Skip to main content

AP 10th Class Evaluation & Results: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం....పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌

పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం....పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌
AP 10th Class Evaluation & Results: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం....పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌
AP 10th Class Evaluation & Results: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం....పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్‌

విజయవాడ : పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్టీఆర్‌ జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. విజయ వాడ నగరంలోని బిషప్‌ అజరయ్య ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పదో తరగతి స్పాట్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల మొదటి తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ ఈ స్పాట్‌ కొనసాగనుంది. సుమారు 1.69,666 జవాబు పత్రాల మూల్యాంకనం ఇక్కడ జరగనుంది. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి జవాబు పత్రాలు నగరానికి చేరుకున్నాయి.

ఈ రెండు మూడు రోజులు మరికొన్ని జవాబు పత్రాలు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు స్పాట్‌లో పాల్గొంటున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు పర్యవేక్షణలో ఈ స్పాట్‌ కొనసాగుతుంది. ప్రారంభమైన స్పాట్‌ కేంద్రాన్ని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌, ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి. దేవానంద్‌రెడ్డి, పరిశీలకులు శ్రీనివాసులరెడ్డి సోమవారం పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.

Also Read: ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?

Published date : 02 Apr 2024 03:11PM

Photo Stories