AP Education: బడిని చూస్తే ముచ్చటేస్తోంది
నాడు–నేడు ద్వారా పిల్లలు చదువుకొనే బడులను అభివృద్ధి చేయటంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న బడులను చూస్తే ముచ్చటేస్తుంది. బాగా చదువుకోవాలనే కోరిక పుడుతుంది. అన్నీ తరగతుల విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటంతో పాటు త్వరలో కస్తూరిబా బాలికలకు పడుకొనేందుకు పరుపులతో కూడిన బెడ్లు ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. మా పాఠశాలలో ప్రిన్సిపాల్ రాఘవ సురేఖ పర్యవేక్షణలో కొంత టైమ్ కేటాయించి పాఠశాలలో మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పిల్లలందరం పాల్గొని ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చటానికి కృషి చేస్తున్నాం.
– జి.నందిని, విద్యార్థిని, కెజిబివి పాఠశాల, గొట్లగట్టు
పాఠశాల రూపురేఖలు మారాయి
నాడు–నేడుతో మా పాఠశాలకు అవసరమైన అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించటంతో పాఠశాల రూపురేఖలు మారాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. తరగతి గదుల్లో విద్యార్థులకు అనువుగా బెంచీలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, ఆటస్థలం అభివృద్ధి, ప్రహరీ, మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. అన్నీ సబ్జెక్టులకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకం, విద్యార్థులకు డిజిటల్ తరగతులు, నాణ్యమైన భోజనం, పుస్తకాలతో పాటు అన్నీ వసతులు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలలు, చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం అభినందనీయం.
– మండ్లా రామాంజనేయులు, సైన్స్ టీచర్, జెడ్పీ ఉన్నత పాఠశాల, మర్రిపాలెం, కొనకనమిట్ల మండలం