Skip to main content

నీతిఆయోగ్‌లో అత్యున్నతమైంది?

నీతి ఆయోగ్ :
భారత్‌లో 1951 ఏప్రిల్ 1 మొదలు 2017 మార్చి 31 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అమలయ్యాయి. ప్రణాళికా యుగంలో వృద్ధ్ది ప్రపంచ యుద్ధం తర్వాత సంవత్సరాలతో పోల్చినప్పుడు మెరుగైంది. స్వాతంత్య్రానికి ముందు కాలంలో రుణాత్మక వృద్ధ్ది నమోదు చేసుకున్న భారత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశకాలలో సగటున 3.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 1985 సంవత్సరం నుంచి చేపట్టిన విధానపరమైన మార్పులు 1991 సంవత్సరం తర్వాత వేగవంతమయి భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధ్ది పెరుగుదలకు దారితీశాయి. 2015 జనవరి 1 నుంచి ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి Think Tank గా నీతి ఆయోగ్ వ్యవహరిస్తుంది. భారత ప్రభుత్వానికి వ్యూహాత్మక, దీర్ఘకాల విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు నీతిఆయోగ్ సాంకేతిక సలహాలనందిస్తుంది. సహకార సమాఖ్యత్వం (కో ఆపరేటివ్ ఫెడరలిజం) దిశగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి పనిచేసే విధంగా నీతిఆయోగ్ తగిన అవకాశం కల్పిస్తుంది.
ఐక్యరాజ్యసమితి దీర్ఘకాలిక సాంఘిక, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (2016-2030)తో అనుసంధానపరచే విధంగా నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దీర్ఘదర్శి ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్) రూపకల్పనకు కృషి చేస్తుంది. ప్రతిపాదిత జాతీయ అభివృద్ధి ఎజెండాలో భాగంగా 2017-18 నుంచి ఏడు సంవత్సరాల వ్యూహాన్ని రూపొందించింది. ఈ వ్యూహం దీర్ఘదర్శి ప్రణాళికలో భాగంగా ఉంటుంది. ఈ వ్యూహాన్ని మూడు సంవత్సరాల Action plan ద్వారా అమలుచేస్తారు. మూడు సంవత్సరాల అఛ్టిజీౌ ఞ్చను ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో పొందుపర్చింది. అందరి భాగస్వామ్యం, అందరి అభివృద్ధి మూడు సంవత్సరాల Action plan ఎజెండా లక్ష్యం. మధ్యకాలిక రాబడి, వ్యయ దృక్పథం (Frame work) ముఖ్య రంగాల్లో Economic transformation, ప్రాంతీయ అభివృద్ధి, వృద్ధిని ప్రోత్సహించే కారకాలు (అవస్థాపనా సౌకర్యాలు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, శక్తి, సైన్‌‌స అండ్ టెక్నాలజీ, సమర్థవంతమైన నవకల్పన వ్యవస్థ ఏర్పాటు) ప్రభుత్వం, సాంఘిక రంగాలు, సుస్థిరత అనేవి మూడు సంవత్సరాల Action ఎజెండాలో కీలక అంశాలుగా ఉంటాయి.

నూతన భారత్ @ 75 కోసం వ్యూహం - నీతిఆయోగ్:
 • స్థూల మూలధన కల్పన రేటు (పెట్టుబడి) ప్రస్తుతం జి.డి.పి.లో 29 శాతం కాగా 2022 సంవత్సరం నాటికి 36 శాతానికి పెరగాలి. ఈ పెరుగుదలలో సగం వాటా ప్రభుత్వ రంగ పెట్టుబడిగా ఉండాలి. ప్రభుత్వ రంగ పొదుపులో పెరుగుదల అవసరం.
 • ఈ-నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ల (e-NAMS) విస్తరణ, అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్ మార్కెట్ కమిటీ చ ట్టాన్ని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ivestock మార్కెటింగ్ చట్టంగా మార్చడం లాంటి చర్యల ద్వారా వ్యవసాయ రంగంలోని రైతులను "agripreneurs’గా మార్చడానికి ప్రాధాన్యతనివ్వాలి. వ్యవసాయ రంగ వృద్ది పెంపునకు ఒకే విధమైన జాతీయ మార్కెట్, స్వేచ్ఛాయుత ఎగుమతి వాతావరణం, Essential Commodities Act రద్దు లాంటి చర్యలు అవసరం.
 • వ్యయాల తగ్గింపు, భూ నాణ్యత పెంపు, రైతుల ఆదాయాల పెంపునకు "Zero budget Natural Farming’ Techniques పైదృష్టి సారించాలి. ప్రపంచ వ్యాప్తంగా Carbon foot print తగ్గింపునకు ఈ టెక్నిక్స్ భారత్‌కు సహకరించగలవు. ఉపాధి కల్పనకు శ్రామిక చట్టాల కోడిఫికేషన్ పూర్తిచేయడంతో పాటు అప్రెంటి్‌స్‌షిప్‌లను అధిక స్థాయిలో ప్రోత్సహించడం లాంటి చర్యలు అవసరం.
 • 2019లో భారత్ నెట్ కార్యక్రమం పూర్తయ్యే నాటికి మొత్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు డిజిటల్ కనెక్టివిటీని పొందుతాయి. తర్వాత దశలో Individual Villages మధ్య కనెక్టివిటీకి ప్రాధాన్యమివ్వాలి. 2022-23 నాటికి రాష్ర్ట, జిల్లా, గ్రామ పంచాయతీల స్థాయిలో అన్ని ప్రభుత్వ సర్వీసుల డెలివరీ డిజిటల్ రూపంలో ఉంటుంది.
 • దేశవ్యాప్తంగా ఉన్న 1,50,000 ఆరోగ్య, Wellness కేంద్రాల ద్వారా ఆయుష్మాన్‌భవ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలి.
 • పాఠశాల విద్య నాణ్యత, నైపుణ్యత పెంపునకు ప్రాధాన్యమివ్వాలి. 2020 నాటికి 10,000 Atal Tinkering labs ను ఏర్పాటు చేయడం ద్వారా నూతన Innovation ecosystem ను ఏర్పాటు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే అమలుచేసిన అందుబాటు గృహాల కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి. త ద్వారా పట్టణ ప్రాంతాలలో కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడటంతో పాటు సమానత్వం అనే లక్ష్యం నెరవేరుతుంది. తద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతమవడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది.
 • ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి తగిన వ్యూహాలను అమలుపరచడం ద్వారా ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధనకు ప్రయత్నించాలి.
 • రెండో పరిపాలన సంస్కరణల కమిషన్ (Second Administrative Reforms Commission) సిఫార్సులను అమలుచేయడంతోపాటు ప్రస్తుతం సాంకేతికంగా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సంస్కరణలను రూపొందించడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 • స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా ఆర్బిట్రేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలి. Landfills, ప్లాస్టిక్ వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాలు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం స్వచ్ఛ భారత్ మిషన్ పరిధిని విస్తరించాలి.
 • 2022-23లో నూతన భారత్ లక్ష్యాల సాధనకు ప్రభుత్వ చర్యలతోపాటు ప్రైవేట్ రంగం, పౌర సమాజం, వ్యక్తులు తమ సొంత వ్యూహాలను రూపొందించుకొని అమలుపరచడం ద్వారా ప్రభుత్వానికి తగిన చేయూతనివ్వాలి. 21వ శతాబ్దపు సాంకేతికతకు అవసరమైన సాధనాల లభ్యత ద్వారా అభివృద్ధికి తగిన వాతావరణం ఏర్పడుతుంది.
 • కోస్టల్ షిప్పింగ్, ఇన్‌లాండ్ వాటర్ వేస్ ద్వారా జరిగే సరుకు రవాణా రెట్టింపు అవుతుంది. అవస్థాపనా సౌకర్యాలు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు Viability gap funding ను అందించాలి. వివిధ రవాణా వ్యవస్థలను అనుసంధాన పరచడంతో పాటు బహుళ నమూనా, డిజిటల్ మొబిలిటీని ప్రోత్సహించడానికి IT-enabled Platform ను అభివృద్ధి చేయడం జరుగుతుంది.

మాదిరి ప్రశ్నలు

1. 2018 జూన్‌ 1, 2018 అక్టోబర్‌ 31 కాలానికి సంబంధించి Aspirational districts ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానం పొందిన విరుదునగర్‌ కింది ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్‌
4) తెలంగాణ

Published date : 14 Jun 2019 06:02PM

Photo Stories