EAPCET 2022: బైపీసీ విభాగం కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా..
బైపీసీ విభాగంలో కన్వీనర్ కోటాలో 10,475 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎంపీసీ విభాగంలో లెఫ్ట్ ఓవర్ సీట్లు 5,096 కాగా కన్వీనర్ కోటా సీట్లు 5,379 ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో 115, ఫార్మసీలో 8,880, ఫార్మ్‌డీలో 1,480 సీట్లు ఉన్నాయని కన్వీనర్ నాగరాణి వివరించారు. బీఈ, బీటెక్ కోర్సులకు సంబంధించి బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇతర వివరాలకు https://sche.ap.gov.in చూడొచ్చు.
☛ College Predictor 2022 - AP EAPCET | TS EAMCET
కాగా ఏపీ ఈఏపీసెట్ ఎంపీసీ విభాగం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎంపీసీ విభాగంలో కన్వీనర్ కోటాలో 1,13,403 సీట్లు ఉండగా 90,100 సీట్లు భర్తీ అయ్యాయి. 23,303 సీట్లు మిగిలాయి. ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లోనే కాకుండా ప్రైవేటు వర్సిటీల్లోనూ విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రైవేటు వర్సిటీల్లోని 3,867 సీట్లకు గాను 3,578 సీట్లు భర్తీ అయ్యాయి.
షెడ్యూల్ ఇలా..
ప్రాసెసింగ్ ఫీజు |
డిసెంబర్ 10 నుంచి 12 వరకు |
సర్టిఫికెట్ల పరిశీలన |
12 నుంచి 15 వరకు |
ఆప్షన్ల నమోదు |
13 నుంచి 16 వరకు |
ఆప్షన్ల సవరణ |
16 |
సీట్ల కేటాయింపు |
19 |
సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరిక |
20 నుంచి 23 వరకు |
అందుబాటులో ఉన్న సీట్లు ఇలా..
కోర్సు |
వర్సిటీ సీట్లు |
ప్రైవేటు సీట్లు |
ఇంజనీరింగ్ |
45 |
70 |
ఫార్మసీ |
610 |
8,270 |
ఫార్మ్‌డీ |
66 |
1,414 |