పర్యావరణ అంశాలు
1. ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) క్యోటో ప్రొటోకాల్
బి) మాంట్రియాల్ ప్రొటోకాల్
సి) స్టాక్ హోం డిక్లరేషన్
డి) బేసల్ కన్వెన్షన్
- View Answer
- సమాధానం: బి
2. దేశంలోనే ‘అతిపెద్ద అరటి పండ్ల’ను ఇచ్చే చెట్టును ఎక్కడ గుర్తించారు?
ఎ) కేరళ
బి) మధ్యప్రదేశ్
సి) అండమాన్ నికోబార్ దీవులు
డి) లక్షదీవులు
- View Answer
- సమాధానం: సి
3. ‘యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1994 మార్చి 21
బి) 1994 మే 24
సి) 1997 ఫిబ్రవరి16
డి) 2001 మే 27
- View Answer
- సమాధానం: ఎ
4. ‘యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూయార్క్
బి) వియన్నా
సి) జెనీవా
డి) నైరోబీ
- View Answer
- సమాధానం: డి
5. ‘ప్రపంచ చిత్తడి నేలల దినం’ను ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ) ఫిబ్రవరి 2
బి) డిసెంబర్ 21
సి) మార్చి 21
డి) నవంబర్ 2
- View Answer
- సమాధానం: ఎ
6. ‘ఐచి లక్ష్యాలు’ దేనికి సంబంధించినవి?
ఎ) గ్రీన్హౌస్ ఉద్గారాల నివారణ
బి) జీవ వైవిధ్య సంరక్షణ
సి) ఓజోను పరిరక్షణ
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
7. ‘రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్’(REDD) కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2005
బి) 2006
సి) 2007
డి) 2008
- View Answer
- సమాధానం: ఎ
8. ‘క్యోటో ప్రొటోకాల్’ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2005 ఫిబ్రవరి 16
బి) 2005 మార్చి 31
సి) 2006 మే 24
డి) 2006 నవంబరు 21
- View Answer
- సమాధానం: ఎ
9. ‘జన్యుమార్పిడి జీవులు, వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి, ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు’ అనే లక్ష్యంతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం పేరేమిటి?
ఎ) కార్టజీన ప్రొటోకాల్
బి) నగోయ ప్రొటోకాల్
సి) బెర్న కన్వెన్షన్
డి) వియన్నా కన్వెన్షన్
- View Answer
- సమాధానం: ఎ
10. భారత్‌లో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1972
బి) 1980
సి) 1986
డి) 1989
- View Answer
- సమాధానం: సి
11.వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసే ‘బిష్ణోయి’ తెగ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) రాజస్థాన్
బి) కేరళ
సి) మణిపూర్
డి) పంజాబ్
- View Answer
- సమాధానం: ఎ
12. ‘డీడీటీ’ దుష్ర్పభావాలను వివరిస్తూ ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథాన్ని రాసినవారు?
ఎ) ఆల్టోలియో పోల్డ్
బి) హెన్రీ డేవిడ్ థోరియో
సి) రాచెల్ కార్సన్
డి) బెంజిమన్ ఫ్రాంక్లిన్
- View Answer
- సమాధానం: సి
13. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
ఎ) రామ్సర్ కన్వెన్షన్
బి) బాన్ కన్వెన్షన్
సి) స్టాక్ హోం కన్వెన్షన్
డి) బెర్న కన్వెన్షన్
- View Answer
- సమాధానం: ఎ
14. భారత్‌లో ‘జీవ వైవిధ్య చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 2006
బి) 2005
సి) 2003
డి) 2002
- View Answer
- సమాధానం: డి
15.సుస్థిర అభివృద్ధిపై ‘బ్రంట్ ల్యాండ్ నివేదిక’ ఎప్పుడు విడుదలైంది?
ఎ) 1986
బి) 1987
సి) 1990
డి) 1995
- View Answer
- సమాధానం: బి
16. ‘యునెటైడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ (UNCSD) ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1991
బి) 1992
సి) 1993
డి) 1994
- View Answer
- సమాధానం: బి
17. మనదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి?
ఎ) 48
బి) 49
సి) 50
డి) 51
- View Answer
- సమాధానం: బి
18. పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక
బి) ఉత్తరాఖండ్
సి) కేరళ
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: ఎ
19. కిందివాటిలో భారత్‌లో కనిపించని జంతువు ఏది?
ఎ) రెండు కొమ్ముల ఖడ్గమృగం
బి) చీతా
సి) చింపాంజీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది?
ఎ) గ్రేట్ హార్నబిల్
బి) మైనా
సి) పిచ్చుక
డి) ఎమిరాల్డ్ డొవ్
- View Answer
- సమాధానం:ఎ
21. ‘రాష్ట్ర సీతాకోక చిలుక’ (State butterfly)ను ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ర్ట
బి) మధ్యప్రదేశ్
సి) ఛత్తీస్‌గఢ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: ఎ
22. కిందివాటిలో ‘జియోగ్రఫికల్ ఇండికేషన్’ దేనికి లభించినది?
ఎ) డార్జిలింగ్ టీ
బి) గోవా ఫెన్నీ
సి) మైసూరు మల్లెలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
23. ‘అజెండా 21’ దేనికి సంబంధించింది?
ఎ) సుస్థిర అభివృద్ధి
బి) విపత్తు నిర్వహణ
సి) భూకంప నివారణ
డి) వాయు కాలుష్య నిర్వహణ
- View Answer
- సమాధానం: ఎ
24. ‘బాన్’(Bonn) కన్వెన్షన్ దేనికి సంబంధించింది?
ఎ) వలస పక్షుల పరిరక్షణ
బి) ఘన వ్యర్థాల నిర్వహణ
సి) చిత్తడి నేలల సంరక్షణ
డి) సముద్ర ఆవరణ వ్యవస్థ నిర్వహణ
- View Answer
- సమాధానం: ఎ
25."Mrs. హ్యూమ్స్ ఫిసాంట్’ అనేది ఏ రెండు రాష్ట్రాల ‘రాష్ట్ర పక్షి’?
ఎ) మిజోరాం, మణిపూర్
బి) కేరళ, అరుణాచల్ ప్రదేశ్
సి) జార్ఖండ్, పుదుచ్ఛేరి
డి) ఛత్తీస్‌గఢ్, మేఘాలయ
- View Answer
- సమాధానం: ఎ
26. ఏ దేశంలో ప్రత్యేకంగా ‘మావోరి’ తెగ కనిపిస్తుంది?
ఎ) ఆస్ట్రేలియా
బి) బ్రెజిల్
సి) న్యూజిలాండ్
డి) చైనా
- View Answer
- సమాధానం: సి
27.కిందివాటిలో భారత్‌కు చెందిన పూర్తి ‘స్థానీయ జాతి’(Endemic species) ఏది?
ఎ) అండమాన్ పంది
బి) అండమాన్ టీల్
సి) కలివి కోడి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
28. కిందివాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది?
ఎ) బైజీ
బి) బోటో
సి) సుసు
డి) భూలన్
- View Answer
- సమాధానం: బి
29. చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారిలో ఎవరికి ‘గాంధీ పీస్ ప్రైజ్’ లభించింది?
ఎ) సమ్షేర్ సింగ్ బిస్త్
బి) గౌరా దేవీ
సి) సుదేశా దేవీ
డి) చండీ ప్రసాద్ భట్
- View Answer
- సమాధానం: డి
30. ‘నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్
బి) ముంబయి
సి) నాగ్‌పూర్
డి) చెన్నై
- View Answer
- సమాధానం: డి
31. ‘సెండాయి ప్రణాళిక’ దేనికి సంబంధించింది?
ఎ) జీవ వైవిధ్య సంరక్షణ
బి) విపత్తు నిర్వహణ
సి) కాలుష్య నివారణ
డి) జల సంరక్షణ
- View Answer
- సమాధానం: బి
32. ‘స్వాదు జలావరణ వ్యవస్థ’ల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ఇథాలజీ
బి) లిమ్నాలజీ
సి) ఆక్సాలజీ
డి) ట్రాఫాలజీ
- View Answer
- సమాధానం: బి
33. కిందివాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది?
ఎ) ఆల్ఫా వైవిధ్యం
బి) బీటా వైవిధ్యం
సి) గామా వైవిధ్యం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
34. సముద్ర అడుగు భాగంలో ఉండే జీవరాశిని ఏమంటారు?
ఎ) బెంథాస్
బి) న్యూస్టాన్స్
సి) నెక్టాన్స్
డి) పెలాజిక్
- View Answer
- సమాధానం: ఎ
35. ‘మపుటాలాండ్- పోండో లాండ్ - అల్బని’ జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఎక్కడ ఉంది?
ఎ) ఆఫ్రికా
బి) దక్షిణ అమెరికా
సి) ఉత్తర అమెరికా
డి) యూరప్
- View Answer
- సమాధానం: ఎ
36. ‘జీవవైవిధ్య హాట్‌స్పాట్’ భావనను తొలిసారిగా ప్రతిపాదించినవారు?
ఎ) నార్మన్ మెయర్స్
బి) రేమండ్ డాసిమన్
సి) మెక్ మ్యానస్
డి) నార్స్
- View Answer
- సమాధానం: ఎ
37. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఏది?
ఎ) హిమాలయాలు
బి) ఈస్టర్న్ ఆఫ్రొ మౌంటేన్
సి) ఇండోబర్మా
డి) సుందా ల్యాండ్
- View Answer
- సమాధానం:ఎ
38.‘హాట్‌స్పాట్స్ రీవిజిటెడ్’ (Hotspots Revisited) గ్రంథ రచయిత?
ఎ) నార్మన్ మెయర్స్
బి) రస్సెల్ మిట్టర్ మియర్
సి) రేమండ్ డాసిమన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
39. వేటిని ‘డెట్రిటివోర్స్’గా వ్యవహరిస్తారు?
ఎ) మొక్కలు
బి) జంతువులు
సి) శిలీంధ్రాలు
డి) అన్నీ
- View Answer
- సమాధానం: సి
40. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైన పద్ధతి ఏది?
ఎ) లాండ్ ఫిల్లింగ్
బి) కంపోస్టింగ్
సి) రీసైక్లింగ్
డి) ఇన్సినరేషన్ (అతి ఉష్ణ భస్మీకరణం)
- View Answer
- సమాధానం: సి
41. 2015 గణాంకాల ప్రకారం భారత్‌లో సింహాల సంఖ్య ఎంత?
ఎ) 411
బి) 523
సి) 732
డి) 912
- View Answer
- సమాధానం: బి
42. ‘శీతోష్ణస్థితి మార్పు’ అనే అంశంపై నిర్వహించిన ‘కాప్ 21’ సమావేశం 2015 డిసెంబర్లో ఎక్కడ జరిగింది?
ఎ) లీమా
బి) వార్సా
సి) పారిస్
డి) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: సి
43. 2005 నాటి ఉద్గారాల్లో 2030 నాటికి ఎంత శాతం మేరకు భారత్ తన గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది?
ఎ) 23 25%
బి) 33 35%
సి) 21 22%
డి) 45 46%
- View Answer
- సమాధానం: బి
44.జమ్ము కశ్మీర్ రాష్ట్ర జంతువు ఏది?
ఎ) బారా సింఘ
బి) నల్ల జింక
సి) హంగుల్ జింక
డి) అడవి దున్న
- View Answer
- సమాధానం: సి
45. ‘సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మహారాష్ర్ట
బి) ఒడిశా
సి) త్రిపుర
డి) నాగాలాండ్
- View Answer
- సమాధానం: బి
46. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వులను ఏర్పాటు చేశారు?
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
- View Answer
- సమాధానం: ఎ
47. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
ఎ) ఎకోఫిన్
బి) ఎకోటోన్
సి) ఎకోటైప్
డి) సిన్ టైప్
- View Answer
- సమాధానం: బి
48.‘ఫ్లోటింగ్ పార్కు’గా పిలిచే ‘కేబుల్ లామ్జావో’ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) మణిపూర్
బి) సిక్కిం
సి) మేఘాలయ
డి) నాగాలాండ్
- View Answer
- సమాధానం: ఎ
49. భారత్‌లోని ఎన్ని బయోస్ఫియర్ రిజర్వులను యునెస్కో (UNESCO) తన ‘వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్’లో గుర్తించింది?
ఎ) 6
బి) 7
సి) 8
డి) 10
- View Answer
- సమాధానం: డి
50. ‘తిరుమల కొండ’లకు మాత్రమే పరిమితమైన స్థానీయ జాతి ఏది?
ఎ) లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి
బి) సైకస్ బెడ్డోమీ అనే చెట్టు
సి) జింకో బైలోబా అనే చెట్టు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
51. అధిక జీవ వైవిధ్యానికి నిలయమైన వూలార్ సరస్సు ఎక్కడ ఉంది?
ఎ) పంజాబ్
బి) జమ్ము కశ్మీర్
సి) మహారాష్ట్ర
డి) హర్యానా
- View Answer
- సమాధానం: బి
52. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన బయోస్ఫియర్ రిజర్వ్ ఏది?
ఎ) పన్నా
బి) నోక్రిక్
సి) అచనా కమర్ - అమర్ కంటక్
డి) రేహంగ్ - దిచాంగ్
- View Answer
- సమాధానం: సి
53. కిందివాటిలో సజీవ శిలాజం ఏది?
ఎ) జింకో బైలాబ
బి) టౌటారా బల్లి
సి) రాచ పీత
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
54. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ‘ఎర్ర జాబితా’ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది?
ఎ) UNESCO
బి) IUCN
సి) WWF-N
డి) UNEP
- View Answer
- సమాధానం: బి
55. ‘టంబెస్ చోకో మ్యాగ్డెలినా’ అనే జీవ వైవిధ్య సునిశిత ప్రాంతం ఎక్కడ ఉంది?
ఎ) దక్షిణ అమెరికా
బి) ఉత్తర అమెరికా
సి) ఆఫ్రికా
డి) యూరప్
- View Answer
- సమాధానం: ఎ
56. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోస్ఫియర్ రిజర్వుల సంఖ్య ఎంత?
ఎ) 21
బి) 18
సి) 15
డి) 12
- View Answer
- సమాధానం: బి
57. కిందివాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది ఏది?
ఎ) జాతీయ పార్కు
బి) అభయారణ్యం
సి) బయోస్ఫియర్
డి) కన్జర్వేషన్ రిజర్వు
- View Answer
- సమాధానం: డి