Educational Development of Inter Students: ఇంటర్ ప్రతిభావంతుల విద్యాభివృద్ధికి కృషి చేయాలి - జిల్లా కలెక్టర్
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ చూపిన 200మంది విద్యార్థినీ, విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో వసతి కల్పించి ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఎంసెట్‌కు హాజరయ్యేందుకు శిక్షణ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు.
కలెక్టరేట్‌లో ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వంద మంది బాలికలు, మరో వంద మంది బాలురను గుర్తించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్, ఇంటర్మీ డియెట్ విద్యాశాఖాధికారి, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Published date : 24 Jul 2023 03:50PM