ఆంధ్ర భౌగోళిక పరిస్థితులు
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ___ , ____ మధ్య ఉంది?
1) 12° 40'-22° ఉత్తర అక్షాంశాలు- 76° &83°4' తూర్పు రేఖాంశాలు
2) 12°-41'-19° 07' ఉత్తర అక్షాంశాలు-77° - 84°40' తూర్పు రేఖాంశాలు
3) 11° 41'-21° ఉత్తర అక్షాంశాలు- 75° -83°4' తూర్పు రేఖాంశాలు
4) 12° 39'-22° ఉత్తర అక్షాంశాలు- 77° -82°4' తూర్పు రేఖాంశాలు
- View Answer
- సమాధానం: 2
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ?
1) 1,60,202 చ.కి.మీ
2) 2,60,265 చ.కి.మీ
3) 1,61,760 చ.కి.మీ
4) 1,62,970 చ.కి.మీ
- View Answer
- సమాధానం: 4
i) దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 4.96%
ii) దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 8
iii) మొత్తం జిల్లాల సంఖ్య 23
iv) రాష్ట్ర జనాభా 4,93,86,799
1) i,iv
2) i,ii,iii
3) ii,iii,iv
4) i,ii,iv
- View Answer
- సమాధానం:4
4.కింది వాటిలో సరికానిది?
i) ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరాన చత్తీస్ఘడ్ ఉంది
ii) ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు ఉంది
iii) ఆంధ్రప్రదేశ్‌కు తూర్పున బంగాళాశాతం ఉంది
iv) ఆంధ్రప్రదేశ్‌కు పశ్చిమాన మహారాష్ట్ర ఉంది
1) i
2) iv
3) i,iv
4) ii
- View Answer
- సమాధానం: 2
5. జతపరచండి ?
a) తొలి భాషాప్రయుక్త రాష్ట్రం
b) ఆంధ్రరాష్ట్రం c) ఆంధ్రప్రదేశ్ d) కర్నూలు
i) 13 జిల్లాలు
ii) 1 నవంబర్ 1956
iii) ఆంధ్రరాష్ట్రం రాజధాని
iv) 1 అక్టోబర్ 1953
1) a-i,b-iv,c-ii,d-iii
2) a-ii,b-iv,c-i,d-iii
3) a-iv,b-ii,c-iii,d-i
4) a-ii,b-iv,c-iii,d-i
- View Answer
- సమాధానం: 2
6. ఆంధ్రులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాలేవి?
i) ఒరిస్సాలోని గంజాం, బరంపురం
ii) చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్
iii) కర్నాటకలోని బళ్ళారి, కోలార్
iv) తమిళనాడులోని చెంగల్పట్టు, తంజావూరు
1) i,ii,iii
2) iii,iv
3) ii,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: డి
7.నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏఏ మండలాలుగా విభజించవచ్చు?
i) పీఠభూములు ii) తూర్పు కనుమలు
iii) తీరమైదానం
iv) పడమటి కనుమలు
1) i,ii,iv
2) ii,iii,iv
3) ii,iv
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్థితికి సంబంధించినది ?
i) ఇది ద్వీపకల్ప అంతర్భాగంలో ఉంది
ii) ద్వీపకల్ప అంతర్భాగంలో ఎత్తై పీఠభూమి కలిగి ఉంది
iii) ఇండో- గంగామైదానం నుంచి ద్వీపకల్ప పీఠభూమిని వింధ్య, సాత్పూర,మహాదేవ్, మైకాల్, సర్గూజా పర్వత శ్రేణులు వేరుచేస్తున్నాయి.
iv) ద్వీపకల్ప పీఠభూమి గ్రానైట్ మూలానికి చెందిన నీస్ రాతి మీద ఏర్పడిన అనేక పీఠభూముల తో కలిసి ఉంది
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
9. ఏ నది ద్వీపకల్ప పీఠభూమిని మధ్య, దక్షిణ పీఠభూములుగా విభజిస్తోంది ?
1) తపతి
2) గంగ
3) మహానది
4) నర్మదా
- View Answer
- సమాధానం: 4
10. ఆంధ్రప్రదేశ్ పీఠభూమిలోనివి?
i) అనంతపురం - చిత్తూరు లోయలు
ii) కడప శ్రేణులు, లోయలు
iii) నెల్లూరు
1) i,iii
2) ii,iii
3) iii
4) i,ii
- View Answer
- సమాధానం: 4
11.తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏఏ భాగాలుగా విభజిస్తున్నవి ?
i) పీఠభూమి ii) సరస్సులు
iii) తీరభూమి
iv) దట్టమైన అటవీప్రాంతం
1) i,iv
2) i,ii,iii
3) i,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
12. తూర్పు కనుమల కు పశ్చిమంగా ఉన్న దక్కన్ పీఠభూమి కింది వాటిలో ఏ నదీలోయల వద్ద అత్యధిక ఎత్తులో ఉంది ?
1) ఉత్తర తెలంగాణలో గోదావరి
2) భీమా- గోదావరి నదుల మధ్య
3) కృష్ణ- తుంగభద్ర మధ్య
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
13. తూర్పు కనుమల్లోని ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టైన అరకులోయ ఏ కొండమీద ఉంది?
1) యాలకుల కొండ
2) బాలకొండ
3) అనైముడి
4) పాపికొండలు
- View Answer
- సమాధానం: 2
14. ఎర్రమల కొండలు, శేషాచల కొండలు, పాల కొండల శేణి నిటారు వాలు భాగాలు ఏ రాయి/ రాళ్ళ రకంతో ఏర్పడ్డాయి ?
i) స్టియటైట్ ii) క్వార్టజైట్
iii) గ్రానైట్ iv) ఛార్నొకైట్
1) i,iv
2) ii
3) iii
4) ii,iii,iv
- View Answer
- సమాధానం: 2
15.జతపరచండి ?
కొండలు
a) మహేంద్రగిరి b) పాపి కొండలు c) వెలి కొండలు d) పాల కొండలు
ప్రదేశాలు
i) నెల్లూరు ii) శ్రీకాకుళం
iii) గోదావరి జిల్లాలు iv) కడప
1) a-i,b-iii,c-ii,d-iv
2) a-ii,b-iii,c-iv,d-i
3) a-ii,b-iii,c-i,d-iv
4) a-i,b-ii,c-iii,d-iv
- View Answer
- సమాధానం: 3
16.అవశిష్ట పర్వతాలుగా కింది వాటిని పిలుస్తారు ?
i) వెలుగొండలు ii) పాలకొండలు
iii) శేషాచలం iv) ఎర్రమల, నల్లమల
1) iii
2) i,ii
3) i,ii,iii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. జతపరచండి ?
పుణ్యక్షేతాలు
a) అన్నవరం b) తిరుపతి
c) అహోబిలం d) అనంతపురం
కొండలు
i) నల్లమల ii) రత్నాచలం
iii) హార్సిలీ కొండలు iv) శేషాచలం
1) a-ii,b-iv,c-i,d-iii
2) a-ii,b-iv,c-iii,d-i
3) a-iv,b-ii,c-i,d-iii
4) a-i,b-ii,c-iii,d-iv
- View Answer
- సమాధానం: 1
18.కింది వాటిలో సరైనది ?
i) ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ. తీరరేఖ ఉంది
ii) తీరం చీలిలేనందున సహజ ఓడరేవులు తక్కువ
iii) డాల్ఫిన్స్‌నోస్ అనే అందమైన కొండచాటున ఉన్న విశాఖపట్నం రేవు ఒక్కటే దేశంలో ప్రకృతిసిద్ధమైంది
1) iii
2) i,iii
3) ii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
19. కోస్తా ప్రాంత ప్రత్యేకతలు ఏవి ?
i) సముద్ర తీర ప్రాంతం
ii) శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేట వరకు సముద్ర తీర ప్రాంతం ఉంది.
iii) దీనిని తీరాంధ్రదేశమని , సర్కారు జిల్లాలని పిలుస్తారు.
iv) దక్షిణాన పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన చిలక సరస్సు వరకు ఉంది
1) i,ii,iii
2) i,iv
3) ii,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
20. కోస్తా తీర ఉత్తర, దక్షిణ భాగాలను ఏమని పిలుస్తారు ?
1) గోల్కొండ తీరం
2) కోరమాండల్ తీరం
3) విశాఖ తీరం
4) 1,2
- View Answer
- సమాధానం: 4
21. అనాది నుంచి కోస్తా తీరంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవులు ?
i) కలింగపట్నం, విశాఖపట్నం
ii) మచిలీపట్నం, మోటుపల్లి
iii) కళ్యాణి, బ్రోచ్
iv) కృష్ణపట్నం, సిందాం పట్నం
1) i,iv
2) i,ii,iii
3) i,ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
22. ఆంధ్రదేశపు రేవు పట్టణాలను పేర్కొన్న గ్రంధం ?
1) అర్థశాస్త్రం
2) ఇండికా
3) పెరిప్లస్ ఆఫ్ ది ఎరి త్రియన్సి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
23. నిశ్చితవాక్యం (A): గోదావరి నదిని భారతదేశపు రైన్నది అంటారు.
హేతువు (R): గోదావరి నది పాపి కొండల పాంతంన ప్రవహించి మనోహర దృష్యా నిర్మాణానికి దోహద పడినది.
1) A,R లు సరైనవి, (R)(A)కి సరైన వివరణ
2) A,R రెండూ సరికానివి
3) A సరైనది, R సరికాదు
4) A,R లు రెండూ సరైనవి, (R)(A)కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 1
24. ‘‘ సప్తగోదావరి’’ లో లేని గోదావరి పాయలేవి ?
i) తుల్యభాగ, ఆత్రేయ
ii) గౌతమి, వృద్ధ గౌతమి
iii) భరద్వాజ, కౌశిక
iv) వశిష్ట
1) iv
2) iii
3) ii
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
25. i) సప్తగోదావరి ప్రాంతమే కోనసీమ.
ii) ఆంధ్రపదేశ్ ఉద్యానవనపు జిలాల్లో కోనసీమ కూడా ఉంది.
పై వాటిలో సరైనది ?
1) i
2) ii
3) రెండూ కాదు
4) i,ii
- View Answer
- సమాధానం: 4
26. కృష్ణ, గోదావరి నదులు పడమర నుంచి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి కారణం ?
1) దక్కన్ పీఠభూమి ఈశాన్యం నుంచి వాయువ్యానికి వాలి ఉంది
2) దక్కన్ పీఠభూమి ఆగ్నేయం నుంచి నైరుతికి వాలి ఉంది
3) దక్కన్ పీఠభూమి వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వాలి ఉంది
4) దక్కన్ పీఠభూమి నైరుతి నుంచి ఈశాన్యానికి వాలి ఉంది
- View Answer
- సమాధానం: 3
27. గోదావరి ప్రవహించే మార్గాన్ని అవరోహన క్రమంలో అమర్చండి ?
i) బాసర ii) పాపి కొండలు
iii) రాజమండ్రి iv) ధవళేశ్వరం
v) పోలవరం vi) సహ్యాద్రి కొండలు
1) i,ii,iii,iv,v,vi
2) iv,vi,v,i,ii,iii
3) vi,i,ii,v,iii,iv
4) i,vi,ii,v,iii,iv
- View Answer
- సమాధానం: 3
28. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య రాయచూర్ అంతర్వేది ఏఏ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది ?
i) ఆంధ్రప్రదేశ్ ii) తమిళనాడు
iii) కర్నాటక iv) మహారాష్ట్ర
1) i,iv
2) i,ii,iii
3) i,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
29. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమని ఏ నది విభజిస్తోంది ?
1) మూసి
2) తుంగభద్ర
3) గౌతమి
4) మంజీర
- View Answer
- సమాధానం: 2
30. కృష్ణానది ప్రవాహదిశను అవరోహణ క్రమంలో అమర్చండి?
i) మహాబళేశ్వర్ ii) తంగడి
iii) సంగం iv)తుంగభద్ర
v) హంసలదీవి
1) i,iii,ii,iv,v
2) i,ii,iii,iv,v
3) i,v,iii,ii,iv
4) i,ii,iii,v,iv
- View Answer
- సమాధానం: 2
31. కింది వాటిలో సరైనది ?
i) కొల్లేరు మంచినీటి సరస్సు తూర్పుతీరంలో కృష్ణ- గోదావరి మధ్య డెల్టాలో ఉంది.
ii) పులికాట్ ఉప్పునీటి సరస్సు నెల్లూరు జిల్లాకు, తమిళనాడుకు సరిహద్దుల్లో సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకు వచ్చి ఏర్పడింది.
iii) డాల్ఫిన్స్‌నోస్ భాగం విజయనగరం దక్షిణం నుంచి విశాఖ వరకు వ్యాపించిన యారాడ కొండలోని చివరి భాగం.
1) i
2) ii,iii
3) i,ii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
32. కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాల ఉన్న శ్రీహరికోట దీవి ఏ సరస్సును సముద్రం నుంచి వేరు చేస్తుంది ?
1) కొల్లేరు
2) పులికాట్
3) సాంబార్
4) చిలక
- View Answer
- సమాధానం: 2
33. బకింగ్‌హామ్ కాలువకు సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) 415 కి.మీ. పొడవు తూర్పు సముద్ర తీరము వెంబడి ఉంది
ii) మద్రాస్‌ను, కాకినాడను కలుపుతుంది.
iii) చెంగల్పట్టు, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాల నుంచి పోతుంది.
iv) వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది
1) i,iii
2) i,ii,iii
3) i,ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
34. జతపరచండి ?
a) నల్లరేగడి b) ఒండ్రు నేల
c) ఎర్రమన్ను d) చల్కా నేల
i) శ్రీకాకుళం ii)కడప
iii) అనంతపూర్ iv)నెల్లూరు
1) a-i,b-ii,c-iii,d-iv
2) a-iv,b-i,c-ii,d-iii
3) a-iii,b-iv,c-i,d-ii
4) a-iii,b-iv,c-ii,d-i
- View Answer
- సమాధానం: 3
35. కింది వాటిలో సరికాని జత ఏది ?
1) అనార్ధ్ర సతత హరితారణ్యాలు- తరస్ధ ప్రాంతాలు
2) తీరారణ్యాలు- గోదావరి, కృష్ణా నది ముఖాల బంకమట్టి నేలల్లోనివి.
3) అనార్ధ్ర ఆకురాల్చు అడవులు- నల్లమల
4) పై వేవికావు
- View Answer
- సమాధానం: 4
i)లింగాల
iii)నాగావళి
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 3
37. ‘‘ఆంధ్ర దేశపు ఉద్యానవనం’’ గా పేరుగాంచిన జిల్లాలేవి ?
i) గుంటూరు, కృష్ణ
ii) ఉభయ గోదావరి
iii) విశాఖపట్నం, విజయనగరం
iv) శ్రీకాకుళం, నెల్లూరు
1) ii,iv
2) i,ii
3) i,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 2
38.ఆదిమ తెగ నివసించే ప్రాంతం
a) బోయ i)నల్లమల
b) చెంచు ii) ఎర్రమల
c) యానాది iii)కురచ కొండలు
1) a-i,b-ii,c-iii
2) a-iii,b-ii,c-i
3) a-ii,b-i,c-iii
4) a-ii,b-iii,c-i
- View Answer
- సమాధానం: 3
39. కింది వాటిలో ఏఏ జాతుల్లో ప్రాచీన, మధ్య శిలాయుగం నాటి వృత్తులున్నాయి ?
i) చెంచు ii) యానాది iii) కొండరెడ్డి iv) కోయ
1) i,iii
2) i,ii,iii
3) ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4