జిల్లా ప్రణాళికా బోర్డ్ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1. జిల్లా ప్రణాళికా బోర్డ్ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) జిల్లా కలెక్టర్
2) జిల్లా పరిషత్ చైర్మన్
3) సీఈవో
4) డీడీవో
- View Answer
- సమాధానం: 2
2. ‘ధరల నియంత్రణ’ అంశాన్ని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు?
1) కేంద్ర జాబితా
2) రాష్ర్ట జాబితా
3) ఉమ్మడి జాబితా
4) అవశిష్ట అంశం
- View Answer
- సమాధానం: 3
3. కింది వాటిలో రాజ్యాంగంలో ప్రస్తావించని అంశం ఏది?
1) పరిపాలనా ట్రిబ్యునళ్లు
2) సామాజిక, ఆర్థిక ప్రణాళికలు
3) రాజకీయ పార్టీలు
4) అవిశ్వాస తీర్మానం
- View Answer
- సమాధానం: 4
4. కింది ఏ అంశంలో ముందుగా చొరవ చూపడానికి రాజ్యసభకు అవకాశం ఉంది?
1) మంత్రిమండలిని రద్దు చేయడం
2) నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం
4) ఆర్థిక బిల్లులు
- View Answer
- సమాధానం: 2
5. రాష్ర్టపతి తన రాజీనామా పత్రాన్ని సమర్పించినప్పుడు ఉప రాష్ర్టపతి ముందుగా ఎవరికి తెలుపుతారు?
1) భారత ప్రధానమంత్రి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) ఎన్నికల ప్రధాన అధికారి
4) లోక్‌సభ స్పీకర్
- View Answer
- సమాధానం: 4
6.పన్నులు చెల్లించడం అనేది ఒక..?
1) అధికార విధి
2) చట్టబద్ధమైన విధి
3) రాజ్యాంగ విధి
4) ప్రాథమిక విధి
- View Answer
- సమాధానం: 2
7. కేంద్రపాలిత ప్రాంతమైన దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు?
1) రాష్ర్టపతి
2) లెఫ్టినెంట్ గవర్నర్
3) ఉప రాష్ర్టపతి
4) ప్రధానమంత్రి
- View Answer
- సమాధానం: 1
8. వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస జనాభా ఎంత?
1) 3,00,000
2) 1,00,000
3) 50,000
4) 25,000
- View Answer
- సమాధానం: 1
9. కింద పేర్కొన్న కమిటీల్లో పంచాయతీరాజ్ సంస్థలతో సంబంధం లేనిది?
1) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
2) రామచంద్రన్ కమిటీ
3) జి.వి.కె. రావు కమిటీ
4) సంతానం కమిటీ
- View Answer
- సమాధానం: 4
10. ‘లేమ్ - డక్’ సమావేశం అంటే..?
1) సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభ జరిపే మొదటి సమావేశం
2) లోక్‌సభ రద్దు కావడాని కంటే ముందు నిర్వహించే చివరి సమావేశం
3) అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో లోక్‌సభ జరిపే సమావేశం
4) నూతనంగా ఎన్నికైన సభ నిర్వహించే మొదటి సమావేశానికి ముందు పాత సభ జరిపే చివరి సమావేశం
- View Answer
- సమాధానం: 4
11. న్యాయ సమీక్షాధికారం ప్రధానంగా ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది?
1) రాజ్యాంగం నిర్ధారించిన పద్ధతి
2) చట్టం నిర్ధారించిన పద్ధతి
3) సమన్యాయ పాలనను అనుసరించడం
4) న్యాయ సంప్రదాయాలు, ప్రమాణాలు
- View Answer
- సమాధానం: 1
12. కింది వాటిలో ప్రధానంగా ఏ అంశం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొంటుంది?
1) భారతదేశంలో విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు
2) భారతదేశంలో అధికార మతం లేకపోవడం
3) భారతదేశం మత రహితమైన రాజ్యం కావడం
4) భారతదేశంలో మైనారిటీ మతాలకు ప్రత్యేక రక్షణలు ఉండటం
- View Answer
- సమాధానం: 2
13. స్వతంత్ర భారతదేశంలో ‘విదేశాంగ శాఖ’ను మొదటగా నిర్వహించింది ఎవరు?
1) సర్దార్ బల్దేవ్ సింగ్
2) వి.కె. కృష్ణ మీనన్
3) సర్దార్ పటేల్
4) జవహర్లాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 4
14. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి డిపాజిట్ కోల్పోయే సందర్భం ఏది?
1) పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు
2) నిర్ధారిత ఓట్లను సాధించనప్పుడు
3) గెలుపొందిన, ఓడిపోయిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నప్పుడు
4) గెలుపొందిన అభ్యర్థి ఏ సందర్భంలోనూ డిపాజిట్ కోల్పోడు
- View Answer
- సమాధానం: 2
15. కింద పేర్కొన్నవాటిలో కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం వసూలు చేసి, వినియోగించుకునే పన్ను ఏది?
1) రైల్వే ప్రయాణికులపై, సరకు రవాణాపై విధించే పన్నులు
2) ఎస్టేట్ డ్యూటీ
3) ఔషధాలు, అలంకరణ వస్తువులపై విధించే పన్నులు
4) పత్రికలపై విధించే పన్నులు
- View Answer
- సమాధానం: 3
16.భారతదేశంలో జోనల్ కౌన్సిళ్లను ఏవిధంగా ఏర్పాటు చేశారు?
1) రాజ్యాంగం ద్వారా
2) పార్లమెంట్ చట్టం ద్వారా
3) కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారా
4) రాజ్యాంగ సవరణ ద్వారా
- View Answer
- సమాధానం: 2
17. రాజ్యాంగంలోని ఏ అంశాన్ని సవరించే సందర్భంలో 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు?
1) 7వ షెడ్యూల్
2) సుప్రీంకోర్టు
3) రాష్ర్టపతి ఎన్నిక
4) ప్రాథమిక హక్కులు
- View Answer
- సమాధానం: 4
18.హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ను దేని నుంచి చెల్లిస్తారు?
1) కేంద్ర సంఘటిత నిధి
2) రాష్ర్ట సంచిత నిధి
3) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తు ల సంచిత నిధి
4) సాధారణ నిధి
- View Answer
- సమాధానం: 1
19.గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాలు ఏ రంగంలో ఎక్కువ అధికారాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి?
1) శాసన రంగం
2) పరిపాలనా రంగం
3) ఆర్థిక రంగం
4) రాజకీయ రంగం
- View Answer
- సమాధానం: 3
20. కింది వాటిలో రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించని రాజ్యాంగ పరిషత్ కమిటీ ఏది?
1) ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ
2) నియమ నిబంధనల కమిటీ
3) జెండా అడ్ హక్ కమిటీ
4) ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ
- View Answer
- సమాధానం: 4
21. విధాన పరిషత్‌కు సంబంధించి సరైన వాక్యం ఏది?
1) శాశ్వతంగా రద్దు చేయరాదు, తాత్కాలికంగా రద్దు చేయవచ్చు
2) తాత్కాలికంగా రద్దు చేయరాదు, శాశ్వతంగా రద్దు చేయవచ్చు
3) ఏ విధంగాను రద్దు చేయడానికి అవకాశం లేదు
4) విధాన పరిషత్ రద్దుకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు
- View Answer
- సమాధానం: 2
22. కింది వారిలో స్వాతంత్య్రానంతరం నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎవరు?
1) బి.ఆర్. అంబేడ్కర్
2) శ్యాంప్రసాద్ ముఖర్జీ
3) జాన్ మత్తయ్
4) హుకుం సింగ్
- View Answer
- సమాధానం: 4
23. ప్రపంచ బ్యాంకు.. అభివృద్ధి సాధనకు సంబంధించిన ఏ సంవత్సరం నివేదికలో ‘సుపరిపాలనలో పౌరసమాజ భాగస్వామ్యం’ గురించి పేర్కొంది?
1) 1995
2) 1992
3) 1997
4) 2001
- View Answer
- సమాధానం: 2
24. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు?
1) ప్రధానమంత్రి
2) రాష్ర్టపతి
3) యూపీఎస్సీ చైర్మన్
4) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సిబ్బంది శాఖ
- View Answer
- సమాధానం: 2
25. జాతీయ మానవ హక్కుల చట్టం - 1993 ప్రకారం ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’ను ఏర్పాటు చేసింది?
1) కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ
2) రాష్ర్టపతి
3) పార్లమెంట్
4) భారత ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 4
26. కింద పేర్కొన్న భారత ఉప రాష్ర్టపతుల పదవీ కాలాలకు సంబంధించి సరైన వరస క్రమం ఏది?
i) జి.ఎస్. పాఠక్
ii) మహమ్మద్ హిదాయతుల్లా
iii) బి.డి. జట్టి
iv) వి.వి. గిరి
1) i, iii, iv, ii
2) iii, iv, ii, i
3) iv, i, iii, ii
4) ii, i, iv, iii
- View Answer
- సమాధానం: 3
27. కింద పేర్కొన అంశాల్లో దేన్ని ‘సంధ్యా మండలం’గా పేర్కొంటారు?
1) కేంద్ర జాబితా
2) రాష్ర్ట జాబితా
3) ఉమ్మడి జాబితా
4) అవశిష్ట అంశం
- View Answer
- సమాధానం: 3
28. సామాజిక, ఆర్థిక ప్రణాళికలను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చారు?
1) కేంద్ర జాబితా
2) రాష్ర్ట జాబితా
3) ఉమ్మడి జాబితా
4) ఆదేశిక సూత్రాలు
- View Answer
- సమాధానం: 3
29. ప్రధాని పదవికి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడితే..?
1) కేబినెట్ నూతన నాయకుణ్ని ఎన్నుకుంటుంది
2) పార్లమెంట్ నూతన నాయకుణ్ని ఎన్నుకుంటుంది
3) లోక్‌సభ రద్దవుతుంది
4) కేంద్ర మంత్రిమండలి రద్దవుతుంది
- View Answer
- సమాధానం: 4
30. పార్లమెంట్ నిర్వహణలో వాయిదా తీర్మానం అంటే..?
1) జరుగుతున్న సభా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరే తీర్మానం
2) ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై మంత్రి నుంచి సమాధానం కోరే తీర్మానం
3) ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై చర్చ కోసం.. ఎజెండాను వాయిదా వేయాలని కోరే తీర్మానం
4) సభ దృష్టిని ఏదైనా సమస్యపై మళ్లించడం కోసం ప్రవేశపెట్టే తీర్మానం
- View Answer
- సమాధానం: 3
31. రాష్ర్టపతిపై మహాభియోగ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన సభ్యుల కనీస సంఖ్య ఎంత?
1) 100
2) 136
3) 362
4) 2/3 వంతు
- View Answer
- సమాధానం: 2
32. రాష్ర్ట ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 1/3 వంతు నిధులను స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేటాయించాలని సూచించిన కమిటీ?
1) అశోక్ మెహతా కమిటీ
2) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
3) జి.వి.కె. రావు కమిటీ
4) వి.కె.ఆర్.వి. రావు కమిటీ
- View Answer
- సమాధానం: 2
33. పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించడంలో వాస్తవిక అంశం?
1) రాష్ర్టపతి.. ఎన్నికల కమిషన్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి
2) కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనను రాష్ర్టపతి తప్పనిసరిగా పాటించాలి
3) పార్లమెంట్ సభ్యుల అనర్హత విషయంలో రాష్ర్టపతి సొంత నిర్ణయానికి అవకాశం లేదు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
34.పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ర్టపతి..?
1) తప్పనిసరిగా ఆమోదించాలి
2) పునఃపరిశీలనకు పంపవచ్చు
3) బిల్లును తిరస్కరించవచ్చు
4) రెండోసారి ఆమోదించిన బిల్లులను మాత్రమే ఆమోదిస్తారు
- View Answer
- సమాధానం: 1
35.రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి సరైన వరస క్రమం ఏది?
1) సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హర్యానా
2) నాగాలాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం, హర్యానా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్
4) నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా
- View Answer
- సమాధానం: 2
36. ‘జాతీయ సమైక్యతా మండలి’ నేటి వరకు నిర్వహించిన సమావేశాల సంఖ్య?
1) 14
2) 15
3) 16
4) 17
- View Answer
- సమాధానం: 3
37.రాజ్యాంగ ముసాయిదాను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ చైర్మన్?
1) బి.ఆర్. అంబేడ్కర్
2) గోపాలస్వామి అయ్యంగార్
3) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
4) బి.ఎన్. రావు
- View Answer
- సమాధానం: 3
38. బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఏ చట్టాన్ని ‘గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా’గా పేర్కొంటారు?
1) 1858 భారత ప్రభుత్వ చట్టం
2) 1935 భారత ప్రభుత్వ చట్టం
3) 1773 రెగ్యులేటింగ్ చట్టం
4) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
- View Answer
- సమాధానం: 1
39.భారత, అమెరికా సమాఖ్య వ్యవస్థల మధ్య సారూప్యత లేని అంశం ఏది?
1) స్వతంత్ర ప్రతిపత్తి గల ఉన్నత న్యాయస్థానం
2) కేంద్రంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే శాసన శాఖ
3) రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలకు భాగస్వామ్యం
4) ఏకీకృత న్యాయవ్యవస్థ
- View Answer
- సమాధానం: 4
40. భారతదేశంలోని ఎన్నికల పద్ధతులకు సంబంధించని అంశం ఏది?
1) ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ పద్ధతి
2) విన్నర్స - టేక్స్ - ఆల్ పద్ధతి
3) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి
4) దామాషా ఎన్నికల పద్ధతి
- View Answer
- సమాధానం: 4
41. ‘భారత రాజ్యాంగానికి గుర్తింపు కార్డు’గా ఎం.వి. పైలీ దేన్ని అభివర్ణించారు?
1) ప్రాథమిక హక్కులు
2) ఆదేశిక సూత్రాలు
3) రాజ్యాంగ ప్రవేశిక
4) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: 3
42. భారత, బంగ్లాదేశ్ మధ్య జరిగిన భూభాగ మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 98
2) 99
3) 100
4) 101
- View Answer
- సమాధానం: 3
43. జన్మతా భారతీయులు కానివారు, భారత పౌరసత్వాన్ని స్వీకరించినవారు మనదేశంలో కింది పేర్కొన్న ఏ పదవిని స్వీకరించడానికి అర్హులు కారు?
1) రాష్ర్టపతి
2) ప్రధానమంత్రి
3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
44. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
1) 2007
2) 2009
3) 2010
4) 2013
- View Answer
- సమాధానం: 3
45. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షను నిషేధిస్తూ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1992
2) 1993
3) 1994
4) 1995
- View Answer
- సమాధానం: 1