?
1) 264
2) 265
3) 262
4) 365
- View Answer
- సమాధానం: 2
6. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని తెలిపే అధికరణ ఏది?
1) 358
2) 128
3) 109
4) 368
- View Answer
- సమాధానం: 4
7. ‘శూన్య గంట (Zero hour)’కు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్యలేవి?
a) ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే నిర్వహిస్తారు.
b) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య నిర్వహిస్తారు.
c) పార్లమెంట్ రూల్స్ ప్రొసీజర్ప్ లో పేర్కొన్నారు.
d) ‘శూన్య గంట’ పద్ధతి భారతదేశంలోనే ఆవిర్భవించింది.
e) భారత పార్లమెంట్లో 1965 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు.
1) a, b, c, d
2) a, b, c
3) c, e
4) b, c, d
- View Answer
- సమాధానం: 3
8. స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాలేవి?
a) ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయాలపై మౌఖికంగా అడుగుతారు.
b) సమయం గురించి స్పీకర్ నిర్ణయిస్తారు
c) అనుబంధ ప్రశ్నలు వేయడానికి వీలు లేదు.
d) కనీసం వంద రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.
1) a, b, c, d
2) c, d
3) a, b, c
4) a, b
- View Answer
- సమాధానం: 2
9. ‘వాయిదా తీర్మానం (Adjournment Motion)’కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
a) ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి.
b) ఏదైనా అత్యంత ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయంపై ప్రవేశపెడతారు.
c) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
d) ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి.. మొత్తం సభ్యుల్లో బి వ వంతు మంది మద్దతు అవసరం.
e) ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం పడిపోతుంది.
1) a, b, c
2) a, b, d, e
3) a, b, c, d, e
4) a, c, d, e
- View Answer
- సమాధానం: 1
10. విశ్వాస తీర్మానంలో నెగ్గకపోవడం వల్ల అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని ఎవరు?
1) చరణ్ సింగ్
2) వి.పి. సింగ్
3) దేవెగౌడ
4) వాజ్‌పేయి
- View Answer
- సమాధానం: 2
11. ‘అవిశ్వాస తీర్మానం (No confidence motion)’కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాలేవి?
a) ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి బి వ వంతు సభ్యుల మద్దతు ఉండాలి.
b) ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం.
c) కార్యనిర్వాహక శాఖను అదుపు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
d) ఈ తీర్మానం పార్లమెంట్‌లోని రెండో సభలో ప్రవేశపెడతారు.
e) ఈ తీర్మానం 2/3 వ వంతు సభ్యుల మెజారిటీతో ఆమోదం పొందితే ప్రభుత్వం పడిపోతుంది.
1) a, d, e
2) b, c, d
3) b, d, e
4) b, c
- View Answer
- సమాధానం: 1
12. ‘ఫిలిబస్టరింగ్’ అంటే అర్థం ఏమిటి?
1) బిల్లులు ఆమోదం పొందకుండా సుదీర్ఘంగా ఉపన్యాసం ఇవ్వడం
2) బిల్లులను మూకుమ్మడిగా ఆమోదించడం
3) శాసనసభ కార్యక్రమాలను వేగంగా నిర్వహించడం
4) స్పీకర్ ఇచ్చే అంతిమ రూలింగ్
- View Answer
- సమాధానం: 1
13. ‘కోరమ్’కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
a) కోరమ్ గురించి రాజ్యాంగంలోని 100వ అధికరణ తెలుపుతోంది.
b) కోరమ్ అంటే 1/10 వ వంతు.
c) ప్రస్తుతం కోరమ్.. లోక్‌సభలో 55 మంది, రాజ్యసభలో 25 మంది.
d) ‘కోరమ్’ ఉందా, లేదా అనే అంశాన్ని సభాధ్యక్షులు నిర్ణయిస్తారు.
1) a, b, c
2) b, c
3) a, b
4) a, b, c, d
- View Answer
- సమాధానం: 4
14. సభను ‘కాల నిర్ణయం లేని వాయిదా’ ఎవరు వేస్తారు?
1) రాష్ట్రపతి
2) స్పీకర్
3) గవర్నరు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
15. కేటాయించిన పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానం ఏది?
1) విధాన కోత తీర్మానం
2) నామమాత్ర కోత తీర్మానం
3) పొదుపు కోత తీర్మానం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
16. కోత తీర్మానాల (Cut Motions)కు సంబంధించి కింది వాటిలో సరికానివి ఏవి?
a) సాధారణంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి.
b) రాజ్యసభలో కోత తీర్మానాలు ముందుగా ప్రవేశపెడతారు
c) కోత తీర్మానాలు నెగ్గినా.. ప్రభుత్వం పడిపోదు
d) ఇవి లోక్‌సభలో మాత్రమే ఉంటాయి.
1) a, b
2) b, c
3) a, b, d
4) b, c, d
- View Answer
- సమాధానం: 2
17.‘పార్లమెంట్ ఏ మేరకు పనిచేస్తోందనేది అది ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా తెలుస్తుంది’ అని ఎవరు పేర్కొన్నారు?
1) ఒ.పి. గోయల్
2) మారిస్ జోన్స్
3) గ్రాన్విల్లీ ఆస్టిన్
4) కె.టి. షా
- View Answer
- సమాధానం: 2
18. పార్లమెంట్ కమిటీల గురించి సందర్భానుసారం ఏ అధికరణలో ప్రస్తావించారు?
1) 104
2) 105
3) 107
4) 102
- View Answer
- సమాధానం: 2
19. కింద పేర్కొన్న.. పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన లక్షణాల్లో సరైనవి ఏవి?
a) ఈ కమిటీల సభ్యత్వం ఆయా పార్టీల సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుంది.
b) ఈ కమిటీల సమావేశానికి 1/3 వ వంతు కోరమ్ ఉండాలి.
c) కమిటీలు వాటి వార్షిక నివేదికను స్పీకర్ లేదా చైర్మన్‌కు సమర్పిస్తాయి
d) స్పీకర్ లేదా చైర్మన్ పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షత వహించకూడదు.
1) a, b, c
2) b, c, d
3) c, d
4) a, b, c, d
- View Answer
- సమాధానం: 1
20. ప్రభుత్వ ఖాతాల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాలేవి?
a) ఈ సంఘాన్ని 1921 నుంచి ఏర్పాటు చేస్తున్నారు.
b) ఈ కమిటీలో సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.
c) 1952 నుంచి రెండు సభల సభ్యుల జాయింట్ కమిటీగా మారింది.
d) 1967 నుంచి ప్రతిపక్ష సభ్యులకు అధ్యక్ష స్థానం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
e) ఈ కమిటీని 1947 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
1) a, b, c
2) d, e
3) b, c, e
4) a, b, c, d, e
- View Answer
- సమాధానం: 3
21.‘అంచనాల కమిటీ (Estimates Committee)’కి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
a) మొదట్లో ఈ కమిటీ పేరు ‘ఆర్థిక స్థాయి కమిటీ’.
b) 1950 నుంచి ‘అంచనాల కమిటీ’గా పేరు మార్చారు.
c) ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఉండకూడదు.
d) ఈ కమిటీలో మొత్తం లోక్‌సభ సభ్యులే ఉంటారు.
e) మొదట్లో ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం 30 మంది సభ్యులు ఉన్నారు.
1) a, b, c
2) c, d, e
3) a, b, c, d, e
4) a, b
- View Answer
- సమాధానం: 3
22.కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ ఏది?
1) అంచనాల కమిటీ
2) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
3) ప్రభుత్వ హామీల సంఘం
4) ప్రభుత్వ ఖాతాల సంఘం
- View Answer
- సమాధానం: 2
23. ‘అంబుడ్సమన్’ లేదా ‘నిఘా కమిటీ’గా దేన్ని పిలుస్తారు?
1) సభా హక్కుల కమిటీ
2) విజ్ఞాపన కమిటీ
3) ప్రభుత్వ ఖాతాల సంఘం
4) నిబంధనల కమిటీ
- View Answer
- సమాధానం: 2
24.‘సభా వ్యవహారాల కమిటీ’కి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యలు ఏవి?
a) ఉభయ సభలకు వేర్వేరుగా కమిటీలు ఉంటాయి.
b) లోక్‌సభ కమిటీలో 15 మంది సభ్యులుంటారు.
c) రాజ్యసభ కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
d) హోదా రీత్యా ఆయా సభాధ్యక్షులే ఈ కమిటీలకు అధ్యక్షులుగా ఉంటారు.
e) సభా కార్యక్రమాలకు సంబంధించిన సమయాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది.
1) a, b, c,
2) a, b, c, d, e
3) c, d, e
4) b, c, d
- View Answer
- సమాధానం: 2
25. ‘నియోజిత శాసనాల కమిటీ’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1956
2) 1953
3) 1955
4) 1950
- View Answer
- సమాధానం: 2
26. భారతదేశంలో శాఖాపరమైన సంఘాలను (Departmental Standing Committees) ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1992
2) 1993
3) 1995
4) 2004
- View Answer
- సమాధానం: 2
27. రాజ్యాంగంలోని ఏ అధికరణ ‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ’ల గురించి తెలుపుతుంది?
1) 105
2) 88
3) రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేదు
4) 102
- View Answer
- సమాధానం: 3
28. పార్లమెంట్లో ప్రతి సాధారణ బిల్లుకు ఎన్ని దశలు ఉంటాయి?
1) 2 దశలు
2) 3 దశలు
3) 5 దశలు
4) 4 దశలు
- View Answer
- సమాధానం: 3
29. ‘ద్రవ్య బిల్లు (Money bill)’కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాలేవి?
a) పన్ను విధించడం, రద్దుచేయడం, తగ్గించడానికి సంబంధించింది.
b) కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను దీని ద్వారా క్రమబద్ధీకరిస్తారు.
c) భారత సంఘటిత నిధి నుంచి ద్రవ్యం వినియోగించడానికి సంబంధించింది.
d) భారత ఆగంతుక నిధి నుంచి ద్రవ్యాన్ని తీసుకోవడానికి సంబంధించింది.
e) జరిమానాలు లేదా ఇతర ధన సంబంధమైన పెనాల్టీలకు చెందింది.
1) a, b, c, d, e
2) c, d, e
3) b, c, d
4) e
- View Answer
- సమాధానం: 4
30. పార్లమెంట్లో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరం నుంచి వేరు చేశారు?
1) 1921
2) 1925
3) 1922
4) 1923
- View Answer
- సమాధానం: 1
31. బడ్జెట్ (వార్షిక ఆర్థిక నివేదిక) గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ప్రస్తావించారు?
1) 110
2) 112
3) 114
4) 109
- View Answer
- సమాధానం: 2
32. ‘యూత్ పార్లమెంట్’కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలేవి?
a) దీన్ని అఖిల భారత విప్స్ సమావేశం సిఫారసు చేసింది.
b) పార్లమెంట్ కార్యక్రమాలను నూతన తరాలకు తెలియజేయడం దీని ఉద్దేశం.
c) ప్రజాస్వామిక విలువలను విద్యార్థి లోకానికి తెలపడం దీని ఉద్దేశం.
d) పార్లమెంట్‌కు యువకులు ఎన్నికయ్యేలా చూడటం దీని ఉద్దేశం.
1) a, b, c, d
2) a, b, c
3) c, d
4) b, c, d
- View Answer
- సమాధానం: 2
33.పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది?
1) 89
2) 99
3) 96
4) 97
- View Answer
- సమాధానం: 2
34. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ ఏయే సందర్భాల్లో చట్టాలు చేస్తుంది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో (ప్రకరణ - 352)
2) రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలకు సంబంధించి (ప్రకరణ - 356)
3) అంతర్జాతీయ చట్టాలు అమలు చేసే సందర్భంలో (ప్రకరణ - 253)
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4