శాతవాహనుల ముందు యుగం (Pre- Satavahana Period)(1000B.C-200B.C)
i) భరతుని నాట్యశాస్త్రం
ii) మత్స్య పురాణం
iii) జాతక కథలు
iv) ఇతిహాసాలు
v) ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ
1)i, ii, iii, iv
2) v
3) iii, v
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
2. నిశ్చిత వాక్యం (A): మహాభారతంలోని ‘‘సభాపర్వం’’ దక్షిణాపథ దేశాల గురించి తెలుపుతుంది.
హేతువు (R): ధర్మరాజుని రాజసూయ యాగ సందర్భంలో సహదేవుడు పాండ్యరాజ్యాన్ని జయించి దక్షిణాపథంపై పురోగమించాడు.
1) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ
2) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ కాదు
3) A సరైనది. R సరికానిది
4) A సరికానిది. R సరైనది
- View Answer
- సమాధానం: 1
3. దక్షిణాపథానికి సంబంధించినది ?
i) వింధ్య పర్వతాలకు, కన్యాకుమారికి మధ్యనున్నదే దక్షిణాపథమని బౌద్ధ జాతక కథలు తెలిపాయి
ii) ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ దక్షిణాపథాన్ని, తమిళులను వేర్వేరుగా తెలిపింది
iii) భరతుని నాట్యశాస్త్రం దక్షిణాపథ, ద్రావిడ, ఆంధ్ర ప్రాంతాలను వేర్వేరుగా తెలిపింది
1) i, iii
2) ii
3) i, ii, iii
4) ii, iii
- View Answer
- సమాధానం: 3
4. దక్షిణాపథం గురించి తెలిపే శాసనాలేవి ?
i) కళ్యాణి చాళుక్య శాసనాలు
ii) రుద్రదాముని జునాఘడ్ శాసనం
iii) సముద్రగుప్తుని అలహాబాద్ శాసనం
1) i, iii
2) ii, iii
3) i, ii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
5. దక్షిణాపథాన్ని కింది విధంగా నిర్వచించవచ్చు ?
1) మహానది, గోదావరి నదుల మధ్య ప్రాంతం
2) గోదావరి, కావేరి నదుల మధ్య ప్రాంతం
3) దిగువ గంగ, వింధ్య పర్వతాల మధ్య ప్రాంతం
4) నర్మద, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం
- View Answer
- సమాధానం: 4
6.వాత్సాయన కామసూత్రాల (క్రీ.శ. 3వ శతాబ్ధం)లో దక్షిణాపథం గురించి తెల్పినవాటిలో లేనిది?
i) నర్మదా నదికి దక్షిణాన ఉంది
ii) కర్నాటక విషయానికి తూర్పు, ముందుండేది ఆంధ్ర విషయం
iii) నర్మదా నది, కర్నాటక విషయాల మధ్య మహారాష్ట్ర విషయం ఉంది
iv) కర్నాటక విషయానికి దక్షిణాన ద్రవిడ విషయం ఉంది
1) ii
2) iii, iv
3) i, ii, iv
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
ii) ఇతిహాస, పురాణాలు ఆంధ్రులు నివాసం తెలపలేదు.
iii) అశోకునిని శాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో ఉన్నారని తెల్పింది.
iv) గ్రీకు రచనలు ఆంధ్రులు బలవంతులుగా తెలిపాయి
ఈ వ్యాఖ్యనాల ఆధారంగా ‘‘ఆంధ్రుల నివాసం’’ కనుగొనండి?
1) ఆంధ్రుల నివాసం ఆంధ్రప్రదేశ్
2) ఆంధ్రులు శాతవాహనులు
3) ఆంధ్రుల నివాసం కర్నాటక -ఆంధ్ర సరిహద్దు ప్రదేశం
4) ఆంధ్రుల నివాసం కనుగొనలేము
- View Answer
- సమాధానం: 4
8. ధర్మరాజుని రాజసూయ యాగ సందర్భంలో సహదేవుడు దక్షిణాపథంలో జయించని రాజ్యాలేవి ?
i) పాండ్య ii) ద్రవిడ iii) ఓఢ్ర iv) కేరళ v) ఆంధ్ర vi) కళింగ
vii) కామరూప viii) శాతవాహన
1) v, vi
2) vii,viii
3) i,ii,iii
4) i
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సరైనది ?
1) వరాహమిహిరుడు (క్రీ.శ. ఆరో శతాబ్ధం) ‘బృహత్సంహిత’ లో ఆంధ్రదేశాన్ని పేర్కొన్నాడు
2) హుయాన్‌త్సాంగ్ (క్రీ.శ. ఏడో శతాబ్ధం) ఆంధ్రదేశం నేటి కృష్ణ, గోదావరి జిల్లాలతో సమంగా గుర్తించదగిన దేశమని అన్నాడు
3) గ్రీకు రాయబారి మెగస్తనీస్ (క్రీ.పూ. మూడో శతాబ్ధం)ఆంధ్రులు గోదావరీ పరీవాహక నివాసులని అన్నాడు
4) 1,2
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో ఆంధ్రుల నివాసం గురించి మొదటిగా తెలిపినది ?
i) పురాణాలు ii) బౌద్ధ జాతక కథలు iii) గాథాసప్తసతి iv)మైదవోలు శాసనం
1) i, ii
2) ii, iv
3) i, ii, iii
4) ii, iii, iv
- View Answer
- సమాధానం: 2
11. జతపరచండి.
i) భీమసేన జాతకం
ii) సెరివణిజ జాతకం
iii) మైదవోలు తామ్ర శాసనం
a) ధన కటకం ఆంధ్రపథానికి రాజధాని
b) ఆంధ్రనగరి
c) ఆంధ్రపథం
1) i-a, ii-b, iii-c
2) i-b, ii-a, iii-c
3) i-c, ii-b, iii-a
4) i-c, ii-a, iii-b
- View Answer
- సమాధానం: 3
12. ‘అంధకపురం’ ను ఆంధ్రులు తేల్ నదీ తీరాన నిర్మించినట్టు తెలిపేది ?
1) సెరివనిజ జాతక కథలు
2) భీమసేన జాతక కథలు
3) వెస్సంతర జాతక కథలు
4) శ్వేతగజ జాతక కథలు
- View Answer
- సమాధానం: 1
13.‘‘సుత్తనిపాతం పైని వ్యాఖ్యాన గ్రంథంలో అస్సక, ములకలను ఆంధ్ర జనపదాలుగా పేర్కొన్నారు’’ ఈ వ్యాఖ్యానానికి సంబంధించి కిందివాటిలో సరైనది ?
i) ‘అస్సక’ జనపదం నేటి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని పౌదాన్యపురం (బోధన్)
ii) ఎరియన్ పేర్కొన్న 30 రాజ్యాలలో అస్సక కూడా ఉంది
iii) ‘ములక’ జనపదం నేటి మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రతిష్టానపురం (పైఠాన్)
1)i, iii
2) i,ii
3) i, ii, iii
4) ii,iii
- View Answer
- సమాధానం: 3
14. బౌద్ధ యుగంలో ఆంధ్రదేశానికి ఉన్న పేర్లు ?
i) మంజీరదేశం ii) వజ్రదేశం iii) నాగభూమి iv) యక్షభూమి
1)iv
2) i, iii
3) ii, iii, iv
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
i) స్కాందపురాణం ii) టాలమి iii)విన్నకోట పెద్దన iv) వాయు పురాణం v) మార్కండేయ పురాణం
1) i, iv, v
2) ii, iii
3) i, iii, iv, v
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
16.కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో విద్యానాధుడు సంస్కృత భాషలో రచించిన ‘‘ప్రతాప రుద్ర యశోభూషణం’’ తెలుగు దేశాన్ని త్రిలింగ మధ్య దేశంగా తెల్పింది. ఈ గ్రంథం ప్రకారం త్రిలింగ స్థలాలేవి?
i) అమరావతి ii) శ్రీశైలం
iii) ద్రాక్షారామం iv) కాళేశ్వరం
1) i, ii, iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,iii,iv
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో సరికానిది ?
i) స్కాంద పురాణం ప్రకారం శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగ ఉన్న దేశం త్రిలింగదేశం.
ii) క్రీ.శ. 6,7 శతాబ్ధాలలో కళింగ గంగులు, తూర్పు చాళుక్యులు ‘‘త్రికలింగాధీశ్వర’’ బిరుదు ధరించారు.
iii) రాజశేఖరుడు (క్రీ.శ. 10 శతాబ్ధం) ‘‘త్రిలింగాధిపతి’’ అనే పదాన్ని ప్రయోగించాడు.
iv) కాకతీయులు ‘‘త్రిలింగ దేశ పరమేశ్వర’’ బిరుదు ధరించారు.
1) i, iv
2) ii, iii
3) i, ii, iii, iv
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
18. యాదవరాజుల మంత్రి హేమాద్రి ‘‘వ్రతఖండం’’లో త్రిలింగ శబ్ధానికి సంబంధించిన పదాలు?
i) త్రిపృధ్వీశ్వర ii) తిల్లింకాధిపతి
iii) తైలింగక్షితపాల iv) తిల్లింగాధ్యక్ష
1) i, iv
2) ii, iii
3) i, iii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 2
19. క్రీ.శ.130 ప్రాంతానికి చెందిన ఏ విదేశీయుల/విదేశీయుని రచనల్లో ట్రిలింగాన్, ట్రిలిప్తాన్ అనే పదాలు కనిపిస్తుయి?
i) మెగస్తనీస్ ii) అరిమెన్
iii) ప్లీనీ iv) టాలమి
1) i, ii
2) ii
3) ii, iv
4) iv
- View Answer
- సమాధానం: 4
20. ఆంధ్రజాతి అనే పేరు ఉపయోగించినది?
i) ఐతరేయ బ్రాహ్మణం
ii) భగవత పురాణం
iii) మత్స్య పురాణం
iv) మహాభారతం
v) చరకసంహిత
vi) మనుధర్మ శాస్త్రం
vii) వాయు, బ్రహ్మాండ పురాణాలు
1) i, iv, vi, vii
2) i, ii, iii, iv, v
3) v, vi, vii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ఐతరేయ బ్రాహ్మణంలోని సునశ్శేపుని కథ ప్రకారం, విశ్వామిత్రుడు తన కుమారులను శపించిన ప్రకారం ఆర్య భూముల నుంచి బహిష్కరించబడిన వారిలో లేనివారు ?
i) ఆంధ్ర, పుండ్ర ii) పుశింద, శబర
iii) మూతిబ iv) చెంచు
1) i, iv
2) iv
3) iii
4) ii, iii
- View Answer
- సమాధానం: 2
22. ఆంధ్రులనగా ?
1) విధేయత కలిగిన ఆర్యులు
2) అవిధేయత వల్లన పతితులైన ఆర్యులు
3) అవిధేయత కలిగిన అనార్యులు
4) విధేయత కలిగిన అనార్యులు
- View Answer
- సమాధానం: 2
23.‘‘ఆంధ్రుడు కలలోకి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని’’ అన్నవారు?
1) కౌటిల్యుడు
2) పతంజలి
3) చరకుడు
4) విశ్వామిత్రుడు
- View Answer
- సమాధానం: 3
24. జతపరచండి.
i) మత్య్స పురాణం
ii) మనుధర్మ శాస్త్రం
iii) మహా భారతం
a) ఆంధ్రులు బహిస్కార ప్రదేశాల్లో నివసించడానికి యోగ్యులు
b) ఆంధ్రులు మ్లేచ్ఛులు
c) ఆంధ్రులను చేర, చోళ, పాండ్యులతో కలిపి చెప్పబడింది.
1) i-a, ii-b, iii-c
2) i-a, ii-c, iii-b
3) i-b, ii-a, iii-c
4) i-b, ii-c, iii-a
- View Answer
- సమాధానం: 3
25. i) వాయుపురాణంలో తుషార జాతితో కలిసి హిందూకుష్ పర్వతాల బయట అక్షునదీ తీరంలో ఆంధ్రుల నివాస సూచనలున్నాయి.
ii) మధ్యాసియాలోని ఆక్సస్ నదే పురాణాల్లోని అక్షునది.
ఈ వ్యాఖ్యానాల ఆధారంగా ఆంధ్రులెవరు ?
1) ఆర్యుల వలె ఆంధ్రులు స్వదేశీయులు
2) అనార్యులు, తెలుగువారు
3) ఆర్యుల వలె మధ్యాసియా ప్రాంతవాసులు
4) చెప్పలేము
- View Answer
- సమాధానం: 3
26. కురు, పాండవ యుద్ధంలో ‘‘ఆంధ్రులు, కాళింగులు’’ ఎవరి పక్షాన పోరాడారు ?
1) ఆంధ్రులు-పాండవులు: కాళింగులు- కౌరవులు
2) ఆంధ్రులు- కౌరవులు: కాళింగులు- పాండవులు
3) ఆంధ్రులు- పాండవులు: కాళింగులు- పాండవులు
4) ఆంధ్రులు- కౌరవులు: కాళింగులు- కౌరవులు
- View Answer
- సమాధానం: 4
27. కింది వాటిలో సరైనది ?
i) మహాభారత యుద్ధకాలం నాటికి ఆంధ్రులనే ఒక తెగ యమునా నదీ తీరానికి చేరుకుంది.
ii) కౌరవ సామ్రాజ్యం విచ్ఛిన్నానంతరం గంగా- యమునా తీరంలో కాటకం ఏర్పడి ఆ ప్రాంత ప్రజలు దక్షిణంగా కదలిపోయారని ‘‘ఛాందోగ్యోపనిషత్తు’’ తెలుపుతోంది.
iii) ఛాందోగ్యోపనిషత్తు, ఐతరేయ బ్రాహ్మణాల కాలం క్రీ.పూ. 1000
1) i, iii
2) iii
3) i, ii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
28. విశ్వామిత్రుని శాప ఫలితంగా తన యాబైమంది సంతానం ఆర్యవర్త సరిహద్దుల్లో ఉన్నారని, వారిని ఆంధ్రాది దస్య జాతులుగా చెప్పినవి?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) సాంఖ్యయాన శ్రౌత సూత్రం
3) కౌశతకి బ్రాహ్మణం
4) 1,2
- View Answer
- సమాధానం: 4
29. ఆంధ్ర ప్రజల్లో ఏఏ ఆర్యేతర జాతుల లక్షణాలున్నవి ?
i) మధ్యధరా ii) ఆస్ట్రలాయిడ్
iii) మంగోలాయిడ్ iv) నీగ్రో
1) i, ii, iv
2) ii, iii, iv
3) i, ii, iii
4) i, iv
- View Answer
- సమాధానం: 3
30.ఆంధ్రదేశంలోని ‘‘రాక్షసగుళ్ళ’’లో లభించిన అస్థి పంజరాలలో ఏ జాతి లక్షణాలు కనిపిస్తాయి ?
i) నీగ్రో ii) ఆస్ట్రలాయిడ్ iii) మధ్యధరా జీఠి) మంగోలాయిడ్
1) i, ii, iv
2) iii
3) i, iii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
31.మధ్యధరా జాతులవారు ఆసియా మైనర్ నుంచి గంగా మైదానం వరకు విస్తరించి ఉండేవారని, వారిని ‘‘దాహదహ్యులు’’, ‘‘దాసదస్యులు’’గా ఏఏ గ్రంథాలలో ప్రస్తావించారు ?
1) ఋగ్వేదం- అధర్వణవేదం
2) అవెస్థా- ఋగ్వేదం
3) అవెస్థా- యజుర్వేదం
4) ఋగ్వేదం- అంగుత్తర నికాయ
- View Answer
- సమాధానం: 2
32. దక్షిణాపథంలో ఆంధ్రులకు ఏఏ తెగలతో సంబంధం ఉంది ?
i) నాగులు ii) యక్షులు
iii) అశ్మకులు iv) మహిషకులు
v) తెలుగులు
1) i, iii, v
2) ii, iii, iv
3) i, ii, iv, v
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
33. అపస్తంభ ఋషికి సంబంధించినది?
i) క్రీ.పూ. 700 నాటికి కొన్ని ఆంధ్ర గణాలు యమునా నదీ తీరంలో సాళ్వీ దేశంలో ఉండేవి.
ii) ఈ గణాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్యులు ఉండేవారు. వారిలో ఒక్కరు ఆపస్తంభుడు.
iii) ఇతడు సాళ్వీ దేశంలో ఉండగా ‘‘గృహ్య సూత్రాలు’’ రచించాడు.
1) i, iii
2) i, ii
3) ii, iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
34. బౌద్ధ వాఙ్మయంలోను, సింహళ, సయాం దేశాల ప్రాచీన సాహిత్యంలోను నాగభూమిగా వర్ణించిన ప్రాంతం ఏది?
1) కృష్ణా- గోదావరి ప్రాంతం
2) కృష్ణా ముఖ ద్వారం
3) కావేరి ముఖ ద్వారం
4) గోదావరి ముఖ ద్వారం
- View Answer
- సమాధానం: 2
35. ‘‘ఖాండవ దహనం’’, ‘‘జనమేజయ సర్పయాగ’’ మనే రెండు ముఖ్యఘట్టాలు ఎవరి సంఘర్షణలో జరిగాయి?
1) నాగులు- ఆర్యులు
2) యక్షులు- నాగులు
3) అశ్మకులు- ఆర్యులు
4) మహిషకులు- యక్షులు
- View Answer
- సమాధానం: 1
36. బౌద్ధ వాఙ్మయంలో పెద్దకట్టడాలు నిర్మించడంలో సిద్ధహస్తులుగా ఎవరిని వర్ణించారు?
i) అశ్మకులు ii) నాగులు
iii) యక్షులు iv) మహిషకులు
1) i, ii
2) ii, iii, iv
3) ii, iii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
37. మహాభారతం ‘‘ఆంధ్రాశ్చబహవః’’ అని : వాసిష్ఠీపుత్ర పులోమావికి ‘‘నవనరస్వామి’’ అనే బిరుదుల వల్ల తెలిసేది ?
i) భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్రజాతి ఏర్పడింది.
ii) సాహసోపేతులు, యుద్ధ ప్రియులైన ఆంధ్రులు రాజకీయాధిపత్యం సాధించడంతో, వారి ఆధిపత్యంలోకి వచ్చిన తెగలన్నీ స్వీయ వ్యక్తిత్తం కోల్పోయి ఆంధ్రులుగా మారారు.
1) i
2) ii
3) i, ii
4) i, ii సరైనవి కావు
- View Answer
- సమాధానం: 3
38. ఆంధ్ర, తెలుగు అనేవి ఆంధ్ర జాతిలో కలిసిపోయిన ?
1) ఒక తెగ
2) రెండు తెగలు
3) రెండు కులాలు
4) రెండు గోత్రాలు
- View Answer
- సమాధానం: 2
39. ‘‘తె నుగు’’ రూపాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించినది ?
1) తిక్కన
2) ఎర్రన
3) నన్నయ
4) పోతన
- View Answer
- సమాధానం: 3
40. తెలుగు తెగ ఆంధ్ర తెగలో సమైఖ్యమైనా కూడా తమ భాషా వ్యక్తిత్వం ఎందుకు కోల్పోలేదు?
1) ఆంధ్రుల భాషా సంస్కృతుల కంటే తెలుగు వారి పరిణతి తక్కువ
2) ఆంధ్రులకి ఔదార్యమెక్కువ
3) తెలుగువారి భాషా సంస్కృతి పరిణతి ఆంధ్రుల కంటే ఎక్కువ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
41. ఆంధ్ర, ద్రావిడ భాషలను మ్లేచ్ఛ భాషలుగా పేర్కొన్న ఆంధ్రుడు ?
i) ఆపస్తంభుడు ii) అగస్త్యుడు iii) కుమారిలభట్టు iv) బోధాయనుడు
1) i, iii
2) ii, iv
3) i
4) iii
- View Answer
- సమాధానం: 4
42. క్రీ.పూ.300- క్రీ.శ.300ల మధ్యకాలంలో, క్రీ.శ.300- క్రీ.శ.600ల మధ్యకాలంలోని ఏఏ రాజ భాషల పదాలు ఆంధ్రభాషలో చేరాయి?
1) బ్రాహ్మీ- సంస్కృతం
2) పాళీ- ప్రాకృతం
3) అర్థమగధి- పాళీ
4) ప్రాకృతం- సంస్కృతం
- View Answer
- సమాధానం: 4
43. అమరావతి శాసనం (క్రీ.శ.3 శతాబ్ధం)లోని ఏ పదం సంస్కృత పదాల ఆంధ్రీకరణను సూచిస్తుంది?
1) నాగన్న
2) నాగబు
3) గోబద
4) సమగోప
- View Answer
- సమాధానం: 2
44. బౌద్ధమత ప్రచారంలో భాగంగా ఆర్యేతర జాతుల భాషలే వాడాలని బుద్ధుడు తెలిపినట్టు చెబుతున్న క్రీ.శ. 5 శతాబ్ధం గ్రంధకర్త ?
1) అశ్వఘోషుడు
2) బుద్ధఘోషుడు
3) నాగార్జునుడు
4) మొగలిపుత్తతిస్స
- View Answer
- సమాధానం: 2
45. భరతుడు నాటక భాషా లక్షణాలు తెలుపుతూ ఏఏ ప్రాంతాల వారికి వారి భాషలుగాక శౌరసేని ప్రాకృతం ప్రయోగించాలని శాసించాడు ?
i) ఆంధ్ర ii) కిరాత
iii) ద్రావిడ iv) కర్నాటక
1) i, iii, iv
2) ii, iii, iv
3) i, ii, iii
4) i, iv
- View Answer
- సమాధానం: 3
46. ‘‘ సంస్కృత, ప్రాకృత భాషలకు భిన్నమైన, స్వతంత్రమైన భాష తెలుగువారికుంది’’ ఈ వ్యాఖ్యకు సంబంధించినది?
i) గుణాఢ్యుడు పైశాచీ భాషలో బృహత్కథను రచించాడు. ఇది నేటి తెలుగు భాషకు తల్లి.
ii) హాలుని గాథాసప్తసతిలో తెలుగు పదాలున్నాయి.
iii) శాతవాహనులు ప్రాకృత, దేశీ భాషల్లో నాణాలు ముద్రించారు.
iv) క్రీ.శ.6 శతాబ్ధినాటికి తెలుగు చోడులు, చాళుక్యులు శాసనాల్లో తెలుగు వాడసాగారు.
1) i, ii
2) ii, iii, iv
3) i, ii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
47. కింది వాటిలో ఆంధ్రభాషకు సంబంధించినది?
i) నన్నయ భారతంలో ఆంధ్ర శబ్ధాన్ని భాషాపరంగా ప్రయోగించలేదు.
ii) నందంపూడి శాసనంలో నారాయణభట్టు బహుభాషావేత్తని చెప్పే సందర్భంలో ఆంధ్రభాషనే నన్నయ చేర్చాడు.
1) i
2) ii
3) i, ii
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
48.శివకవి పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో ఆంధ్రదేశాన్ని ‘‘నవలక్ష తెలుంగు’’ అని అభివర్ణించాడు. ఇదే విషయాన్ని ‘‘నౌలక్ తిలింగ్’’గా ఏ మహ్మదీయ చరిత్రకారుడు పేర్కొన్నాడు?
1) బరనీ
2) ఈసామీ
3) అమీర్ఖుస్రు
4) కాఫీఖాన్
- View Answer
- సమాధానం: 2
49. ఆంధ్ర శబ్ధాన్ని భాషాపరంగా, దేశ పరంగా, జాతిపరంగా వాడుతూనే తెనుగు, తెలుగు, పదాలను ఉపయోగించిన కవిత్రయంలోని కవి ?
1) నన్నయ
2) తిక్కన
3) ఎఱ్ఱన
4) ఎవరూకాదు
- View Answer
- సమాధానం: 2
50. నిశ్చిత వాక్యం (A): దక్షిణాపథంలో ఉత్తరాది ప్రజల విస్తరణకు విదర్భ కేంద్రంగా ఉపయోగపడింది.
హేతువు (R): ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ.800) విదర్భ రాజ్యాధినేత భీముడని చెబుతుంది.
1) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ
2) A సరైనది. R సరికానిది
3) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ కాదు
4) A సరికానిది. R సరైనది
- View Answer
- సమాధానం: 3
51.అగస్త్యమునికి సంబంధించింది?
i) ఉత్తరాది వాస్కోడిగామాగా పిలవచ్చు
ii) వింధ్య పర్వతాల గర్వమణచిన వాడు
iii) మహాభారతంలో ఇతని కథ ఉంది
iv) దక్షిణాపథానికి వింధ్య పర్వతాల గుండా వచ్చాడు
v) ‘అగత్తియం’ అనే తమిళ వ్యాకరణ కర్త
1) ii, iv
2) i, iii, v
3) i, ii, iv, v
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
52. తమళదేశంలో, హిందూ మహాసముద్ర దీవుల్లోని ఆలయాలు ఎవరికి సంబంధించినవి ?
1) భరద్వాజుడు
2) వశిష్ఠుడు
3) విశ్వామిత్రుడు
4) అగస్త్యుడు
- View Answer
- సమాధానం: 4
53. నిశ్చితవాక్యం (A): దక్షిణాపథంలో ఆర్యవిస్తరణను తెలిపే ఇతిహాసమే రామాయణం.
హేతువు (R) : ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన ఆర్య మహర్షులను అనార్య జాతుల నుంచి రక్షించడానికి కోసలాధీసుడైన రాముడు దక్షిణ దేశానికి వచ్చాడు.
1) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ
2) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ కాదు
3) A సరైనది. R సరికానిది
4) A సరికానిది. R సరైనది
- View Answer
- సమాధానం: 1
54. దక్షిణాపథం గురించి ఎక్కువగా తెలుపుతున్న రామాయణంలో పేర్కొన్న దక్షిణ రాజ్యాలేవి?
i) విదర్భ ii) దశార్ణ
iii) దండకారణ్య iv) కలింగ
v) ఉత్కళ
1) i, iv, v
2) ii, iii
3) i, iii, v
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
55. రామాయణంలో పేర్కొన్న దక్షిణాది ప్రజలు ?
1) రిచిక, మహిషక
2) ఆంధ్ర, పాండ్య
3) చోళ, కేరళ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
56. కింది వాటిలో సరికానిది?
1) రామాయణంలో పంచవటి, ఋష్యమూక, పంపాసరోవరాల ప్రస్తావన ఉంది.
2) రామాయణంలో కణ్వ, భరద్వాజ ఆశ్రమాల ప్రస్తావన ఉంది
3) ఆస్ట్రోలాయిడ్ (అనార్య) జాతులైన వానర, శబరుల ప్రసక్తి రామాయణంలో ఉంది.
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
57. వ్యాకరణుడు పాణిని కాలం (క్రీ.పూ.800) నాటికి ఆర్యులకు దక్షిణాపథంతో పరిచయమున్న రాజ్యాలేవి ?
i) తూర్పు- కళింగ
ii) పడమట- నర్మదానదికి దక్షిణంగా అశ్మక రాజ్యం
iii) దక్షిణం- వెలనాటి రాజ్యం
iv) ఉత్తరం- ఉజ్జయిని
1) i, iv
2) i, ii, iii
3) i, ii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 3
జైన, బౌద్ధ యుగం :
58. నిశ్చిత వాక్యం (A): జైన, బౌద్ధ మతాలు ఉత్తర, దక్షిణాపథాల మధ్య రాకపోకలు ఎక్కువ కావడానికి, సంస్కృతీ సమైఖ్యానికి కృషి చేశాయి.
హేతువు (R): ఇవి ప్రచారమతాలు, జాతి, కుల వివక్షతలను ఖండించాయి.
1) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ
2) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ కాదు
3) A సరైనది. R సరికానిది
4) A సరికానిది. R సరైనది
- View Answer
- సమాధానం: 1
59. ‘అంగుత్తర నికాయ’ అనే బౌద్ధ గ్రంధం ప్రకారం క్రీ.పూ.6వ శతాబ్ధంలో వెలసిన 16 మహాజనపదాల్లో, దక్షిణ భారతదేశంలో వెలసిన ఏకైక జనపదం?
1) ములక
2) విదర్భ
3) అమరావతి
4) అశ్మక లేదా అస్సక
- View Answer
- సమాధానం: 4
60. ‘బావరి’ అనే బ్రాహ్మణునికి సంబంధించి సరైనది.
i) సుత్తనిపాత అనే బౌద్ధ గ్రంధంలో ఇతని ప్రస్తావన ఉంది
ii) కోసల రాజగురువు
iii) అస్సక, ములక రాజ్యాల సరిహద్దుల్లో గోదావరి నది ఒడ్డున ఆశ్రమం నిర్మించి విద్యాబోధన చేశాడు.
iv) బుద్ధునికి సమకాలికుడు, బౌద్ధాన్ని స్వీకరించాడు.
1) i, iii
2) i, iv
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
61. క్రీ.పూ. 6వ శతాబ్ధిలో ప్రజాధరణ పొందిన మార్గం గుండా బావరి శిష్యులు బుద్ధున్ని కలవడానికి శావస్థికి వెళ్లారు. ఆ మార్గాన్ని ఆరోహణ క్రమంలో అమర్చండి ?
i) మహిష్మతి ii)ఉజ్జయిని
iii) ములక iv) చంప
1) iv, iii, ii
2) i, ii, iii, iv
3) iii, i, ii
4) iii, ii, i
- View Answer
- సమాధానం: 3
62. సుత్తనిపాతంలో అంధకరార్ఠలుగా పేర్కొన్న రాజ్యాలు ?
1) అళక (అశ్మక)- ములక
2) ములక- పంపసాగరం
3) అశ్మక- నాగ
4) నాగ- యక్షు
- View Answer
- సమాధానం: 1
63. కింద పేర్కొన్న ఏ మహాజనపద రాజుకి మహాకాత్యాయనుడు బౌద్ధమతం ఇచ్చినట్టు ‘‘విమానవత్తు’’ భాష్యం తెలుపుతోంది ?
1) ములక
2) అవంతి
3) విదర్భ
4) అస్సక
- View Answer
- సమాధానం: 4
64. బౌద్ధ జాతక కథల్లో ఈ ప్రస్తావనలున్నాయి ?
i) అస్సక రాజ్యం ii) ములక రాజ్యం
iii) కళింగ రాజ్యం
iv) అస్సక రాజులైన అరుణ, బ్రహ్మదత్తులు
1) i, iv
2) ii, iii
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
65.బుద్ధుని కాలంలోనే బౌద్ధం ఆంధ్రలో ప్రవేశించిందనడానికి బౌద్ధ గ్రంథాల్లోని ఎవరి వృత్తాంతాలవల్ల తెలుస్తుంది ?
1) బావరి
2) అశ్వఘోషుడు
3) మహాకాత్యాయనుడు
4) 1,3
- View Answer
- సమాధానం: 4
66. i) బౌద్ధ యుగానికి ముందు ఆంధ్రదేశంలో 118 తెగలున్నాయని ఎరియన్ రాశాడు.
ii) బౌద్ధమతం తెగల భేదాలను అంతం చేసి ఆంధ్రజాతిని నిర్మించింది.
iii) బౌద్ధయుగంలో దక్షిణదేశంలో, ఆంధ్రదేశంలో ఉన్న జాతులన్నీ అనార్య తెగలే.
iv) అనార్య తెగలు అర్యులకు విరోధులు.
v) వీరందరూ బౌద్ధాన్ని ఆదరించారు.
ఈ వ్యాఖ్యానాల ఆధారంగా కింది వాటిలో సరైనది?
1) ఆంధ్రులు ఆర్యులకు విరోధులు
2) ఆంధ్రదేశం అనేక మతాలకు పుట్టినిల్లు
3) ఆంధ్రదేశం బౌద్ధమతానికి పట్టుకొమ్మ
4) ఆంధ్రులకు మతసహనం ఎక్కువ
- View Answer
- సమాధానం: 3
67. ఆంధ్రదేశంలో బౌద్ధమతాన్ని గాఢంగా అభిమానించిన జాతులేవి ?
i) శబర ii) నాగులు iii) యక్షులు iv) బోయలు
1) i, ii
2) ii, iii
3) i, ii, iii
4) i, iii, iv
- View Answer
- సమాధానం: 2
68. బౌద్ధయుగంలో ఆంధ్రదేశంలో నివసిస్తున్న జాతులేవి?
i) నాగులు- కళింగులు
ii) యక్షులు- సేబకులు
iii) పుళిందులు- మహిషకులు
iv) శబరులు- ద్రావిడులు
v) బోయలు- ఆంధ్రులు
1) i, iii
2) i, ii, iii
3) ii, iii, iv, v
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
69. కళింగదేశపు రాజకుమార్తె, భర్త బుద్ధుని దంతముగల పెట్టెను తీసుకొని సింహళదేశం వెళుతూ దారితప్పి వజ్రాలదిన్నెకు చేరుకున్నారు. అక్కడ నాగాశోకుడనే నాగరాజు బౌద్ధస్తూపం నిర్మిస్తున్నాడు. అయితే వజ్రాలదిన్నే, బౌద్ధస్తూపం ప్రస్తుత పేర్లేమిటి ?
1) నాగార్జునకొండ- అమరావతి స్తూపం
2) కోటిలింగాల- ధాన్యకటక స్తూపం
3) ధరణికోట- అమరావతి స్తూపం
4) భట్టిప్రోలు- జగ్గయ్యపేట స్తూపం
- View Answer
- సమాధానం: 3
70. కృష్ణానదీ ప్రాంతమైన అమరావతి నాగుల జాతి నివాసమని చెబుతున్న బౌద్ధ వాఙ్మయం ?
1) అంగుత్తర నికాయ
2) శంఖపాల జాతకం
3) సారిపుత్త ప్రకరణం
4) 1,2
- View Answer
- సమాధానం: 2
71. ‘నాగ’రాజులకి సంబంధించింది ?
i) అశోకునికంటే ముందే ఆంధ్రదేశంలోని నాగరాజులు, ప్రజలు బౌద్ధస్తూపాలను నిర్మించనారంభించారు.
ii) ‘ముచిలిందుడు’ అనే నాగరాజు బుద్ధుడు తపస్సు చేసుకుంటున్న సమయంలోఎండ, వాన తగలకుండా రక్షణ కల్పించాడు.
iii) ఏడు పడగలు నాగుపాము బుద్ధునికి రక్షణ కల్పిస్తున్న శిల్పం నాగార్జునకొండ వద్ద ఉంది.
1) i, ii
2) ii, iii
3) i
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
72. క్రీ.పూ.400 సంవత్సరానికి చెందిన గుంటూరు జిల్లా భట్టిప్రోలు శాసనం ఆ ప్రాంత రాజుగా ఎవరిని పేర్కొంది ?
1) ముచులింద
2) మేఘవర్ణుడు
3) కుబ్బీరకుడు
4) బోధిశర్మ
- View Answer
- సమాధానం: 3
73. భట్టిప్రోలు శాసనం ప్రకారం కుబ్బీరక రాజు ఏ గోష్టికి అధిపతి ?
1) వృషభ
2) వందనామ
3) సింహ
4) మూషిక
- View Answer
- సమాధానం: 3
74. ద్రావిడ ప్రజలు కింది వారిలో ఎవరు ?
i) తెలుగు ii) తమిళ iii)కన్నడ iv) మళయాళి
1) i, iii, iv
2) ii,iii,iv
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 3
75. తెలంగాణాలో డోర్నకల్లు, బేగంపేట, మౌలాలి, మధిర, చింతకుంటలలో బయటపడిన కైరన్లు లేదా రాక్షసగుళ్ళ వల్ల తెలిసేది ?
i) ఇక్కడ లభించిన కుండలపై ఉన్న చిహ్నాలు, హరప్ప- మొహంజుదారో శిథిలాల్లో దొరికిన చిహ్నాలను, నాణేలను పోలి ఉన్నాయి.
ii) ఇనుప పనిముట్లు కలిగి, నగరాలను సైతం నిర్మించుకునే వ్యవస్థ ఉండేది.
iii) ఆంధ్రులు దక్షిణ దేశానికి రావడానికి ముందే ద్రావిడ కుటుంబానికి చెందిన తెలుగు ప్రజలు తెలంగాణాలో నివస్తుండేవారు.
1) i, ii
2) iii
3) ii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
76. భర్తవల్ల సంతానం కలగకపోతే, భర్త అనుమతితో మరొక పురుషుని ద్వారా సంతానం పొందే ‘నియోగ’ పద్ధతి ఆంధ్రుల్లో విస్తారంగా ఉండగా ఎవరు దానిని ఖండిస్తూ నిబంధనలు విధించారు?
1) అగస్త్యుడు
2) మనువు
3) ఆపస్తంభుడు
4) విశ్వామిత్రుడు
- View Answer
- సమాధానం: 3
77. ఆంధ్రులలో ‘ప్రత్త’ అనే ఆచారాన్ని వాత్సాయనుడు తెలియజేశాడు. దీని ప్రకారం ?
1) వివాహిత స్త్రీ భర్తతోనే కలిసి బతకాలి.
2) భర్త మరణిస్తే బార్య మరలా వివాహం చేసుకోవడం.
3) వేశ్యల విచ్చలవిడితనం
4) వివాహిత స్త్రీ భర్తతో కలిసి జీవించే ముందు గణనాయకునితో లేదా గ్రామాధికారితో ఒక రాత్రి గడపాలి.
- View Answer
- సమాధానం: 4
78. దక్షిణాదిలో ఆర్యవిస్తరణ ఫలితం ?
i) ఆశ్రమాలు స్థాపించిన ఋషులు ప్రచారం సాగించి స్థానికుల్లో వైదిక సంస్కృతిపై ఆదరణ కలిగించారు.
ii) స్థానిక మత విశ్వాసాలతో వైదికమతం సమాధానపడింది.
iii) వర్ణవ్యవస్థ ఏర్పడింది.
1) i, ii
2) iii
3) ii, iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
79. దక్షినాపథంలో కొత్త సాంఘిక సంబంధాల మనుగడకై ఆచరణ సూత్రాలను రూపొంచవలసిన ఆవశ్యకత ఏర్పదింది. అందుకు ఆంధ్రదేశంలో ఆపస్తంభ ఋషి (క్రీ.పూ.500) చేసిన సేవ?
i) వేదాధ్యయన ఆధ్యాపకులకు, వైదిక క్రతుకాండకు నియమావళిని రూపొందించాడు.
ii) స్థానిక మత విశ్వాసాలను, ఆచారాలను అధర్వణ వేదంలో చేర్చి, వాటికి ఉన్నత ప్రతిపత్తి చేకూర్చాడు.
iii) మత విషయాలపై పురాణాలను ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరించాడు.
1) i
2) ii, iii
3) i, ii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
80. ‘‘క్రీ.పూ.400 నాటికి ఉత్తరాది ప్రజలు, రాకుమారులు దక్షిణానికి వలస వచ్చారు’’ ఈ వ్యాఖ్యానంతో సరిపోవేవి?
i) యదు, భోజ తెగలు దక్షిణాపథానికి వచ్చాయి.
ii) విష్ణు పురాణం ప్రకారం కోసల ఇక్ష్వాక రాజకుమారులు అశ్మక, ములక రాజ్యాలు స్థాపించారు.
iii) యశోధర్ముడనే ఇక్ష్వాక రాకుమారుడు ప్రతీపాలపుర (భట్టిప్రోలు) రాజ్యాన్ని స్థాపించినట్టు ధర్మామృతమనే జైనకావ్యం తెలుపుతోంది.
iv) బృహచ్ఛరణ శాఖ అనేది ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చిన తమిళ బ్రాహ్మణులకు సంబంధించింది.
1) i, iii, iv
2) i, ii, iv
3) ii, iii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
81. ‘ఆంధ్రవిష్ణువు’ గురించి తెలిసే గ్రంథాలేవి ?
i) మత్స్య పురాణం
ii) వాయుపురాణం
iii) బ్రహ్మాండ పురాణం
iv) ఆంధ్రకౌముది
v) ఆర్యమంజుశ్రీమూలకల్పం
1) i, ii
2) ii, iv
3) iii, iv, v
4) i, ii, iii, v
- View Answer
- సమాధానం: 3
-
82. గోదావరి తీరంలో ఆంధ్ర విష్ణువు అనే రాజు రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని తండ్రి సూచందున్ని రాజధాని శ్రీకాకుళమని, ఆర్యమంజుశ్రీమూలకల్పమనే బౌద్ధ గ్రంథం తెలుపుతుంది. ఈ ప్రదేశం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) కృష్ణా జిల్లా
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 3
-
83. కింది వాటిలో ఆంధ్ర విష్ణువు దేవాలయానికి సంబంధించింది ?
i) కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో ఇది ఉంది.
ii) ఆంధ్ర విష్ణువు అనే రాజు తన రాజధానిలో భక్తి సూచకంగా తన పేరు మీద దేవుని ప్రతిష్టించాడు.
iii) దీనికి ఆంధ్రనాయక స్వామి అని మరొక పేరు కూడా ఉంది.
iv) విజయనగర శ్రీకృష్ణ దేవరాయలు కళింగ దేశ విజయయాత్ర సాంగించక ముందు ఈ దేవుడు కలలో కనిపించి ‘‘ఆముక్తమాల్యద’’ ప్రబంధాన్ని రచించమని చెప్పాడు.
1) i, ii
2) iii, iv
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
1) ధననందుడు
2) చంద్రగుప్తమౌర్యుడు
3) బింబిసారుడు
4) మహాపద్మనందుడు
- View Answer
- సమాధానం: 4
-
85. మహాపద్మనంద రాజు చేసిన దక్షిణ దండయాత్రల్లో లేని రాజ్యాలు ?
i) కళింగ ii) తమిళదేశం
iii) అశ్మక iv) సింహళం
1) i, iii
2) ii, iii
3) i, iv
4) ii, iv
- View Answer
- సమాధానం: 4
-
86.నంద సామ్రాజ్యానికి సంబంధించింది ?
i) నాందేడ్ (నవనందథేర) దక్షిణ సరిహద్దు.
ii) ప్రాచీన తమిళ సారస్వతంలో నందుల దక్షిణ దేశ ఆక్రమణలు గుర్చి ఉన్నది.
iii) సింధు- గోదావరి నదుల మధ్య విస్తరించిన మహాసామ్రాజ్యాన్ని మహాపద్మనందుడు స్థాపించాడు.
1) i, iii
2) iii
3) i
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
-
1) అశోకుడు
2) ధననందుడు
3) మౌర్యచంద్రగుప్తుడు
4) అజాతశత్రువు
- View Answer
- సమాధానం: 3
-
88. కాలక్రమం ఆధారంగా ఆరోహణక్రమంలో అమర్చండి ?
i) జస్టిన్ ii) అరియన్ iii) ప్లీనీ iv) మెగస్తనీస్
1) i, ii, iii, iv
2) iv, ii, iii, i
3) iv, iii, ii, i
4) iii, ii, i, iv
- View Answer
- సమాధానం: 2
-
89. కింది వాటిలో మెగస్తనీస్కు సంబంధించి సరైనది?
i) గ్రీకు పాలకుడు సెల్యూకస్ తరపున మౌర్యచంద్రగుప్త ఆస్థానంలో ఉన్న రాయబారి.
ii) ఇతడు ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు.
iii) ఇండికా గ్రంథంలో భారతదేశ సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ, భౌగోళిక పరిస్థితులను వివరించాడు.
iv) గ్రీకు, లాటిన్ భాషల్లో ఉన్న ‘ఇండికా’ను J.W.మెక్‌క్రిండిల్ (J.W. Mecrindle) ఇంగ్లీష్‌లో 3 పుస్తకాల రూపంలో రాశాడు.
v) దక్షిణ భారత రాజ్యాల గురించి ‘ఇండికా’లో ఉంది.
1) i, ii, iii
2) ii, iii, iv
3) i, ii
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
-
90. మెగస్తనీస్ ఇండికాలోని 59 అధ్యాయాలు ఉన్నవి. ‘ఆంధ్రులకు 30 దుర్గాలు, లక్ష కాల్బలం, 3 వేల గుఱ్ఱాలు, 2 వేల ఏనుగులతో పెద్ద సైనిక బలం’ ఉందని మెగస్తనీస్ ఏ అధ్యాయంలో పేర్కొన్నాడు ?
1) 55
2) 56
3) 57
4) 58
- View Answer
- సమాధానం: 2
-
91. ‘‘దక్కన్లో ఆంధ్రులు రాజ్యాధిపతులై 30 కోటగోడలు కలిగిన పట్టణాలు, అనేక గ్రామాలు, ఒక లక్షా తొంబైవేల కాల్బలం, రెండు వేల అశ్విక బలం, వెయ్యి గజ బలం’’ ఉన్నట్టు పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు?
1) ఎరియన్
2) టాలమీ
3) ప్లీనీ
4) ఫ్లుటార్క
- View Answer
- సమాధానం: 3
-
92. ఆంధ్రులకు 30 రాజ్యాలున్నాయని పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు ?
1) ప్లీనీ
2) మెగస్తనీస్
3) ఎరియన్
4) అరిస్ట్రోబులస్
- View Answer
- సమాధానం: 3
-
93. మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రుల 30 కోటగోడలు కలిగిన పట్టణాల్లో ఉన్నవి ?
i) ప్రతిష్ఠానం- భోదన్
ii) కోటిలింగాల- ధూళికట్ట
iii) కొండాపురం- ధాన్యకటకం
iv) దంత పురం- సాతానికోట
1) i, ii
2) ii, iv
3) ii, iii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
94. జతపరచండి.
30 కోట గోడలు కలిగిన పట్టణాలు
i) దంతపురం
ii) ధరణికోట
iii) సాతాని కోట
iv)కొండాపురం
v) ధూళికట్ట
vi) ఫైఠాన్
ఉనికి
a) కరీంనగర్- తెలంగాణ
b) మెదక్- తెలంగాణ
c) ఔరంగాబాద్- మహారాష్ర్ట
d) శ్రీకాకుళం- ఆంధ్రప్రదేశ్
e) గుంటూరు- ఆంధ్రప్రదేశ్
f) కర్నూలు- ఆంధ్రప్రదేశ్
1) i-a, ii-b, iii-f, iv-c, v-d, vi-e
2) i-d, ii-e, iii-f, iv-b, v-a, vi-c
3) i-d, ii-e, iii-f, iv-b, v-c, vi-a
4) i-f, ii-e, iii-d, iv-c, v-b, vi-a
- View Answer
- సమాధానం: 2
-
95.నాణేల లభ్యత దృష్ట్యా క్రీ.పూ.3 శతాబ్ధి నాటికి ప్రస్తుత తెలంగాణా రాష్ర్టంలోని కరీంనగర్ - నల్గోండ ప్రాంతాలల్లో ఏఏ రాజ్యాలుండేవి ?
1) సేబక- మహిషక
2) అస్సక- ములక
3) శబర- అస్సక
4) అస్సక- మహిషక
- View Answer
- సమాధానం: 1
-
96. క్రీ.పూ.3 శతాబ్ధి చివరిలో నిగమసభ, గోష్టీల సహాయంతో సవేరుని కొడుకు కుభీరకుడు పరిపాలన సాగించినట్టు తెలిపే స్తూప శాసనాలు బయల్పడిన ప్రదేశం ?
1) చేజెర్ల
2) నాగార్జునకొండ
3) భట్టిప్రోలు
4) అమరావతి
- View Answer
- సమాధానం: 3
-
97. నిగమసభ (నగర శ్రేష్టుల సభ) సహాయంతో పాలన చేసిన మౌర్య సమకాలికులు ?
1) భట్టిప్రోలు- రాజాకుబ్బీరక
2) వడ్డమాను- రాజా సోమక
3) ధాన్యకటకం- యక్షరాజు
4) 1,2
- View Answer
- సమాధానం: 4
-
98. మౌర్యుల కాలంలో ఆంధ్రుల స్థితిని తెలిపేవి ?
i) మౌర్య చంద్రగుప్తుని కాలంలో (క్రీ.పూ.310) మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్ర చేరింది.
ii) అశోకుని 13వ శిలా శాసనం ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలోని ప్రజలుగా చెబుతుంది.
iii) అశోకుని శాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజులమందగిరిలలో బయల్పడినవి.
iv) ప్రాచీన అమరావతీ శాసనాలు రాజకుమారుల గురించి తెల్పుతున్నాయి.
1) ii, iii
2) ii, iii, iv
3) i, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
99. ‘‘ఆంధ్ర’’ అనే పదం ఎవరి శాసనాల్లో మాత్రమే కనిపిస్తుంది ?
1) ఖారవేలుని హాతిగుంపా శాసనం
2) నందరాజుల శాసనాలు
3) మౌర్య శాసనాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
-
100. నిశ్చితవాక్యం (A): ఆంధ్రప్రాంతం మీద మౌర్య ప్రభావం విస్తరించింది.
హేతువు (R): ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఉత్తరాది నలుపు నగిషీ పాత్రలు (NBPW), విద్ధాంక నాణాలు బయల్పడినవి.
1) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ
2) A, Rలు సరైనవి. R, Aకి సరైన వివరణ కాదు
3) A సరైనది. R సరికానిది
4) A సరికానిది. R సరైనది
- View Answer
- సమాధానం: 1
-
101. మౌర్య యుగం నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఏఏ లోహాల వాడకం ఎక్కువైంది ?
i) రాగి ii) వెండి
iii) బంగారం iv) ఇనుము
1) i, ii
2) ii, iii
3) i, iv
4) iii, iv
- View Answer
- సమాధానం: 4
-
102. మౌర్య యుగంలో ఆంధ్రదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ?
i) కొండాపుర్లో ఈ కాలం నాటి ఇనుప ఖార్ఖానాలు బయల్పడ్డాయి.
ii) ఇనుప పనిముట్ల వాడకంతో వ్యవసాయంసాగి వరి, పత్తి పంటలను ఎక్కువగా పండించారు.
iii) వ్యవసాయం, ఇనుప, వస్త్ర పరిశ్రమలతో దేశం సుభిక్షమై ఉత్తరదేశం, సింహళ దేశంతో వాణి జ్యం సాగించింది.
1) iii
2) ii, iii
3) i, ii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
-
103. ములక రాజ్యం (పైఠాన్) ఐశ్వర్యవంతమై శాతవాహనుల బలగౌరవాలకు ఏవిధంగా కారణమైంది ?
1) తూర్పు తీరపట్టణాల నుంచి దేశాంతర్భాగానికి వెళ్ళే మార్గంలో ములక రాజ్యం ఉంది.
2) తూర్పు తీర రేవు పట్టణాలు అప్పటికే (క్రీ.పూ.200) దూరదేశాలతో వాణిజ్యం చేసేవి. అక్కడే ములక రాజ్యం ఉంది.
3) పశ్చిమ తీర రేవు పట్టణాల నుంచి దేశాంతర్భాగానికి వెళ్ళే మార్గంలో ములక రాజ్యం ఉంది.
4) పశ్చిమ, తూర్పు తీర రేవులకు మధ్యస్థంగా ములక రాజ్యం ఉంది.
- View Answer
- సమాధానం: 3
-
104. ఆంధ్ర దేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధని తెలిపే గ్రంథం ?
1) శంఖపాల జాతకం
2) భీమసేన జాతకం
3) అంగుత్తర జాతకం
4) అభిద్ధమ్మ పీటకం
- View Answer
- సమాధానం: 2
-
105. కింది వాటిలో సరైనది ?
i) 3వ బౌద్ధ సంగీతికి (క్రీ.పూ.251) పూర్వమే ఆంధ్రదేశంలో బౌద్ధం జనాదరణ పొందినట్లు ధాన్యకటకం వద్దఉన్న పురావస్తు సాక్ష్యం చెబుతోంది.
ii) అశోకుని 13వ శిలాశాసనం ఆంధ్రులు నాటికే ధర్మాన్ని అనుసరిస్తున్నట్టు తెల్పింది.
1) i
2) ii
3) i, ii
4) i, ii కాదు
- View Answer
- సమాధానం: 3
-
106.ధాన్యకటక: భట్టిప్రోలు శాసనాలను బట్టి ఆయా ప్రదేశాలలో బౌద్ధ భిక్షువులు ఏఏ పేర్లతో గోష్ఠిగా ఏర్పడ్డారు ?
1) సింహగోష్ఠి: నందిగోష్ఠి
2) సింహగోష్ఠి: వందనామగోష్ఠి
3) అంధకగోష్ఠి: సింహగోష్ఠి
4) వందనామగోష్ఠి: సింహగోష్ఠి
- View Answer
- సమాధానం: 4
-
107. ‘అంధకులు’ ఏ బౌద్ధసంగీతిలో ప్రముఖ పాత్ర వహించినట్టు కథావత్తు తెలుపుతోంది ?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
-
108. విద్యార్ధుల్లో కూడా ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఏ శాసనంలో ఉపాధ్యాయులకు ఉద్భోధించాడు ?
1) రాజులమందగిరి
2) ఎర్రగుడి
3) మస్కి
4) దౌళి
- View Answer
- సమాధానం: 2
-
109. అశోకుడు మహిషమండలానికి మహాదేవభిక్షుని పంపగా, ఈ భిక్షు ఎక్కడ చైత్యవాద బౌద్ధాన్ని స్థాపించాడు ?
1) నాగార్జునకొండ
2) చేజెర్ల
3) భట్టిప్రోలు
4) అమరావతి
- View Answer
- సమాధానం: 4
-
110. అనూరాధాపురంలోని ‘‘సువణ్ణమలకి స్తూప’’ ఆవిష్కరణకు పల్లవబొగ్గ నుంచి అసంఖ్యక బౌద్ధ భిక్షువులతో ఎవరు హాజరైనట్టు సింహళ గ్రంథం మహావంశ వర్ణిస్తోంది ?
1) తిస్స
2) మహాదేవుడు
3) నాగార్జునకొండ
4)బుద్ధఘోషుడు
- View Answer
- సమాధానం: 2
111. మౌర్యానంతరం, శాతవాహనులకు పూర్వం ఆంధ్రదేశంలో ఏర్పడ్డ చిన్న రాజ్యాలేవి ?
i) కుబీరకుడు- భట్టిప్రోలు
ii) సోమకుడు- వడ్డమాను
iii) సదవంశం- గుంటుపల్లి
iv) మహారధులు- కృష్ణ- తుంగభద్ర ప్రాంతం
v) మహాతలవర- తెలంగాణ
1) iii, iv, v
2) i, ii
3) i, iii, iv
4) i, ii, iii, iv, v
- View Answer
- సమాధానం: 4
-
112. ‘సద’ వంశానికి సంబందించినది ?
i) గుంటుపల్లి, వేల్పూరు శాసనాలు ఆధారాలు.
ii) సిరిసద, సహసద, అశోకసద, శివసద, శివమకసద అనే పాలకుల వివరాలు మాత్రమే తెలుస్తున్నాయి.
iii) పాలకులు మహారాజ బిరుధు ధరించగా, ఈ బిరుధుతో పాటు సిరిసద మహా మేఘ వాహనుడు అనే బిరుదుని కుడా ధరించారు.
iv) గుంటూరు, ప్రకాశం నుంచి విజయనగరం వరకు వీరి నాణాలు లభ్యమయ్యాయి.
1) i, ii, iv
2) i, ii, iii
3) ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
113. వీరాపురం తవ్వకాల్లో బయల్పడిన మహారథుల నాణాలపై ఉన్న పేర్లు ?
i) మహాహస్తిన్
ii) శివమహాహస్తిన్
iii)శివస్కందహస్తిన్
iv) ఖడపోరిహస్తిన్
1) i, iv
2) ii, iii, iv
3) i, ii, iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
-
114. హస్తిన్ వంశావళికి చెందిన మహారధులు చంద్రవల్లి, కొల్హాపూర్‌లు నుంచి విఖ్యాతులు. వీరి నాణాల మీద ఏ బొమ్మ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ?
1) గుఱ్ఱం
2) నంది
3) ఏనుగు
4) పులి
- View Answer
- సమాధానం: 3
-
115. కొండాపూర్, హైదరాబాద్‌లలో లభ్యమైన మహారధుల నాణాల మీద ఉండే ముద్రలు ?
1) పులి
2) వృషభం
3) సింహి
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
-
116. నేటి తెలంగాణ రాష్ర్టంలోని కోటిలింగాల తవ్వకాల్లో దొరికిన తొలి శాతవాహనుల నాణేలపై పైతరాలల్లో క్రీ.పూ. 2-1 శతాబ్థాలకి చెందిన మహారధుల నాణాలు లభించాయి. ఆ నాణాలపై ఉన్న పేర్లు ?
i) గోభద ii) సమగోప iii) నారన iv) కంవయస
1) i, ii, iii
2) ii, iv
3) i, ii, iii, iv
4) i, ii
- View Answer
- సమాధానం: 3
-
117. తెలంగాణలో లభ్యమైన నాణాలపై మహాతలవర, శివసేవక అనే బిరుదులతో ఉన్న లాంఛనాలేమిటి ?
1) గరుడ
2) గుఱ్ఱం
3) వృషభం
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
-
118. ‘ సద’ వంశస్థుల నాణేల అడుగు భాగంలో సాధారణంగా కనిపించే గుర్తు ?
1) జంతువు
2) నక్షత్రం
3) పర్వతం
4) త్రిరత్న
- View Answer
- సమాధానం: 3
-
119. కింది వాటిలో ఏవరి నాణాలపై భాగం మీద పెద్దమెడతో కుడివైపుకు తిరిగి ఎదురుగా ఉన్న చెట్ల వరసను చూస్తూ తోక ఎత్తి ఉన్న సింహం బొమ్మ ముద్రించి ఉంది ?
1) మహాతలవర
2) యక్షు వంశం
3) నాగ వంశం
4) సద వంశం
- View Answer
- సమాధానం: 4
-
120. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత కాలంలో ‘సద’ వంశరాజుల నాణాలపై వారి గుర్తులు తొలగించి, ఏఏ చిహ్నాలను శాతవాహనులు ముద్రించారు ?
i) ఉజ్జయిని చిహ్నం
ii) త్రిరత్న చిహ్నం
iii) 10 శిఖరాల పర్వతం
1) i, ii
2) ii
3) iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4