Skip to main content

ఈ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌పై మంచి పట్టు సాధించారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ జిల్లా బెండపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా.. ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
Bendapudi ZP High School students have a good command of English
ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం చూపుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్

అక్కడి ఇంగ్లిష్‌ టీచర్‌ ప్రసాద్‌ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధనా విధానాన్ని స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)గా రూపొందించాలన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానాన్ని ప్రవేశ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫొనెటిక్స్‌(ధ్వనిశాస్త్రం)పై ప్రస్తుతం పరిశోధన చేస్తున్న వారిని ఇందులో భాగస్వాములను చేయాలని, భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్‌ (యాస), డైలెక్ట్‌ (మాండలికం) చాలా ప్రధానమైన అంశాలని చెప్పారు. వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఉండేలా చూడాలన్నారు. ఇంగ్లిష్‌ టీచర్‌ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Sakshi Education Mobile App
Published date : 20 May 2022 12:23PM

Photo Stories