హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది?
1. హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించింది?
1) 1975
2) 1982
3) 1980
4) 1986
- View Answer
- సమాధానం: 4
2. శాతవాహనుల కాలంలో ‘నిగమ సభలు’ వేటి పాలనను నిర్వహించేవి?
1) గ్రామాలు
2) నగరాలు
3) ప్రాదేశికులు
4) మత విషయాలు
- View Answer
- సమాధానం: 2
3. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?
1) కొరవి గోపరాజు
2) గౌరన
3) మారన
4) పోతన
- View Answer
- సమాధానం: 1
4. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?
1) న్యాయ వ్యవస్థ
2) రెవెన్యూ పాలన
3) ఆర్థిక వ్యవస్థ
4) పరిపాలనా వ్యవస్థ
- View Answer
- సమాధానం: 1
5. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది?
1) రాజమహేంద్రవరం
2) పిఠాపురం
3) దేవరకొండ
4) అద్దంకి
- View Answer
- సమాధానం: 4
6. కొండవీటి దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
1) కుమార గిరిరెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) అనపోతారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 3
7. రాజధానిని ‘అద్దంకి’ నుంచి ‘కొండవీటి’కి మార్చిన రెడ్డిరాజు ఎవరు?
1) అనపోతారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) ప్రోలయ వేమారెడ్డి
4) కుమార గిరిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
8. ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్యాన్ని ఎవరు రచించారు?
1) ఆరుద్ర
2) దాశరథీ
3) సి. నారాయణ రెడ్డి
4) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: 3
9. పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరు?
1) అన వేమారెడ్డి
2) రాచ వేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి
- View Answer
- సమాధానం: 2
10. ‘చాటు కృతులు’ అంటే ఏమిటి?
1) హాస్య గీతాలు
2) నాటకాలు
3) శతకాలు
4) రాజులను కీర్తించే గీతాలు
- View Answer
- సమాధానం: 4
11.చోళ సింహాసనం అధిష్టించిన రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు) ఎవరి కుమారుడు?
1) విమలాదిత్యుడు
2) గుణగ విజయాదిత్యుడు
3) రాజరాజ నరేంద్రుడు
4) చాళుక్య భీముడు
- View Answer
- సమాధానం: 3
12. గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ‘సంతాన సాగరం’ అనే పెద్ద చెరువును ఎవరు తవ్వించారు?
1) కాటయ వేమారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) కుమార గిరిరెడ్డి
4) సూరమాంబ
- View Answer
- సమాధానం: 4
13. రెడ్డిరాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) పులి
2) సింహం
3) వరాహం
4) వృషభం
- View Answer
- సమాధానం: 4
14. రెడ్డిరాజుల కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?
1) తాడు
2) గొలుసు
3) కేసరపాటి గడ
4) మూరలు
- View Answer
- సమాధానం: 3
15. అవచి తిప్పయ్య చెట్టిని ఏ రెడ్డిరాజు కాలంలో ‘సుగంధ భాండాగారికుడు’గా నియమించారు?
1) అన వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
16. కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు ఎవరు?
1) నంది తిమ్మన
2) అల్లసాని పెద్దన
3) ధూర్జటి
4) భట్టుమూర్తి
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో క్రీ.శ. 1565 నాటి విజయనగర రాజు ‘అలియ రామరాయలు’ కాలం నాటి ‘తాళికోట (తల్లికోట) యుద్ధం’లో పాల్గొనని దక్కన్ రాజ్యం ఏది?
1) బీరార్
2) బీజాపూర్
3) గోల్కొండ
4) బీదర్
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రీకృష్ణదేవరాయలు - మనుచరిత్ర
2) మొదటి బుక్కరాయలు - వైదిక మార్గ ప్రవర్తక
3) అల్లసాని పెద్దన - ఆముక్త మాల్యద
4) గంగాదేవి - అమరు శతకం
- View Answer
- సమాధానం: 2
19. జైనులు, వైష్ణవుల మధ్య ఘర్షణలను నివారించిన విజయనగర పాలకుడు ఎవరు?
1) మొదటి దేవరాయలు
2) మొదటి హరిహరరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) సాళువ నరసింహుడు
- View Answer
- సమాధానం: 3
20. వాగ్గేయకారుడు అన్నమయ్య కింద పేర్కొన్నవారిలో ఎవరి సమకాలీకుడు?
1) హరిహరరాయలు
2) మొదటి దేవరాయలు
3) రెండో దేవరాయలు
4) సాళువ నరసింహరాయలు
- View Answer
- సమాధానం: 4
21. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు?
1) కాకతీయులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు
4) రేనాటి చోడులు
- View Answer
- సమాధానం: 4
22. ‘ప్రతీత్ప సముత్పాదన సిద్ధాంతం’ను ఎవరు ప్రతిపాదించారు?
1) రామానుజాచార్యుడు
2) జైన మహావీరుడు
3) గౌతమబుద్ధుడు
4) నాగార్జునుడు
- View Answer
- సమాధానం: 3
23. ‘మాచల్దేవి’ ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర?
1) క్రీడాభిరామం
2) భాగవతం
3) పల్నాటి వీరచరిత్ర
4) ఆముక్తమాల్యద
- View Answer
- సమాధానం: 1
24. ‘జక్కులపురంద్రి’ ఏ జానపద కళకు సంబంధించింది?
1) యక్షగానం
2) తోలుబొమ్మలాట
3) కోలాటం
4) చెక్కభజన
- View Answer
- సమాధానం: 1
25. క్రీ.శ. 927లో గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రీపురం (రాజమండ్రి) నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్యరాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి అమ్మరాజు
3) విమలాదిత్యుడు
4) గుణగ విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 2
26. సమస్త గాంధర్వ విద్యల్లో ప్రవీణురాలైన ‘చెల్లవ-చెల్లాంబిక’ను పోషించిన చాళుక్యరాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) గుణగ విజయాదిత్యుడు
4) విమలాదిత్యుడు
- View Answer
- సమాధానం: 2
27. తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగులో సగం, సంస్కృతంలో సగం వేసిన శాసనం ఏది?
1) అహదనకర శాసనం
2) బెజవాడ యుద్ధమల్లుడి శాసనం
3) పండరంగడి అద్దంకి శాసనం
4) మైదవోలు శాసనం
- View Answer
- సమాధానం: 1
28. రాజరాజ నరేంద్రుడి నుంచి ‘నవఖండవాడ’ అగ్రహారాన్ని పొందినవారు ఎవరు?
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) విద్యానాథుడు
- View Answer
- సమాధానం: 3
29. ‘నరేంద్ర మృగేశ్వరాలయాలు’ అనే పేరుతో 108 శివాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు?
1) మొదటి అమ్మరాజు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) రెండో విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 4
30. భారతీయ న్యాయశాస్త్రానికి ఆధారమైన యాజ్ఞవల్క స్మృతిపై ‘మితాక్షరీ’ పేరుతో వ్యాఖ్యానం రాసింది ఎవరు?
1) విజ్ఞానేశ్వరుడు
2) జైమినీ
3) కణాదుడు
4) కపిలుడు
- View Answer
- సమాధానం: 1
31. పావులూరి మల్లన తన ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
1) తెలుగు
2) సంస్కృతం
3) ప్రాకృతం
4) కన్నడం
- View Answer
- సమాధానం: 1
32.రాజరాజ నరేంద్రుడు ‘నందంపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా ఎవరికి దానం చేశాడు?
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) సోమదేవ సూరి
- View Answer
- సమాధానం: 2
33. తూర్పుగోదావరి జిల్లా ‘బిక్కవోలు’లో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) అమ్మంగ దేవుడు
3) గుణగ విజయాదిత్యుడు
4) మొదటి చాళుక్య భీముడు
- View Answer
- సమాధానం: 3
34. తెలుగు భాషలో తొలి వ్యాకరణ గ్రంథమైన ‘ఆంధ్రశబ్ద చింతామణి’ రచయిత ఎవరు?
1) శ్రీనాథుడు
2) నన్నయ భట్టు
3) పోతన
4) నారాయణ భట్టు
- View Answer
- సమాధానం: 2
35. వేంగి (లేదా) తూర్పు చాళుక్య రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) వరాహం
2) సింహం
3) పులి
4) చేప
- View Answer
- సమాధానం: 1
36. ‘స్థల మహత్యాలు’ అంటే..?
1) స్థానిక దేవతల గురించి వివరించే కథలు
2) బ్రాహ్మణ గ్రామాలు
3) గ్రామ సభలు
4) న్యాయస్థానాలు
- View Answer
- సమాధానం: 1
37. ‘బృహత్ సంహిత’ గ్రంథ రచయిత ఎవరు?
1) కాళిదాసు
2) వరాహమిహిరుడు
3) సుశ్రుతుడు
4) పతంజలి
- View Answer
- సమాధానం: 2
38. వర్తక శ్రేణులను ‘నకరం’గా పేర్కొనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో వీటికి ప్రధాన కేంద్రం ఏది?
1) భీమవరం
2) ఏలూరు
3) ద్రాక్షారామం
4) పెనుగొండ
- View Answer
- సమాధానం: 4
39. వర్తక శ్రేణులను ‘నకరం’గా పేర్కొనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో వీటికి ప్రధాన కేంద్రం ఏది?
1) భీమవరం
2) ఏలూరు
3) ద్రాక్షారామం
4) పెనుగొండ
- View Answer
- సమాధానం: 2
40. ‘అభిదాన చింతామణి’ గ్రంథ రచయిత ఎవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) ఎలకూచి బాలసరస్వతి
3) విశ్వేశ్వర కవి
4) హేమాద్రి
- View Answer
- సమాధానం: 4
41. ద్రాక్షారామ ‘భీమేశ్వరాలయం’, సామర్లకోట ‘చాళుక్య భీమేశ్వరాలయం’ నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) గుణగ విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: 3
42. ‘పూర్వ మీమాంస’ (కర్మ మార్గం) వాదానికి మూల పురుషుడు జైమినీ అయితే, జ్ఞానమార్గాన్ని ప్రతిపాదించిన ‘ఉత్తర మీమాంస’ వాదానికి మూలపురుషుడు ఎవరు?
1) పతంజలి
2) కణాదుడు
3) కపిలుడు
4) బాదరాయణుడు
- View Answer
- సమాధానం: 4
43. వైష్ణవ మతంలో ‘పంచారాత్ర’ క్రతువును ప్రతిపాదించినవారు?
1) కశ్యపుడు
2) మాతంగుడు
3) శాండిల్యుడు
4) కౌండిన్యుడు
- View Answer
- సమాధానం: 3
44. తెలుగులో తొలి శాసనమైన ‘కళ్లమల్ల’ శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?
1) రేనాటి చోడ రాజు ధనుంజయుడు
2) జయసింహ వల్లభుడు
3) పాండురంగడు
4) యుద్ధమల్లుడు
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నన్నెచోడుడు - కుమార సంభవం
2) పాల్కురికి సోమనాథుడు - పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి - బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు - శివతత్త్వసారం
- View Answer
- సమాధానం: 3
46. ముసునూరి ప్రోలయ నాయకుడి రాజధాని ఏది?
1) అద్దంకి
2) చందవోలు
3) రేకపల్లి దుర్గం
4) ఆమనగల్లు
- View Answer
- సమాధానం: 3
47. ముసునూరి ప్రోలయ నాయకుడి రాజధాని ఏది?
1) అద్దంకి
2) చందవోలు
3) రేకపల్లి దుర్గం
4) ఆమనగల్లు
- View Answer
- సమాధానం: 2
48.ఆంధ్రదేశాదీశ్వర, ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడు అనేవి ఎవరి బిరుదులు?
1) పోతన నాయకుడు
2) కామన నాయకుడు
3) ప్రోలయ నాయకుడు
4) ముసునూరి కాపయ నాయకుడు
- View Answer
- సమాధానం: 4
49. ‘దయాభాగ’ రచయిత ఎవరు?
1) విఘ్నేశ్వర
2) కుల్లక భట్ట
3) విశ్వరుద్ర
4) జీమూత వాహనుడు
- View Answer
- సమాధానం: 4
50. రెడ్డి - వెలమ రాజుల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించినవారెవరు?
1) పోతన
2) శ్రీనాథుడు
3) వేమన
4) విశ్వేశ్వరకవి
- View Answer
- సమాధానం: 2
51. కృష్ణ దేవరాయల పాలనా కాలం ఏది?
1) క్రీ.శ. 1485 1502
2) క్రీ.శ. 1509 1530
3) క్రీ.శ. 1533 1545
4) క్రీ.శ. 1550 1565
- View Answer
- సమాధానం: 2
52. తన సైన్యంలో పది వేల మంది మహమ్మదీయులను నియమించిన విజయ నగర రాజు ఎవరు?
1) మొదటి దేవరాయలు
2) రెండో దేవరాయలు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) రామరాయలు
- View Answer
- సమాధానం: 2
53. ‘ఫర్గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ఎవరు?
1) రాబర్ట సీవెల్
2) జేమ్స్ ఫెర్గూసన్
3) ఫాదర్ హీరాస్
4) హెచ్.జి. వేల్స్
- View Answer
- సమాధానం: 1
54. చైనా దేశానికి తన రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో హరిహరరాయలు
3) రెండో దేవరాయలు
4) శ్రీకృష్ణ దేవరాయలు
- View Answer
- సమాధానం: 1
55. విజయనగర సామ్రాజ్యంలో వివాహ సుంకాలను రద్దు చేసిన పాలకుడు ఎవరు?
1) తుళువ వీరనరసింహుడు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి హరిహర రాయలు
4) బుక్కరాయలు
- View Answer
- సమాధానం: 2
56. కింది వాటిలో యాచక వృత్తిపై విధించిన పన్ను ఏది?
1) పుల్లం పన్ను
2) అడికాసు పన్ను
3) గణాచారి పన్ను
4) పింజుణి సిద్ధాయం
- View Answer
- సమాధానం: 3
57. ‘పింజుణి సిద్ధాయం’ అనే పన్నును ఎవరి/ దేనిపై విధించేవారు?
1) వేశ్యలు
2) దూదిని ఏకి దారం తీసేవారు
3) చేనేత పనివారు
4) పశువులు మేసే పచ్చిక బయళ్లు
- View Answer
- సమాధానం: 2
58. ‘బ్రహ్మదేవ గ్రామాలు’ అంటే ఏమిటి?
1) మఠాధిపతులకు ఇచ్చే భూములు
2) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే పన్నులు లేని గ్రామాలు
3) రాజోద్యోగులకు ఇచ్చే గ్రామాలు
4) శాస్త్రవేత్తలకు ఇచ్చే గ్రామాలు
- View Answer
- సమాధానం: 2
59. ‘భండార వార గ్రామాలు’ అంటే ఏమిటి?
1) వృత్తి పనివారికి ఇచ్చే గ్రామాలు
2) మఠాధిపతులకు ఇచ్చే గ్రామాలు
3) రాచగ్రామాలు (రాజులకు ఇచ్చేవి)
4) పండితులు, కవులకు ఇచ్చే గ్రామాలు
- View Answer
- సమాధానం: 3
60. విజయనగర రాజుల కులదైవం?
1) విరూపాక్షుడు
2) శివుడు
3) విష్ణువు
4) సూర్యుడు
- View Answer
- సమాధానం: 1