Skip to main content

భారతదేశంలో తొలిసారి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి?

1980వ దశకంలో ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధేతర వ్యయంలో పెరుగుదల ఏర్పడింది. దాంతో 1981-82లో దేశ జీడీపీలో 5.1 శాతం ఉన్న ద్రవ్యలోటు 1990-91 నాటికి 7.8 శాతానికి పెరిగింది. 1990లో గల్ఫ్ సంక్షోభం కారణంగా దేశంలో ఆర్థిక సమస్యలు పెరిగాయి.
1980-81లో జీడీపీలో1.85 శాతం ఉన్న కరెంటు అకౌంటు లోటు 1990-91 నాటికి 3.69 శాతానికి పెరిగింది. 1990-91లో ద్రవ్యోల్బణం 10.3 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో 1991లో అధికారంలోకి వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం సరళీకరణ విధానాలను ప్రకటించడం ద్వారా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విత్త అసమతుల్యత, చెల్లింపుల శేషంలో సంక్షోభం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీన్ని నివారించేందుకు దేశంలో ఆర్థిక సంస్కరణల ఆవశ్యకత ఏర్పడింది. సంస్కరణల్లో భాగంగా స్థూల ఆర్థిక స్థిరీకరణ, నిర్మాణాత్మక సర్దుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

1. స్థూల ఆర్థిక స్థిరీకరణ-డిమాండ్ వైపు యాజమాన్యం
ఎ. ద్రవ్యోల్బణ నియంత్రణ
బి. విత్త సర్దుబాటు
సి. చెల్లింపుల శేషం సర్దుబాటు

2. నిర్మాణాత్మక సర్దుబాటు-సప్లయ్ వైపు యాజమాన్యం
ఎ. వాణిజ్య, మూలధన ప్రవాహ సంస్కరణలు
బి. పారిశ్రామిక రంగంపై నియంత్రణల తొలగింపు
సి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు
డి. విత్త రంగ సంస్కరణలు

ఆర్థిక సంస్కరణల అమలు- ప్రభావం
ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగవంతమైంది. 1980వ దశకంలో సగటు సాంవత్సరిక వృద్ధి 5.9 శాతం కాగా 2000-01 నుంచి 2010-11 మధ్యకాలంలో సగటు సాంవత్సరిక వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. సగటు తలసరి వ్యయం, వాస్తవిక వేతనాల్లో పెరుగుదల రేటు తక్కువ. సంస్కరణల అమలు కాలంలో వ్యవసాయ శ్రామికుల వాస్తవిక వ్యవసాయ వేతనాల్లో తగ్గుదల ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థలో నమోదైన వృద్ధిని ఆర్థికవేత్తలు ఉపాధి రహిత వృద్ధిగా అభిప్రాయపడ్డారు.
సంస్కరణల అమలు కాలంలో అసమానతలు పెరిగాయి.
ముఖ్య రాష్ట్రాల్లో ప్రజల జీవన స్థితిగతులు క్షీణించాయి.
విద్య, ఆరోగ్య సంరక్షణలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడే వారి సంఖ్య పెరిగింది.
  • భారతదేశంలో తొలిసారి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి?
    -రాజీవ్‌గాంధీ
  • పారిశ్రామిక లెసైన్సింగ్ విధానంలో లోపాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ?
    -హజారీ కమిటీ
  • లెసైన్‌‌సల విస్తృత ఏకీకరణ పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
    - 1984
  • భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు దారితీసిన పరిస్థితులు?
    - విదేశీ మారకద్రవ్య సంక్షోభం, అధిక ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం.
  • సంస్కరణల్లో భాగంగా అధిక ప్రాధాన్యత గల రంగాల్లో విదేశీ మూలధనాన్ని ఎంత శాతం మేర అనుమతించారు?
    - 51 శాతం
  • 1980లో మొదటిసారిగా ప్రైవేటీకరణను అమలుచేసినదేశం?
    -ఇంగ్లాండ్
  • 2022లోగా జాతీయ స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా ఎంత శాతం ఉండాలని జాతీయ తయారీ విధానం- 2011 లక్ష్యంగా పెట్టుకుంది?
    - 25 శాతం
  • దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో 2014, సెప్టెంబర్ 25న ప్రారంభించిన పథకం?
    - మేక్ ఇన్ ఇండియా
  • ఆర్థిక కార్యకలాపాలు దేశ రాజకీయ సరిహద్దులు దాటి విస్తరించడాన్ని ప్రపంచీకరణగా పేర్కొంది?
    -దీపక్ నాయర్
  • కస్టమ్స్ మూల్యాంకన నియమాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది?
    - 1998
  • బ్యాంకింగ్ రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన సిఫార్సులను చేసేందుకు ఎవరి అధ్యక్షతన విత్త విధాన కమిటీ ఏర్పాటైంది?
    - ఎం.నరసింహం
  • వాణిజ్య, పారిశ్రామిక రంగాలపై అనవసర నియంత్రణలు, ఆంక్షలను తొలగించడాన్ని ఏమంటారు?
    -సరళీకరణ
  • ‘ప్రపంచంలోని దేశాలు తమ సరిహద్దులను దాటి వస్తు సేవలు, అంతర్జాతీయ మూలధన ప్రవాహం, సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి ద్వారా అంతర్గత సంబంధంతో అంతర్జాతీయ వ్యాపార పరిమాణాన్ని పెంపొందించుకొనే విధానమే ప్రపంచీకరణ’ అని పేర్కొంది?
    - ఐ.ఎం.ఎఫ్
  • చైనా ఏ సంవత్సరంలో సెజ్‌లను ఏర్పాటు చేసింది?
    - 2004
  • బ్రాడ్ బాండింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ లెసైన్‌‌స విధానం అంటే?
    - ప్రత్యామ్నాయ వస్తువులను పోలి ఉన్న వస్తువులన్నిటినీ చేర్చి, ఒకే జాబితా కింద ప్రభుత్వం లెసైన్‌‌సలను జారీ చేయడం
  • మూల్యహీనీకరణ ప్రధాన ఉద్దేశం?
    - ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడం.
  • ఎక్స్‌పోర్‌‌ట ప్రాసెసింగ్ జోన్ల స్థానంలో ఏర్పాటు చేసినవి?
    - స్వేచ్ఛా వాణిజ్య జోన్లు
  • దేశ రక్షణ రంగ పరిశ్రమల్లో ఎంత శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు?
    - 100 శాతం
  • ఏక గవాక్ష విధానం లక్ష్యం?
    - కుటీర, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడానికి కావాల్సిన అన్ని అనుమతులను ఒకేచోట మంజూరు చేయడం.
  • నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి ఇంతకు ముందున్న పేరు?
    - నేషనల్ అడ్వయిజరీ కమిటీ ఆన్ అకౌంట్స్ స్టాండర్‌‌డ్స
  • మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వేటి ఆధారంగా రూపొందించారు?
    - నూతన అవస్థాపనా సౌకర్యం, నూతన విధానం, నూతన రంగాలు, నూతన దృక్పథం.
  • ప్రపంచీకరణ అందరికీ సమానంగా లబ్ధి చేకూర్చడంలేదని తెలిపిన నోబెల్ అవార్డు గ్రహీత?
    -స్టిగ్‌లిట్జ్
  • ప్రభుత్వ రంగ పరిశ్రమల షేర్లను కార్పొరేట్ పరం చేయడం ద్వారా మార్కెట్ చలనత్వం పెరిగి వాణిజ్య నిర్ణయాలకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్న వ్యక్తి?
    -ఆర్.కె.మిశ్రా
  • ప్రైవేటీకరణ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వాడకంతో అవస్థాపితా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చని పేర్కొంది?
    -రాజీవ్‌గాంధీ
  • నగదు బదిలీ, రాజీవ్ ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలను ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
    -12వ ప్రణాళిక
  • ఇన్సూరెన్‌‌స రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం?
    -1999
  • రాష్ట్రీయ సమ్ వికాస్ యోజన లక్ష్యం?
    - ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం
  • జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
    - 2000
  • ఒకే దేశం-ఒకే లెసైన్‌‌స, మొబైల్ నంబర్ పోర్టబులిటీలను అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా నూతన టెలికాం విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
    - 2012
  • మానవ జాతి సంక్షేమం, స్వాతంత్య్రాలను పెంపొందించి ప్రజాస్వామ్యం, స్థానిక ప్రజల అభివృద్ధికి తోడ్పడే సాధనంగా ప్రపంచీకరణను పేర్కొంది?
    -ప్రపంచ శ్రామిక సంస్థ
  • ఫెరా స్థానంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం?
    -1999
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమర్థత, ఆర్థిక స్థోమతలను పెంపొందించేందుకు ప్రైవేటీకరణ అవసరమని 1992లో భావించిన సంస్థ?
    - ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్
  • కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని స్థానంలో ఏర్పాటైంది?
    - MRTP కమిషన్
  • పెన్షన్ రంగంలో సంస్కరణలను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
    - 2004, ఏప్రిల్ 1
  • సూక్ష్మ సంస్థలకు రుణాలిచ్చే సంస్థలకు రీఫైనాన్‌‌స చేసేది?
    - ముద్రా
  • 2000-15 మధ్యకాలంలో భారత్‌కు మారిషస్ తర్వాత ఏ దేశం నుంచి అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి?
    - సింగపూర్
  • 1994-95లో ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా కరెంట్ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడిని ప్రవేశపెట్టారు?
    - రంగరాజన్ కమిటీ
  • ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు ఉద్దేశం?
    - విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతులు, వాణిజ్య సామర్థ్యం పెంపు
  • ప్రభుత్వరంగ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోవాలని సిఫార్సు చేసిన కమిటీ?
    - అర్జున్ సేన్ గుప్తా కమిటీ
  • ఏ చట్టం స్థానంలో పోటీ చట్టాన్ని ప్రకటించారు?
    -యం.ఆర్.టి.పి
  • సరళీకృత ఆర్థిక విధానాలుగా, రావు-మన్మోహన్ నమూనాగా/ఎల్.పి.జి. నమూనాగాఏ పారిశ్రామిక తీర్మానాన్ని భావిస్తారు?
    - 1991 పారిశ్రామిక తీర్మానం
  • ప్రభుత్వం చిన్న, అతి చిన్న గ్రామీణ పరిశ్రమల కోసం ప్యాకేజీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
    -1991 ఆగస్టు
  • 1997లో ఏ కమిటీ సిఫారసుల మేరకు చిన్న తరహా పరిశ్రమల యంత్ర పరికరాలపై పెట్టుబడి పరిమితిని రు. 3 కోట్లకు పెంచారు?
    - అబిద్ హుస్సేన్
  • ఏ కమిటీ సిఫారసుల మేరకు జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ను 1995లో ఏర్పాటు చేశారు?
    - కార్వే కమిటీ
  • ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిటీని 2001లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
    - కె.సి.పంత్
  • లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?
    - 2006
  • పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రూపొందించిన పథకం?-నిర్మల్ భారత్ అభియాన్
  • ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం లక్ష్యం?
    - గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు బీమా సౌకర్యం కల్పించడం
Published date : 02 Mar 2017 04:26PM

Photo Stories