Skip to main content

17వ ఆసియాన్ ఎకనమిక్ కమ్యూనిటీ కౌన్సిల్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది?

సంస్కరణలు - భారత్ పురోగతి
పణాళికాబద్ధ్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 1951వ సంవత్సరం తర్వాత కాలంలో రూపుదిద్దుకుంది. ప్రణాళికా యుగంలో మొదటి కొన్ని ప్రణాళికలలో అధిక వృద్ధి సాధనపై దృష్టి కేంద్రీకరించి తయారీ, పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకుంది. వ్యవసాయం, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంఘిక రంగ అభివృద్ధిపై ప్రణాళికలు దృష్టి కేంద్రీకరించాయి. ఆర్థిక, కరెన్సీ సంక్షోభాలను 1991వ సంవత్సరం ముందు కాలంలో భారత్ ఎదుర్కొన్నప్పటికీ తర్వాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అవలంభించడం ద్వారా సంస్కరణల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో (2008) భారత్ 2008-09వ సంవత్సరంలో అల్పాభివృద్ధిని (6.7 శాతం) నమోదు చేసుకున్నప్పటికీ అభిలషణీయ ద్రవ్య, కోశ విధానాలను అవలంభించడం ద్వారా అధిక వృద్ధిని భారత్ తర్వాత కాలంలో నమోదు చేసుకుంది.
  • ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా 1990, 2000 దశకాల్లో భారత ఆర్థిక వ్యవస్థ అనేక మార్పులను చవిచూసింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యునెటైడ్ కింగ్‌డమ్ తర్వాత భారత్ స్థూలదేశీయోత్పత్తిపరంగా 2017లో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం రాబోయే కాలంలో యు.కె.ను జి.డి.పి.పరంగా భారత్ అధిగమించి ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే సూచనలు కన్పిస్తున్నాయి. అమెరికా స్థూలదేశీయోత్పత్తి 2017లో 19.39 ట్రిలియన్ డాలర్లు కాగా చైనా, జపాన్, జర్మనీ, యు.కె, భారత్‌లు 12.24, 4.87, 3.68, 2.62, 2.60 ట్రిలియన్ డాలర్లు స్థూల దేశీయోత్పత్తిని నమోదు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరుచుకోవడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. వస్తు, సేవల పన్ను, IBC(Insolvency and Bankruptcy Code) అమలును ముఖ్య చర్యలుగా పేర్కొనవచ్చు. పెద్ద నోట్లరద్దు, వస్తు సేవల పన్ను అమలు లాంటి విధానాలు భారత వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించగలవని భారత్ , ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆర్థికవేత్తలు ఈ విధానాల అమలు ప్రారంభంలో అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారత్ Projected Growth Rate ను తగ్గించాయి. అవరోధాలను అధిగమించడం ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవడాన్ని ఐ.ఎం.ఎఫ్. ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • 2018 నాటికి యు.కె.ను అధిగమించి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించగలదని, 2022 నాటికి కొనుగోలు శక్తి సామ్యం (PPP) ఆధారంగా లెక్కింపబడే స్థూల దేశీయోత్పత్తి పరంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నదని ఐ.ఎం.ఎఫ్. గణాంకాలు స్పష్టపరుస్తున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో పటిష్ట వృద్ధిని నమోదు చేసుకోవడం ద్వారా నామినల్ జి.డి.పి. పరంగా జపాన్‌ను భారత్ అధిగమించగలదని బ్యాంక్ ఆఫ్ అమెరికా Merrill Lynch నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రకారం చైనా తర్వాత బ్రిక్స్ దేశాలలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడానికి ఫైనాన్షియల్ మెచ్యూరిటీ ,ఆదాయాల పెరుగుదల, dependecy ratio లో తగ్గుదల లాంటి అంశాలు దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. పెట్టుబడిలో పురోగతి, పటిష్టమైన వినియోగ డిమాండ్ లాంటి అంశాలు 2018- 19లో భారత్ 7.3 శాతం వృద్ధి సాధనకు దోహదపడగలవని ఐ.ఎం.ఎఫ్. పేర్కొంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్, నిర్మాణాత్మక సంస్కరణలు 2019 తర్వాత కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందడానికి సహకరించగలవని ఐ.ఎం.ఎఫ్. పేర్కొంది.
  • జోహన్సెస్‌బర్‌‌గలోని ‘న్యూ వరల్డ్ హెల్త్ కంపెనీ’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆదాయ అసమానతలలో భారత్ రెండో స్థానం పొందింది. భారత సంపదలో మిలియనీర్ల వాటా 54 శాతంగా ఈ నివేదిక పేర్కొంది. Credit Suisee నివేదిక ప్రకారం భారత సంపదలో ఒక శాతం ధనికుల వాటా 53 శాతం కాగా, 5 శాతం ధనికుల వాటా 68.6 శాతం, మొదటి 10 శాతం ప్రజల వాటా 76.3 శాతం. ది వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి సంబంధించిన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్‌‌ట-2016’ ప్రకారం భారత్‌లోని ఆదాయ అసమానతలు రాబోయే దశాబ్ద కాలంలో ఆరోగ్య, సామాజిక సమస్యల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయ పడింది. అధిక వృద్ధి సాధనతో పాటు ఆదాయ అసమానతల నివారణ భారత్ ముందున్న ముఖ్య సవాలుగా పేర్కొనవచ్చు.
  • భారత్‌లో వివిధ రంగాల్లో అమలుపరచిన సంస్కరణల కారణంగా వృద్ధిరేటు మెరుగైనప్పటికి పేదరికం, నిరుద్యోగ నిర్మూలనపై సంస్కరణ ధనాత్మక ప్రభావాన్ని చూపించలేక పోయాయి. 2014, మేలో పేదరికాన్ని కొలవడానికి ప్రపంచ బ్యాంక్ సవరించిన మెథడాలజీ (సవరించిన పేదరిక గీత 1.9 డాలర్లు) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 872.3 మిలియన్ల ప్రజలు పేదరిక రేఖ దిగువన నివసిస్తున్నారు. వీరిలో 179.6 మిలియన్ల ప్రజలు భారత్‌లో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ అంచనా. భారత్‌లో 58 శాతం ప్రజల తలసరి వినియోగ వ్యయం రోజుకు 3.1 డాలర్ల కన్నా తక్కువ. ప్రపంచంలోని మొత్తం పేదల్లో భారత్ వాటా 20.7 శాతంగా ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది.

మాదిరి ప్రశ్నలు

Published date : 20 Nov 2018 02:31PM

Photo Stories