గ్రోత్ అండ్ డెవలప్మెంట్
1. ‘ఆర్థిక వృద్ధి అనేది అధిక ఉత్పత్తి గురించి తెలిపితే, ఆర్థికాభివృద్ధి.. అధిక ఉత్పత్తితో పాటు దానికి దోహదం చేసే సాంకేతిక, వ్యవస్థాపరమైన మార్పులను గురించి తెలుపుతుంది’ అని ఎవరు పేర్కొన్నారు?
ఎ) జి.ఎం.మేయర్
బి) సి.పి.కిండల్ బర్గర్
సి) కోలిన్క్లార్క
డి) ఐక్యరాజ్యసమితి
- View Answer
- సమాధానం: బి
2. 1950వ దశకంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 40 శాతం మంది ప్రజలు.. పెరిగిన స్థూల జాతీయోత్పత్తి, వ్యవస్థాపరమైన మార్పుల వల్ల ఏ మాత్రం లాభపడలేదని ఎవరు అభిప్రాయపడ్డారు?
ఎ) రాబర్టమెక్ నమారా
బి) ఇర్మాఅడల్మన్
సి) హెక్సర్-ఓలిన్
డి) పాల్ శామ్యుల్ సన్
- View Answer
- సమాధానం: ఎ
3. అభివృద్ధి అనేది కేవలం మానవుని భౌతిక అవసరాలనే కాకుండా, అతడి సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నది?
ఎ) పిగు
బి) రాబర్‌టసన్
సి) మార్షల్
డి) ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ
- View Answer
- సమాధానం: డి
4. ఆర్థికాభివృద్ధిలో సహజ వనరుల పాత్ర చాలా ముఖ్యమైందని ఎవరు పేర్కొన్నవారు?
ఎ) జాకొబ్ వైనర్
బి) విలియం జె.బౌమాల్
సి) డబ్ల్యు.ఎ.లూయిస్
డి) పై వారందరూ
- View Answer
- సమాధానం: డి
5. ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) ప్రభుత్వ రంగం
బి) ప్రైవేట్ రంగం
సి) మూలధన కల్పన
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
6. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థిక పరమైన అంశం కానిది ఏది?
ఎ) మూలధన కల్పన
బి) సామాజిక వ్యవస్థ
సి) విక్రయమయ్యే మిగులు
డి) విదేశీ వ్యాపారం
- View Answer
- సమాధానం: బి
7. సామాజిక నిర్మాణంలో.. ప్రజామోద వైఖరులు, జాతీయ సంస్థల్లో చెప్పుకోదగిన మార్పులను ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో భాగంగా పేర్కొన్నవారు?
ఎ) మైఖేల్ పి.తొడారో
బి) జె.బి.సే
సి) పిగు
డి) డడ్లీసీర్స
- View Answer
- సమాధానం: ఎ
8. ఆర్థికాభివృద్ధి ఒక యాంత్రిక ప్రక్రియ కాదని ఎవరు అభిప్రాయపడ్డారు?
ఎ) మార్షల్
బి) కార్ల మార్క్స
సి) రిచర్డ టి.గిల్
డి) అబ్దుల్ కలాం
- View Answer
- సమాధానం: సి
9. ఆర్థిక వృద్ధికి సూచికలుగా వేటిని పరిగణించవచ్చు?
ఎ) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి
బి) నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి
సి) వాస్తవ తలసరి ఆదాయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
10. ‘గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్’ గ్రంథ రచయిత?
ఎ) రాబర్ట క్లోవర్
బి) పాల్ క్రూగ్మన్
సి) అమర్త్యసేన్
డి) రంగరాజన్
- View Answer
- సమాధానం: ఎ
11. ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికేతర అంశం కానిది?
ఎ) మానవ వనరులు
బి) సామాజిక వ్యవస్థ
సి) విదేశీ వ్యాపారం
డి) అవినీతి
- View Answer
- సమాధానం: సి
12. దీర్ఘకాలంలో దేశంలోని వాస్తవిక తలసరి ఆదాయం పెరగడానికి దారితీసే ప్రక్రియను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నవారు?
ఎ) జి.ఎమ్.మేయర్
బి) మార్షల్
సి) కాలిన్ క్లార్క
డి) రఘురామ్ రాజన్
- View Answer
- సమాధానం: ఎ
13. ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలను ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నవారు?
ఎ) పిగు
బి) కాలిన్ క్లార్క
సి) జి.ఎమ్.మేయర్
డి) మైఖేల్ పి.తొడారో
- View Answer
- సమాధానం: బి
14. జాతీయ ఆదాయ స్థాయి, జాతీయ ఆదాయ పంపిణీ మధ్య సంబంధం ద్వారా ఆర్థిక సంక్షేమాన్ని కొలిచిన వారు?
ఎ) చాంబర్లిన్
బి) కాలిన్ క్లార్క
సి) మార్షల్
డి) అమర్త్య సేన్
- View Answer
- సమాధానం: డి
15. పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం అధిక స్థాయి నుంచి తగ్గడాన్ని ఆర్థికాభివృద్ధిగా పేర్కొన్నది?
ఎ) డడ్లీసీర్స
బి) అమర్త్యసేన్
సి) పాల్ క్రూగ్ మన్
డి) పైవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
16. సుస్థిరవృద్ధి(సస్టెయినబుల్ డెవలప్మెంట్) అనే పదాన్ని మొదట ఉపయోగించినది?
ఎ) రాయల్ కమిషన్
బి) ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్
సి) గ్లోబల్ వార్మింగ్ కమిటీ
డి) షా కమిషన్
- View Answer
- సమాధానం: బి
17. భవిష్యత్ తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా, ప్రస్తుత తరం తమ అవసరాలు తీర్చుకోవడాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చు?
ఎ) ఆర్థికవృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) సుస్థిర వృద్ధి
డి) జీవన నాణ్యత పెంపు
- View Answer
- సమాధానం: సి
18. ఆధునిక ఆర్థికవృద్ధి గ్రంథ రచయిత?
ఎ) ఆడమ్‌స్మిత్
బి) సైమన్ కుజ్నెట్స్
సి) జోన్రాబిన్ సన్
డి) కార్ల మార్క్స
- View Answer
- సమాధానం: బి
19. ఆర్థికాభివృద్ధికి కొలమానంగా వాస్తవ స్థూల జాతీయోత్పత్తిని తీసుకోవచ్చని పేర్కొన్నవారు?
ఎ) సైమన్ కుజ్నెట్స్
బి) మీడ్
సి) ప్రాంకెల్
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
20. కింది వాటిలో ఆర్థికాభివృద్ధి సూచిక కానిది?
ఎ) తలసరి ఆదాయం
బి) తలసరి వినియోగ స్థాయి
సి) అవినీతి
డి) నికర ఆర్థిక సంక్షేమ సూచీ
- View Answer
- సమాధానం: సి
21. దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక, సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పులను ఏ విధంగా భావించవచ్చు?
ఎ) ఆర్థికవృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) కొనసాగించే అభివృద్ధి
డి) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి
- View Answer
- సమాధానం: బి
22. సమీకృత అభివృద్ధి సూచీని నిర్మించడానికి కారణం?
ఎ) భౌతిక జీవన ప్రమాణ సూచీని ఆర్థికాభివృద్ధి కొలమానం వినియోగించడంలో సమస్యలు ఉండటం.
బి) నికర ఆర్థిక సంక్షేమ సూచీని ఆర్థికాభివృద్ధి కొలమానంగా వినియోగించడంలో సమస్యలు ఉండటం.
సి) స్థూల జాతీయోత్పత్తిని ఆర్థికాభివృద్ధి కొలమానంగా వినియోగించడంలో సమస్యలు ఉండటం.
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
23. ఆదాయ సూచీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని రూపొందించినది?
ఎ) జేమ్స్ టోబిన్
బి) జోన్రాబిన్సన్
సి) అమర్త్యసేన్
డి) పిగు
- View Answer
- సమాధానం: ఎ
24. ఆర్థిక సంక్షేమ కొలమానానికి నికర ఆర్థిక సంక్షేమంగా పేరు మార్చినది?
ఎ) ఆడమ్‌స్మిత్
బి) పాల్ శామ్యుల్సన్
సి) పాల్ క్రూగ్మన్
డి) హెక్సర్-ఓలిన్
- View Answer
- సమాధానం: బి
25. భౌతిక జీవన ప్రమాణ సూచీ రూపకర్త?
ఎ) డేవిడ్ మోరిస్
బి) మహబుబ్ ఉల్హక్
సి) రాబిన్సన్
డి) జేమ్స్టోబిన్
- View Answer
- సమాధానం: ఎ
26. సమీకృత అభివృద్ధి సూచీని 14 కారకాలతో నిర్మించినది?
ఎ) కార్ల మార్క్స
బి) బెంజిమన్ గ్రాహం
సి) డోనాల్డ్ న్యూరోస్కి
డి) పై వారందరూ
- View Answer
- సమాధానం: సి
27. సమీకృత అభివృద్ధి సూచీని 41 కారకాలతో నిర్మించినది?
ఎ) ఓలిన్
బి) సింధియా మోరిస్
సి) బెంజిమన్ గ్రాహం
డి) మోడి గ్లియాని
- View Answer
- సమాధానం: బి
28. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజాశ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధిగా పేర్కొన్నది?
ఎ) మహబూబ్ ఉల్హక్
బి) సుఖమోయ్ చక్రవర్తి
సి) రంగరాజన్
డి) డి.సుబ్బారావు
- View Answer
- సమాధానం: ఎ
29. కింది వాటిలో అల్పాభివృద్ధి దేశాల లక్షణం కానిది?
ఎ) తక్కువ తలసరి ఆదాయం
బి) అధిక జనాభా ఒత్తిడి
సి) తక్కువ మూలధన కల్పన రేటు
డి) అల్ప నిరుద్యోగ స్థాయి
- View Answer
- సమాధానం: డి
30. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు సహజ వనరుల కంటే తక్కువ మూలధనం కలిగి ఉన్న వాటిని అల్పాభివృద్ధి దేశాలుగా ఎవరు పేర్కొన్నారు?
ఎ) రాగ్నార్ నర్క్స
బి) కార్ల మార్క
సి) డేవిడ్ మోరిస్
డి) టోబిన్
- View Answer
- సమాధానం: ఎ
31. సమీకృత సూచీని 11 కొలమానాలతో నిర్మించినది?
ఎ) ఇ.ఇ.హెగన్
బి) ఇర్మా అడల్మన్
సి) సింధియా మోరిస్
డి) పైవారెవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
32. నికర ఆర్థిక సంక్షేమ సూచీ=?
ఎ) తలసరి ఆదాయం-తలసరి వినియోగ వ్యయం
బి) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి +విశ్రాంతి సమయం + మార్కెటేతర కార్యకలాపాలు - పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం
సి) తలసరి స్థూల దేశీయోత్పత్తి - పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం
డి) వ్యష్టి ఆదాయం - పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం.
- View Answer
- సమాధానం: బి
33. భౌతిక జీవన ప్రమాణ సూచీని రూపొందించడంలో కింది వాటిలో ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోరు?
ఎ) ప్రజల ఆయురార్థం
బి) శిశు మరణరేటు
సి) అక్షరాస్యత
డి) సాంకేతిక పరిజ్ఞానం
- View Answer
- సమాధానం: డి
34. ఆరు అంశాలతో కనీస అవసరాల దృక్పథాన్ని అభివృద్ధి చేసినది?
ఎ) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
బి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
సి) ప్రపంచ బ్యాంకు
డి) ఐక్యరాజ్య సమితి
- View Answer
- సమాధానం: ఎ
35. ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించిన మానవవనరులు ఒక వైపు, ఉపయోగించని సహజవనరులు మరోవైపు కలిసి ఉండే దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా పేర్కొన్నది?
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
సి) ప్రణాళికా సంఘం
డి) ఆర్థిక సంఘం
- View Answer
- సమాధానం: సి
36. మానవాభివృద్ధి నివేదికను ప్రచురించేది?
ఎ) నీతి ఆయోగ్
బి) యూఎన్డీపీ
సి) యూఎన్‌సీటీఏడీ
డి) డబ్ల్యూటీవో
- View Answer
- సమాధానం: బి
37. లింగ సంబంధిత అభివృద్ధి సూచీని యూఎన్డీపీ ఎప్పుడు ప్రవేశపెట్టింది?
ఎ) 1993
బి) 1994
సి) 1995
డి) 1997
- View Answer
- సమాధానం: సి
38. మానవ పేదరిక సూచీ-2ను యూఎన్డీపీ ఎప్పుడు ప్రవేశపెట్టింది?
ఎ) 1998
బి) 1999
సి) 2000
డి) 2001
- View Answer
- సమాధానం: ఎ
39. {Xన్ ఇండెక్స్‌ను అభివృద్ధి పర్చింది?
ఎ) హయక్
బి) ఓలిన్
సి) ప్రపంచ బ్యాంకు పర్యావరణ, సుస్థిర వృద్ధి విభాగం
డి) ప్రపంచ బ్యాంకులోని క్రిప్స్ మిషన్
- View Answer
- సమాధానం: సి
40. ఆర్థికాభివృద్ధి సూచీని రూపొందించినది?
ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ
బి) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ
సి) ప్రపంచ బ్యాంకు
డి) ఆసియా అభివృద్ధి బ్యాంకు
- View Answer
- సమాధానం: బి
41. యూఎన్డీపీ, ఆక్స్ఫర్డ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్‌లు సంయుక్తంగా గ్లోబల్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ను ఎప్పుడు అభివృద్ధి పరిచాయి?
ఎ) 2007
బి) 2008
సి) 2009
డి) 2010
- View Answer
- సమాధానం: డి
42. వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలియజేసేది ఆర్థికవృద్ధి అని పేర్కొన్నది?
ఎ) కిండల్ బర్గర్
బి) రిచర్డ టి.గిల్
సి) ప్రాంకెల్
డి) మీడ్
- View Answer
- సమాధానం: ఎ