ప్రాక్ చరిత్ర - II
1. ఎగువ ప్రాచీనశిలాయుగానికి చెందినది ?
i) బ్లేడ్ - బ్యూరిన్ పరిశ్రమ
ii) బ్లేడ్ ఫ్లేక్ పద్ధతి
iii) ఎముక పనిముట్లు
iv) హోమోసెపియన్ మానవజాతి మనుగడ
1) i, iv
2) ii, iii, iv
3) ii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
2. ఎగువ ప్రాచీనశిలాయుగం నాటి సున్నపు రాతిసూది ఆంధ్రప్రదేశ్‌లోని ఏఏ ప్రదేశం/ప్రదేశాలలో లభించింది ?
i) చింతమాను గవిగృహ
ii) పావురాళ్ళ గుట్ట
iii) ఉట్నూరు
iv) టెక్కలికోట
1) i, iv
2) ii, iv
3) i
4) iii
- View Answer
- సమాధానం: 3
3.M.L.K.మూర్తి, కె.తిమ్మారెడ్డిలు ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ ప్రాంతాల్లో ఎగువ ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నారు ?
i) బిల్లసర్గం, బేతంచెర్ల గృహ
ii) రేణిగుంట, ఎఱ్ఱగొండపాలెం
iii) నాగార్జునకొండ, చింతమానుగవి
iv) వర్ధమానుకోట, జొన్నలగడ్డ
1) i, iv
2) i, iii, iv
3) i, ii, iii
4) ii, iii, iv
- View Answer
- సమాధానం: 3
4. బేతంచెర్ల, బిల్లసర్గంలలోని ఎగువ ప్రాచీన శిలాయుగ పరికరాలైన పెచ్చులు, మొనలు, మూలాల తయారీకి అవలంభించిన పద్ధతి?
i) రాతిసుత్తి పద్ధతి
ii) స్థూపాకార సుత్తి పద్ధతి
iii) బ్లేడ్- ఫ్లేక్ పద్ధతి
iv) దాగలి పద్ధతి
1) i, iii
2) iii
3) iv
4) iii, iv
- View Answer
- సమాధానం: 2
5.విల్లంబులను మొట్టమొదట వాడిన వారు ?
1) ఎగువ ప్రాచీన శిలాయుగ ప్రజలు
2) నవీన శిలాయుగ ప్రజలు
3) తామ్ర- శిలాయుగ ప్రజలు
4) దిగువ ప్రాచీన శిలాయుగ ప్రజలు
- View Answer
- సమాధానం: 1
6.ఎగువ ప్రాచీన శిలాయుగానికి చెందిన ఎముక పనిముట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ ప్రాంతాల్లో లభించాయి ?
i) కర్నూలు- బిల్లసర్గం గుహలు
ii) అనంతపురం- ఉరవకొండ గుట్టలు
iii) కర్నూలు- ముచట్ల చింతమాను గవి గుహ
iv) అనంతపురం- కొత్తకోటమెట్ట
1) i, iv
2) i, ii, iv
3) ii, iii, iv
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
7. బిల్లసర్గం గుహకు సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) కర్నూలులోని బేతంచెర్లలో ఉన్న ఈ గుహలో రాబర్ట బ్రూస్ ఫుట్, హెన్రీఫూట్ పరిశోధన చేశారు
ii) మనిషి చెక్కిన వంపు ఎముకలు, తలలేని జంతుకళేబరాలు లభించాయి
iii) ఇక్కడ లభించిన పనిముట్లకు ఫ్రాన్స్‌లోని మాగ్ధలీనియన్ పనిముట్లకు పోలికలున్నవి.
iv) ఇది ఇనుపయుగం కాలం నాటిది
1) i, iv
2) i, ii, iii
3) i, iii
4) ii, iii, iv
- View Answer
- సమాధానం: 2
8.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగువ ప్రాచీన శిలాయుగ స్థావరాలతవ్వకాల్లో లేదా పరిశోధనలో బిల్లసర్గం, ముచ్చట్ల చింతమాను గవి గుహల పాత్ర ఏమిటి ?
i) కేవలం వీటి నుంచి మాత్రమే ఎగువ ప్రాచీన శిలాయుగ ఎముక పనిముట్ల సమూహాలు లభించాయి.
ii) ముచ్చట్ల చింతమాను గవి గుహలో మలి ప్లెస్టోసీన్ జంతుజాలం, బ్లేడు పనిముట్లు, ఎముక పనిముట్ల సమూహం లభించాయి.
iii) ముచ్చట్ల చింతమానుగవి గుహలో ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి నిప్పు స్థలాల్లో కాల్చిన మట్టినమూనాలు కనిపించాయి.
1) i
2) i, iii
3) ii, iii
4) i, ii, iii
- View Answer
- సమాధానం: 4
9. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కొండ ప్రాంతాల్లో బయటపడిన ఎగువ ప్రాచీన శిలా సంస్కృతికి సంబంధించిన శిలాజం/శిలజాలేవి ?
i) గుఱ్ఱం, ఎద్దు
ii) అడవి పంది, దుప్పి
iii) జింక
iv) తాబేలు
1) i, iv, iii
2) ii, iii
3) iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
10.జతపరచండి.
ప్రాచీన శిలాయుగ దశలు
a) పూర్వ ప్రాచీన శిలాయుగం
b) మధ్య ప్రాచీన శిలాయుగం
c) ఎగువ ప్రాచీన శిలాయుగం
నాగరికత
i) వేట
ii) దేశ దిమ్మరి
iii) సాంకేతికాభివృద్ధి
1) a-i, b-ii,c-iii
2) a-iii, b-i, c-ii
3) a-ii, b- i,c-iii
4) a-ii, b-iii, c-i
- View Answer
- సమాధానం: 2
11. జతపరచండి.
మధ్య శిలాయుగ పరిశోధకుడు
a) ఏసిఎల్. కార్లైల్
b) రాబర్ట బ్రూస్‌ఫుట్
c) కామియేడ్
ప్రాధాన్యత
i) ఆంధ్రప్రదేశ్‌లో మధ్యశిలాయుగాన్ని కనుగొన్న ప్రధముడు
ii) దిగువ గోదావరి లోయలో పరిశోధన
iii) భారత్‌లో సూక్ష్మశిలా పనిముట్లకు సంబంధించి తొట్టతొలి ఆవిష్కరణ
1) a-i, b-ii,c-iii
2) a-ii, b-i, c-iii
3) a-ii, b- iii,c-i
4) a-iii, b-ii, c-i
- View Answer
- సమాధానం: 3
12. త్రిభుజ, చతుర్భుజాకార పనిముట్లు, బాణపు మొనలు, అర్థచంద్రాకారాల వంటి మధ్య శిలాయుగపు పనిముట్ల తయారీలో వాడిన పద్దతి లేదా పద్ధతులు ?
1) బ్లేడ్- ఫ్లేక్ పద్ధతి
2) సెండరీ ఫ్లేకింగ్ పద్ధతి
3) దాగలి పద్ధతి
4) 1,2
- View Answer
- సమాధానం: 4
13. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్యశిలాయుగ సంస్కృతికి సంబంధించింది ?
i) ఈ యుగం చివరిదశలో చేతితో కుండలు తయారైనవి
ii) మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం ప్రారంభమైంది.
iii) గిద్దలూరు, నాగార్జునకొండలలో ఈ సంస్కృతి పరికరాలు లభ్యమయ్యాయి
iv) గిద్దలూరులో లభించిన ఆధారాన్ని బట్టి ఈ యుగ కాలం క్రీ.పూ.8000-6000.
1) i,iv
2) ii,iii
3) i,ii,iii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
మధ్య శిలాయుగ వర్ణ చిత్రాలు
a) జింక
b) ముసుగు ఉన్న మానవాకృతులు
c) మానవీయత గల చిత్రాలు
d) మానవాకృతి చిత్రాలు
ప్రదేశాలు
i) చింతకుంట- కడప
ii) సంగనోనిపల్లి- మహబూబ్ నగర్ (తెలంగాణ)
iii) పులిచెర్ల- కర్నూలు
iv) కేతవరం- కర్నూలు
1) a-i,b-ii,c-iii,d-iv
2) a-iv,b-i,c-iii,d-ii
3) a-ii,b-iv,c-i,d-iii
4) a-iii,b-i,c-ii,d-iii
- View Answer
- సమాధానం: 2
15. ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యశిలాయుగ వర్ణ చిత్రాల్లోలేని లక్షణం ?
1) రేఖాగణిత నమూనాలు
2) ఏక వర్ణ అనుసరణ (ఎరుపురంగు)
3) శ రీరంలో అంచుభాగానికి పోయేకొద్దీ రంగు పలచన అవుతుంది
4) ఇవన్నీ రాతిపై చెక్కడాలు
- View Answer
- సమాధానం: 4
16.ఆంధ్రప్రదేశ్‌లోని మధ్య శిలాయుగపు చిత్తరాలోవులలో కనిపించని జంతువు/ జంతువులు?
i) తాబేలు ii) చెవుల పిల్లి
iii) నక్క iv) కుక్క
v) పెద్దపులి vi) హైనా
1) i, ii, iv
2) v
3) iii
4) iv
- View Answer
- సమాధానం: 2
17. ముచ్చట్ల చింతమాను గవిలో దొరికిన కుండపెంకుల కాలం థర్మోలుమినిసెన్స పద్ధతి ద్వారా క్రీ.పూ. 1800 అని తెలిసింది. పై వ్యాఖ్యానికి ఆధారంగా కింది వాటిలో సరైనది ?
i) ఆంధ్రాలోని సూక్ష్మశిలా సముదాయాలు బగోర్, భీంబెక్త, నరాయిసహార్రాయి ల నమూనా, సాంకేతిక పరిజ్ఞానాలతో పోలికలు కలిగి ఉన్నవి.
ii) సూక్ష్మ శిలా సముదాయం తొలి హాలోసీన్ యగానికి చెందినది.
iii) సూక్ష్మ శిలాయుగ కాలపరిమితి క్రీ.పూ. 8500- 2000.
1) i,iii
2) i
3) ii, iii
4) i, ii,iii
- View Answer
- సమాధానం: 4
18. నవీన శిలాయుగానికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) ఇది పశ్చిమాసియాలో ఆరంభమైనది
ii) మెరుగుపెట్టిన రాతి గొడ్డళ్ళ సంస్కృతి
iii) ఆహార ఉత్పత్తి దశ (క్రీ.పూ. 9000) ఈ యుగంలో జరిగింది.
iv) ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తికి సాగడం నవీన శిలాయుగ విప్లవం అని చైల్డ్ పేర్కొన్నాడు.
1) i, ii, iii
2) iii, iv
3) i, ii
4) i, ii, iii, iv
- View Answer
- సమాధానం: 4
19.దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగ పనిముట్ల సేకరణకు సంబంధించి కింది వాటిలో సరికానిది ?
i) మొట్టమొదటి పనిముట్టును 1842లో టేలర్ లింగసూగూర్‌లో కనుగొన్నాడు
ii) ఇసుక రాతి గొడ్డలిని రాబర్ట బ్రూస్
ఫుట్ 1887లో వడ్డమానులో కనుగొన్నాడు
1) i
2) ii
3) i,ii
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 4
20. సాగు మార్పిడి తెగలైన కొండరెడ్డి, కొండదొర, కోయ, భగతలు ఆవాసం ఉంటున్న తూర్పు కనుమల సాంద్ర అటవీ మండలాల్లో భారతీయ నవీనశిలాయుగ సముదాయం స్ఫురణకు తెచ్చే ఏ పనిముట్లు కనిపించాయి ?
1) చేతి గొడ్డళ్ళు
2) సభుజాలైన పనిముట్లు
3) బ్లేడ్లు
4) బ్యూరిన్లు
- View Answer
- సమాధానం: 2
21.ఆహారాన్వేషణ దశ నుంచి ఆహారోత్పత్తి దశకు పరివర్తన చెందడానికి సాక్ష్యాలు లభిస్తున్న ప్రదేశాలు ?
i) ఉట్నూరు ii) గిద్దలూరు
iii) సంగనకల్లు iv) శంఖవరం
1) i,iv
2) i,ii,iii
3) ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
22.నాగటి కర్రులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ లభించాయి ?
1) ధరణికోట
2) కోనసీమ
3) నాగార్జునకొండ లోయ
4) 2,3
- View Answer
- సమాధానం: 3
23. ఆంధ్రప్రదేశ్‌లోని నవీన శిలాయుగ మట్టి పాత్రల లక్షణాలేవి ?
i) చేతితో తయారు చేసినవి.
ii) బూడిద రంగు లేదా లేత గోధుమ రంగు కలిగి ఉండేవి.
iii) నలుపు లేదా ఎరుపు నునుపు చేసిన పూత ఉండేది.
iv) కెంపు రంగు అలంకారం ఉండేది.
v) పాక్ హరప్పా అమ్రి, కాలి బంగన్లను స్ఫురింపచేసే బోలు సంభపీఠాలు, గుండ్రటి వలయాలు.
1) i,iii,v
2) ii,iv,v
3) i,ii,iv,v
4) i,ii,iii,iv,v
- View Answer
- సమాధానం: 4
24. నవీన శిలాయుగం నాటి ఆర్థిక వ్యవస్థ ?
i) వ్యవసాయం ii) పశుపోషణ
iii) వేట iv) వర్తకం
1) i,iv
2) ii,iii
3) i,ii
4) i,iii,iv
- View Answer
- సమాధానం: 3
25. ఉలవలు, రాగులు పండించిన దక్షిణ భారత నవీన శిలాయుగ ప్రాంతాలేవి ?
i) బళ్ళారి- టెక్కలికోట
ii) అనంతపురం- పాలరాయి
iii) మహబూబ్‌నగర్- ఉట్నూర్
iv) గుంటూరు- నాగార్జున కొండ
1) i,iv
2) i,ii
3) i,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 2
26. నిశ్చిత వాక్యం (A): నవీన శిలాయుగంలో పశుపోషణ ఉంది.
హేతువు (R): బళ్ళారిలోని సంగనకల్లు, మహబూబ్‌నగర్‌లోని ఉట్నూర్ వద్ద బుడిద రాశులు నవీన శిలాయుగం నాటివి కనిపించాయి.
1) (A) (R) లు రెండూ సరైనవి. (R)(A) కి సరైన వివరణ.
2) (A) సరైనది, (R) సరికానిది
3) (A)సరికానిది, (R) సరైనది
4) (A)(R)లు రెండూ సరైనవి. (R)(A)కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 1
27. ఆంధ్రప్రదేశ్‌లోని నవీన శిలాయుగ ప్రజలు అత్యధికంగా మచ్చిక చేసుకున్న జంతువు లేదా జంతువులేవి ?
i) ఆవు ii) గొర్రె iii) మేక iv) పంది
1) i,ii,iii
2) i
3) iii
4) iii,iv
- View Answer
- సమాధానం: 2
28.ఆంధ్రప్రదేశ్‌లోని నవీన శిలాయుగపు వర్ణచిత్రాలకు సంబంధించింది ?
i) బూదగవి, చింతకుంట, అదోని, నాయుడుపల్లి స్థావరాల్లో ఇవి కనిపించాయి.
ii) మూపురం ఉన్న ఎద్దులు, వాటి దగ్గర మనుషులు ఉన్నట్లు ఎర్రరంగుతో చిత్రించారు.
iii) శిలపై చెక్కడం ఈ యుగంలో కనిపిస్తుంది.
1) i,ii
2) ii,iii
3) i,iii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
29. నవీన శిలాయుగం చివరి దశలో దక్షిణదేశ ప్రజలకు ఉత్తర దేశంలోని తామ్ర శిలాయుగ (chalcolithic period) ప్రజలతో పరిచయం ఉంది.
పై వ్యాఖ్యకు సంబంధించి సరైనది ?
i) కర్నూలు జిల్లాలో పాతపాడులో చిత్రాలంకృతమైన మృణ్మయ పాత్రలు లభించాయి
ii) కృష్ణా జిల్లా కీసరపల్లిలో రాగిపని ముట్లు లభించాయి
iii) అమరావతిలో రాగి- ఇనుప పనిముట్లు లభించాయి
1) i
2) i,iii
3) i,ii
4) iii
- View Answer
- సమాధానం: 3
30.ఆంధ్ర, ఇతర ప్రాంతాల్లో లభించిన తామ్రశిలా యుగం నాటి సమాధుల ప్రకారం అవలంభించిన ఖనన పద్ధతులేవి ?
i) పెద్ద వారిని ఊరికి దూరంగా తూర్పున శ్మశాన వాటికల్లో పాతిపెట్టే వారు
ii) చిన్న పిల్లలను తమ ఇళ్ళలోనే కుండల్లో పెట్టి పాతి పెట్టేవారు
iii) చిన్న పిల్లలను పాతిపెట్టడం రెండు రకాలుగా చేసేవారు
1) i
2) iii
3) i,ii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 3
31. ఆంధ్ర ప్రాంత తామ్ర శిలా యుగ ప్రజలు చిన్న పిల్లలు చనిపోతే కుండలో పెట్టి పాతిపెట్టే రకాలేవి ?
i) ఏక కుండతో చేసినవి
ii) రెండు కుండలతో చేసినవి
iii) మూడు కుండలతో చేసినవి
iv) ఐదు కుండలతో చేసినవి
1) i,iv
2) i,ii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
32.ఆంధ్రప్రదేశ్‌లోని ఇనుపయుగం (క్రీ.పూ. 500)ను ఈ విధంగా కూడా పిలుస్తారు ?
i) రాక్షసి గుళ్ళు (Megalithis)
ii) బృహచ్ఛిలా యుగం
iii) మొదటి పట్టణం నాగరికత
iv) తామ్ర- అయో యుగం
1) i,iv
2) i,ii
3) ii,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 2
33.రాక్షస గుళ్ళ మీద పరిశోధన చేసిన వారు ?
1) రాబర్ట్ బ్రూస్ ఫుట్
2) శ్రీనివాస అయ్యంగార్
3) ఏ.ఈ.సంకాలియా
4) 1,2,3
- View Answer
- సమాధానం: 4
34. రాక్షస గుళ్ళుకు సంబంధించి సరైనది ?
i) ఈ సమాధులు దక్షిణ పథంలోనే గాక మధ్య, పశ్చిమాసియాల్లో కూడా కనిపిస్తున్నాయి.
ii) వీటిలో అస్థికలుతో బాటు, ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు లభించాయి.
iii) ఇవి ఆంధ్రాలో గుడివాడ, నాగార్జునకొండ, పత్తిపాడులలో బయల్పడ్డాయి.
1) i
2) ii,iii
3) i,ii,iii
4) i,ii
- View Answer
- సమాధానం: 3
35. ఆంధ్రప్రదేశ్‌లోని బృహచ్ఛిలా యుగ సంస్కృతిలోని మృణ్మయ పాత్రలేవి ?
i) బూడిద రంగు పాత్రలు (PGW)
ii) నలుపు, ఎరుపు రంగు పాత్రలు
iii) నల్ల రంగు పాత్రలు (NBPW)
1) ii
2) i,ii
3) ii,iii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 1
36. రాక్షసి గుళ్ళ సంస్కృతిలోని రకాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని లభ్యమయ్యాయి ?
1) 10
2) 11
3) 12
4) 13
- View Answer
- సమాధానం: 3
37. ఆంధ్రప్రదేశ్‌లోని బృహత్ శిలాయుగపు ఉనికి చాలా తక్కువగా ఉన్న జిల్లాలేవి ?
i) విజయనగరం
ii) తూర్పు గోదావరి
iii) పశ్చిమ గోదావరి
జీఠి) గుంటూరు
1) i,ii,iv
2) i,ii
3) ii,iii,iv
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
38. బృహత్ శిలాయుగపు సమాధుల్లో దొరికిన వస్తువులను బట్టి ఈ కింది వాటిలో వారి జీవన విధానం తెలిపే అంశాలు ?
i) ఇనుము తయారు చేసే విధానం
ii) అలంకరణపై మక్కువ
iii) ఆహార అలవాట్లు
iv) వేట, మచ్చిక చేసుకొన్న జంతువులు
1) i,ii
2) i,ii,iii
3) i,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
39. జతపరచండి.
రాక్షసి గుళ్ళ రకాలు
a) మెన్హిర్
b) డాల్నెమ్
c) మట్టి శవపేటిక (Sarcophagus)
ప్రాంతాలు
i) చిత్తూరు
ii) గోదావరి
iii) రేవరాల
1) a-i,b-ii,c-iii
2) a-iii,b-ii,c-i
3) a-iii,b-i,c-ii
4) a-ii,b-iii,c-i
- View Answer
- సమాధానం: 2
40. కింది వాటిలో సరైనది.
i) మెన్హిర్- చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా శిలాస్తంభం నిలపడం.
ii) డాల్మెన్- రాతి పలకలతో పెట్టెను నిర్మించి దానిపై మూతగా రాతిపలకను ఉంచడం.
iii) సిస్త్- రాతి పలకల పెట్టెను భూస్తాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళు పేర్చడం.
iv) సర్కోఫాగస్- అస్థికలు కానీ, మృత దేహాలు కానీ మట్టి శవపేటికల్లో ఉంచి పాతిపెట్టడం.
1) i,iv
2) i,iii,iv
3) ii,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
41. గొర్రె ఆకారం, ఏనుగు ఆకారంగల సర్కోఫాగస్లు ఎక్కడ దొరికాయి ?
1) గిద్దలూరు (ఆంధ్ర)- ఉట్నూరు (తెలంగాణ)
2) ధరణికోట (ఆంధ్ర)- కోటి లింగాల (తెలంగాణ)
3) శంఖవరం (ఆంధ్ర)- ఏలేశ్వరం (తెలంగాణ)
4) పాతపాడు (ఆంధ్ర)- చినమారూరు (తెలంగాణ)
- View Answer
- సమాధానం: 3
42. నాగార్జునకొండలో ఏ రాజవంశం వారి ఛాయా స్తంభాలు బయల్పడినవి ?
1) పల్లవులు
2) శాతవాహనులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణు కుండినులు
- View Answer
- సమాధానం: 3
43. ఇనుప యగం చిత్రకళ లక్షణాలేవి ?
i) ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే ఎరుపు, తెలుపు, నలుపు రంగులు వాడటం
ii) వేటాడే చిత్రాలు
iii) యుద్ధవీరుల చిత్రాలు
iv) ఏనుగు, కుక్క, గుఱ్ఱం, మూపురం ఎద్దుల చిత్రాలు
1) i,ii
2) iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
44.ఏ ప్రదేశంలోని గృహ సమాధి మూతలోపలి భాగంలో నృత్య భంగిమలో ఒకరి చేతులు ఒకరు పట్టుకొన్నట్టున్న చిత్రాలను కనుగొన్నారు?
1) మల్లాయపల్లి- చిత్తూరు
2) సర్సాపూర్- వరంగల్
3) జామి- విజయనగరం
4) రామాపురం- కర్నూల్
- View Answer
- సమాధానం: 1
45. బృహత్ శిలాయుగం నాటి ధాన్యపు గింజల (food grains) ఆనవాళ్ళు ఉన్న ప్రదేశం ?
1) వీరాపురం (తెలంగాణ)
2) ఉట్నూరు (తెలంగాణ)
3) కర్నాటక
4) 1,2,3
- View Answer
- సమాధానం: 4
i) మానవ వికాసంలో రెండో విప్లవం
ii) అడవులను నరకడానికి ఇనుప గొడ్డలిని, వ్యవసాయానికి నాగళ్ళను, కత్తులను తయారుచేయడం మొదలైనవి
iii) అధికాహారోత్పత్తి
iv) నగరాల ఆవిర్భావం
1) i,iii
3) i,ii,iii
- View Answer
- సమాధానం: 4