Skip to main content

2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధి?

2019 - 20 కేంద్ర బడ్జెట్ :
 ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్‌ను 2019 జూలై 5న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. అపరిమిత నియంత్రణను తగ్గించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, సాంఘిక అవస్థాపన పెంపు, డిజిటల్ ఇండియా, కాలుష్య రహిత భారత్, మేక్ ఇన్ ఇండియా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉపాధి కల్పన, అవస్థాపనా సౌకర్యాలపై అధిక పెట్టుబడులు లాంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. 2018-19 బడ్జెట్ అంచనాలతో పోల్చినప్పుడు 2019-20 మొత్తం బడ్జెట్ వ్యయంలో పెరుగుదల 14.09 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్ల మూలధన నిధులను అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్షాన్ని రూ.1.05 లక్షల కోట్లుగా ప్రకటించారు. సామాజిక సంక్షేమం లక్ష్యంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు తమ షేర్లను స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీర్ఘకాలిక రుణ పత్రాల మార్కెట్‌ను విస్తృత పరచడానికి త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు  ఆర్థిక మంత్రి తెలిపారు. టర్నోవర్ రూ.250 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఉన్న చిన్న కార్పొరేట్ కంపెనీలపై విధించే కార్పొరేషన్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ బాండ్ మార్కెట్ పటిష్టతకు తగిన చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
 
  విమానయానం, మీడియా, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపునకు అవసరమైన చర్యలను పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. సమగ్ర జాతీయ హైవే కార్యక్రమం పునర్నిర్మాణం చేపడతామన్నారు. లిస్టెడ్ కంపెనీలలో పబ్లిక్ వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థికమంత్రిత్వ శాఖ సెబీకి ప్రతిపాదించింది. 2014 అక్టోబర్ 2 తర్వాత 9.6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి గ్రామంలో ‘ఘన వ్యర్థాల నిర్వహణ’ (ౌజీఛీ గ్చిట్ట్ఛ క్చ్చజ్ఛఝ్ఛ్ట) చేపట్టడానికి స్వచ్ఛ భారత్ మిషన్‌ను విస్తరిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారు.
 
  నిర్మాణాత్మక సంస్కరణల ఆవశ్యకతను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి పేర్కొన్నారు. భౌతిక కనెక్టివిటీ పెంపునకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇచ్చింది. అవస్థాపనా రంగం, ఎమ్‌ఎస్‌ఈలలో ఉపాధి కల్పనకు అధిక పెట్టుబడుల అవసరం. ఎయిర్ క్రాఫ్ట్ ఫైనాన్సింగ్, లీజింగ్ కార్యకలాపాల్లో భారత్ ప్రవేశించిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2019 మేలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... సాంఘిక - ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. 2024 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం సవాలు అయినప్పటికీ సాధించగలిగిన లక్ష్యంగా మోదీ పేర్కొన్నారు. 2014లో మొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.85 ట్రిలియన్ డాలర్లు కాగా ప్రస్తుతం 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గంగానదిపై సరకు రవాణా వచ్చే నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరుగుతుందని ఆర్థికమంత్రి అభిలషించారు. భారత్ భవిష్యత్తుకు జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి సాధన ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. కౌలు నమూనా చట్టాన్ని రూపొందించి రాష్ట్రాలకు అందించగలమని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు భారత్‌లో విద్యనభ్యసించే విధంగా వారిని ప్రోత్సహించడానికి ‘స్టడీ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. నీటి భద్రత, శుభ్రమైన త్రాగునీరు అందించడం అనేది ప్రాధాన్యత కలిగిన అంశం. వివాదాలను తగ్గించడానికి శ్రామిక కోడ్‌లను సవరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ ప్రభావం, నాయకత్వం పెరుగుదల నేపథ్యంలో ఇప్పటి వరకు రెసిడెంట్ డిప్లోమాటిక్ మిషన్ లేని దేశాలలో భారత్ తన ఎంబసీలు, హైకమిషన్‌లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
 
  2018-2030 మధ్య కాలంలో రైల్వే రంగంలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి రూ. 50 లక్షల  కోట్లు అవసరమవుతాయని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య ప్రాధాన్యతను పేర్కొన్నారు. ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో  పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇతర దేశాల్లో ఉపాధి పొందే విధంగా యువతకు భాషా శిక్షణతో పాటు నైపుణ్యత పెంపొందించడానికి ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్‌‌స, ఇంటర్నెట్ ఆఫ్ తింగ్‌‌స, బిగ్ డేటా, 3డి ప్రింటింగ్, రోబోటిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.
 
మాదిరి ప్రశ్నలు :
Published date : 24 Jul 2019 02:48PM

Photo Stories