ఐఎంఎఫ్ అభిప్రాయంలో ప్రస్తుత కొనుగోలు శక్తిసామ్యం (పీపీపీ) ఆధారంగా 2014-15లో ప్రపంచ జీడీపీలో భారత్ వాటా ఎంత?
1. కింది వాటిలో కార్ల్‌మార్క్స్ సిద్ధాంతంలో ప్రధాన అంశం ఏది?
ఎ. గతితార్కిక భౌతికవాదం
బి. మిగులు విలువ సిద్ధాంతం
సి. శ్రామిక నియంతృత్వం
డి. ఉత్పన్న వృద్ధి రంగం
1) ఎ, బి
2) సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
2. రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు కింది ఏ దశలో ఉంటాయి?
1) సంప్రదాయ సమాజం
2) ప్లవన దశ
3) ప్లవన దశకు నిబంధన
4) అధిక వినియోగ దశ
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో అల్పాభివృద్ధి దేశాల లక్షణం కానిది ఏది?
ఎ. మూలధన కొరత
బి. అల్ప పొదుపు రేటు
సి. ప్రదర్శన ప్రభావం ఉండటం
డి. సామాజిక ద్వంద్వత్వం
ఇ. పెట్టుబడి రేటు అధికంగా ఉండటం
1) ఎ, ఇ
2) సి, ఇ
3) ఎ, సి, ఇ
4) ఇ మాత్రమే
- View Answer
- సమాధానం: 4
4. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే ఆర్థికేతర అంశం కానిది ఏది?
1) మానవ వనరులు
2) మూలధన-ఉత్పత్తి నిష్పత్తి
3) సాంఘిక అంశాలు
4) రాజకీయ, పరిపాలనా సంబంధమైన కారకాలు
- View Answer
- సమాధానం: 2
5. 1991 నుంచి 2013 మధ్య కాలంలో ప్రపంచ వృద్ధి పెరుగుదలకు కారణమైన ముఖ్య అంశం ఏది?
1) పెట్టుబడి రేటు
2) పొదుపు రేటు
3) అంతిమ వినియోగం
4) మూలధన కల్పన
- View Answer
- సమాధానం: 3
6. ఐఎంఎఫ్ అభిప్రాయంలో ప్రస్తుత కొనుగోలు శక్తిసామ్యం (పీపీపీ) ఆధారంగా 2014-15లో ప్రపంచ జీడీపీలో భారత్ వాటా ఎంత?
1) 7 శాతం
2) 7.5 శాతం
3) 8 శాతం
4) 8.5 శాతం
- View Answer
- సమాధానం: 1
7. కనీస కృషి సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వ్యవస్థలో అనుకూల పరిస్థితులు ఏర్పడటానికి కింది వారిలో కారకులు ఎవరు?
ఎ. పెట్టుబడిదారులు
బి. మిగులు శ్రామికులు
సి. పొదుపు చేసేవారు
డి. నవకల్పన చేసేవారు
1) ఎ, డి
2) సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 4
8. వ్యవసాయ రంగంలోని మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలిస్తే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కింద పేర్కొన్న ఏ నమూనా తెలుపుతుంది?
1) కనీస కృషి సిద్ధాంతం
2) ద్వైవిద్య ఆర్థిక నమూనా
3) నవకల్పన సిద్ధాంతం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
9. భౌతిక జీవన ప్రమాణ సూచీ రూపకల్పనలో డేవిడ్ మోరిస్ కింది ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు?
1) అంతిమ వినియోగం
2) ఆయుర్ధాయం
3) అక్షరాస్యత
4) శిశుమరణాల రేటు
- View Answer
- సమాధానం: 1
10. లింగ సంబంధిత అభివృద్ధి సూచీ గణనలో భాగంగా 2015 మానవాభివృద్ధి నివేదిక అధిక లింగ వివక్ష ఉన్న దేశాలను ఏ గ్రూపులో పేర్కొంది?
1) గ్రూప్ - 1
2) గ్రూప్ - 3
3) గ్రూప్ - 5
4) గ్రూప్ - 6
- View Answer
- సమాధానం: 3
11. కింది వాటిలో మూలధన-ఉత్పత్తి నిష్పత్తికి సంబంధించి సరైంది ఏది?
ఎ. శ్రమ సాంద్రత ఉన్న పరిశ్రమల్లో మూలధన-ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది
బి. మూలధన సాంద్రత ఉన్న పరిశ్రమల్లో మూలధన-ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది
సి. విద్యా ప్రమాణాలు, శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన-ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది
1) ఎ మాత్రమే
2) ఎ, సి
3) బి మాత్రమే
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
12. హరాడ్-డోమార్ వృద్ధి నమూనాకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ. అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ముఖ్యాంశాలు - శ్రామిక శక్తి, పెట్టుబడులు
బి. హరాడ్-డోమార్ నమూనా స్థిర వృద్ధికి కావాల్సిన అంశాలను తెలుపుతుంది
సి. పొదుపును ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు సమకూర్చుకోవాలి
డి. అల్పాభివృద్ధి దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెట్టుబడులు
1) ఎ, డి
2) బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
13. గున్నార్ మిర్దాల్‌కు కింది వాటిలో దేనితో సంబంధం ఉంది?
1) దీర్ఘకాల స్తంభన వృద్ధి సిద్ధాంతం
2) నిరంతర ప్రణాళిక
3) సంక్షేమ అర్థశాస్త్ర విశ్లేషణ
4) ప్రేరిత పెట్టుబడి
- View Answer
- సమాధానం: 2
14. 2015-16లో ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద తలసరి నికర జాతీయ ఆదాయం ఎంత?
1) రూ. 93,231
2) రూ. 94,750
3) రూ. 95,235
4) రూ. 95,245
- View Answer
- సమాధానం: 1
15. కింది వాటిలో ప్రవాహ భావన ఏది?
1) దేశంలో మొత్తం వాహనాల సంఖ్య
2) ఒక ఏడాదిలో జనాభా పెరుగుదల
3) కుటుంబం మొత్తం సంపద
4) దేశంలోని మొత్తం పెట్టుబడి
- View Answer
- సమాధానం: 2
16. కింద పేర్కొన్న చర్యల్లో ప్రభుత్వం వేటి ద్వారా.. చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది?
ఎ. అంతిమ వస్తువులు, సేవలపై ప్రభుత్వ వ్యయం
బి. బదిలీ చెల్లింపులు
సి. పన్నులు
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, సి
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం:3
17. కింది వాటిలో ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లెక్కింపులో పరిగణనలోకి తీసుకోని అంశం ఏది?
1) భాటకం
2) వేతనం
3) లాభం
4) విరాళాలు
- View Answer
- సమాధానం: 4
18. ఉత్పత్తి మదింపు పద్ధతిని ‘ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్’గా పేర్కొన్నవారెవరు?
1) షుంపీటర్
2) సైమన్ కుజ్నట్స్
3) జె.ఎం. కీన్స్
4) గౌతం మాథుర్
- View Answer
- సమాధానం: 2
19. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం స్థిర బేసిక్ ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి శాతం ఎంత?
1) 7.1
2) 7.2
3) 7.3
4) 7.4
- View Answer
- సమాధానం: 3
20.2011-12 నుంచి 2014-15 మధ్య కాలంలో మొత్తం స్థూల కలిపిన విలువలో వ్యవసాయం, అనుబంధాల వాటా ఎంత?
1) 16.5 శాతం
2) 17.5 శాతం
3) 18.5 శాతం
4) 19.5 శాతం
- View Answer
- సమాధానం: 2
21. 2011-12 నుంచి 2014-15 మధ్య కాలంలో స్థూల స్వదేశీ పొదుపు రేటులో తగ్గుదలఎంత శాతం?
1) 1.6
2) 1.7
3) 1.8
4) 1.85
- View Answer
- సమాధానం: 1
22. కింది వాటిలో అత్యధిక వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఏది?
1) 1972-73
2) 1974-75
3) 1987-88
4) 1988-89
- View Answer
- సమాధానం:4
23. ప్రైవేట్ రంగ కార్యకలాపాల నుంచి లభించిన ఆదాయం + ఇతర దేశాల నుంచి ఉత్పత్తి కారకాలకు నికర చెల్లింపులు + ప్రభుత్వం నుంచి వచ్చిన చెల్లింపులు - ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు కింది వాటిలో దేనికి సమానం?
1) వ్యష్టి ఆదాయం
2) ప్రైవేట్ వ్యయార్హ ఆదాయం
3) స్థూల కలిపిన విలువ
4) స్థూల జాతీయోత్పత్తి
- View Answer
- సమాధానం: 2
24. జాతీయ సంపదను కింది ఏ మార్గం ద్వారా పెంచుకోవచ్చు?
ఎ. ప్రస్తుత ఆస్తుల విలువలో మార్పు ద్వారా
బి. జాతీయ పొదుపు ద్వారా
సి. మూలధన తరుగుదలను అధికం చేయడం ద్వారా
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) బి, సి
- View Answer
- సమాధానం: 3
25. జాతీయ పొదుపు కింది వాటిలో దేనికి సమానం?
1) జీడీపీ + ఇతర దేశాల నుంచి ఉత్పత్తి కారకాలకు నికర చెల్లింపులు - వినియోగం - ప్రభుత్వ కొనుగోళ్లు
2) జీడీపీ - వినియోగం - ప్రభుత్వ కొనుగోళ్లు
3) జీడీపీ + వినియోగం - ప్రభుత్వ కొనుగోళ్లు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
26. వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి =
1) నామమాత్ర జీడీపీ ÷ జీడీపీ రిఫ్లేటర్
2) నామమాత్ర జీడీపీ ÷ జీడీపీ డిఫ్లేటర్
3) నామమాత్ర జీడీపీ + ద్రవ్యోల్బణ రేటు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 2
27. నేషనల్ శాంపిల్ సర్వే 68వ రౌండు (2011-12) గణాంకాల ప్రకారం అతి తక్కువ పేదరిక రేటు నమోదైన రాష్ట్రాలేవి?
ఎ. గోవా
బి. కేరళ
సి. జార్ఖండ్
డి. ఛత్తీస్‌గఢ్
1) ఎ మాత్రమే
2) సి, డి
3) ఎ, బి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
28.పేదరిక అంచనాకు సురేశ్ టెండూల్కర్ ఉపయోగించిన పద్ధతి కింది వాటిలో దేన్ని పోలి ఉంటుంది?
1) యూనిఫాం రిఫరెన్స్ పీరియడ్
2) మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్
3) మాడిఫైడ్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
29. దారిద్య్ర రేఖ, సగటు పేదరిక రేఖ దిగువన ఉన్న జనాభాకు మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారు?
1) నిరుద్యోగం
2) తలసరి వినియోగ వ్యయం
3) సంక్షేమం
4) పేదరిక అంతరం
- View Answer
- సమాధానం: 4
30. కింది వాటిలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా ఉన్నవి ఏవి?
ఎ. జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం
బి. జాతీయ ఫ్యామిలీ బెనిఫిట్ పథకం
సి. జాతీయ పునరావాస కార్యక్రమం
డి. జాతీయ మెటర్నిటీ బెనిఫిట్ పథకం
1) ఎ, సి
2) సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం:3
31. నిరుద్యోగంపై భగవతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రకారం 1971లో దేశంలో మొత్తం నిరుద్యోగుల సంఖ్య?
1) 15.7 మిలియన్లు
2) 16.7 మిలియన్లు
3) 17.7 మిలియన్లు
4) 18.7 మిలియన్లు
- View Answer
- సమాధానం: 4
32.ఉపాంత శ్రామికులు అంటే?
1) ఒక ఆర్థిక సంవత్సరంలో 183 రోజుల కంటే తక్కువ పని దినాలు ఉన్న శ్రామిక శక్తి
2) ఒక ఆర్థిక సంవత్సరంలో 183 రోజుల కంటే ఎక్కువ పని దినాలున్న శ్రామిక శక్తి
3) శ్రామిక శక్తిలో భాగంగా ఉండి ఉపాధి పొందలేనివారు
4) శ్రామిక శక్తిలో భాగంగా ఉండి ఉపాధి పొందగలిగినవారు
- View Answer
- సమాధానం: 1
33. అభివృద్ధి చెందిన దేశాల్లో దేని కారణంగా ఘర్షిత నిరుద్యోగం ఉంటుందని కీన్స్ పేర్కొన్నారు?
1) సమష్టి సరఫరా అధికంగా ఉండటం
2) ఉత్పత్తి వ్యయాలు పెరగడం
3) సార్థక డిమాండ్ లోపించడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
34. అవ్యవస్థీకృత రంగంలోని శ్రామిక శక్తికి పింఛన్ సౌకర్యం కల్పించడానికి 2011లో ప్రారంభించిన పథకం ఏది?
1) ఇందిర జీవిత బీమా
2) స్వావలంబన
3) ఆమ్ ఆద్మీ బీమా యోజన
4) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
- View Answer
- సమాధానం: 2
35. 2011-12లో నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం నాగాలాండ్ తర్వాత అధిక నిరుద్యోగిత రేటు ఏ రాష్ట్రంలో ఎక్కువ?
1) కేరళ
2) గుజరాత్
3) సిక్కిం
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
36. కింది వాటిలో పట్టణ వేతన ఉపాధి పథకం ఏది?
1) జవహర్ రోజ్‌గార్ యోజన
2) నెహ్రూ రోజ్‌గార్ యోజన
3) సామాజిక అభివృద్ధి పథకం
4) వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన
- View Answer
- సమాధానం: 2
37.స్కీమ్ ఆఫ్ హౌసింగ్ అండ్ షెల్టర్ అప్గ్రేడేషన్ను ఏ పథకంలో విలీనం చేశారు?
1)జేఆర్‌వై
2) ఎన్ఆర్‌వై
3) స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన
4) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన
- View Answer
- సమాధానం: 3
38. 2011తో పోల్చినప్పుడు 2012లో (ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిపి) సంఘటిత రంగంలో ఉపాధి పెరుగుదల ఎంత?
1) 2 శాతం
2) 3 శాతం
3) 3.5 శాతం
4) 4 శాతం
- View Answer
- సమాధానం: 1
39.2015-16 ఆర్థిక సంవత్సరంలో (2016 జనవరి 1 వరకు) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల ఎన్ని కుటుంబాలకు ఉపాధి లభించింది?
1) 2.54 కోట్లు
2) 3.10 కోట్లు
3) 3.53 కోట్లు
4) 3.63 కోట్లు
- View Answer
- సమాధానం:4
40. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో ఎవరు?
1) అమితాబ్ కాంత్
2) అరవింద్ పనగరియా
3) వై .వి. రెడ్డి
4) అరవింద్ చతుర్వేది
- View Answer
- సమాధానం: 1
41. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక వ్యూహం కింది ఏ అంశం వల్ల ప్రభావితమైంది?
ఎ. భారీ పారిశ్రామిక వ్యూహం
బి. ఉపాధి కల్పన
సి. మహలనోబిస్ వృద్ధి నమూనా
డి. సామాజిక లక్ష్యాలు
1) ఎ, డి
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
42. కింది వాటిలో పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్య అంశం ఏది?
ఎ. అధిక వృద్ధి నిర్వహణ
బి. ఆర్థిక క్రమశిక్షణ, అధిక పెట్టుబడి
సి. సాంఘిక రంగం లాంటి కీలక రంగాల్లో ప్రభుత్వ జోక్యం
1) ఎ మాత్రమే
2) బి, సి
3) ఎ, బి, సి
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 3
43. పదకొండో పంచవర్ష ప్రణాళికలో ప్రసూతి మరణాల రేటును ప్రతి వేయి జననాలకు ఎంతకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) సున్నా
2) ఒకటి
3) రెండు
4) మూడు
- View Answer
- సమాధానం: 2
44. తలసరి ఆదాయ వృద్ధి అత్యధికంగా ఎన్నో పంచవర్ష ప్రణాళికలో నమోదైంది?
1) 8
2) 9
3) 10
4) 11
- View Answer
- సమాధానం: 4