Tenth Class Time Table: టెన్త్ పబ్లిక్ పరీక్షలు షెడ్యూల్ ఇదే..
రోజు విడిచి రోజు ఒక పేపర్ చొప్పున మొత్తం ఆరుపేపర్ల పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 18వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఈ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో 11 పేపర్లకు పరీక్ష నిర్వహించేవారు. కరోనా సమయంలో ఆ పేపర్లను ఏడింటికి కుదించారు. ఏడు పేపర్లలో సైన్సును ఫిజికల్ సైన్సు, నేచురల్ సైన్సు కింద రెండు పేపర్లను 50 మార్కుల చొప్పున నిర్వహించేవారు. తరువాత మళ్లీ సైన్సులోని రెండు పేపర్లను కూడా ఒకే పేపర్‌గా చేస్తూ టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరింటికి ప్రభుత్వం కుదించింది. 2022–23 విద్యాసంవత్సరం నుంచి ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షలను ఆరు పేపర్లకు పరిమితం చేసంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
గతంలో టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి పబ్లిక్ పరీక్ష పేపర్లను 80 మార్కులకు నిర్వహించేవారు. ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ విధానాన్ని గతంలోనే రద్దుచేశారు. పబ్లిక్ పరీక్షల పేపర్లను పూర్తిగా వంద మార్కులకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ పరీక్ష ఫీజు చెల్లింపు ఈ డిసెంబర్ 24వ తేదీతో ముగిసింది. రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లింపు గడువు కూడా డిసెంబర్ 30తో ముగిసింది. రూ.200 అపరాధ రుసుముతో జనవరి 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో జనవరి 9వ తేదీ వరకు దరఖాస్తులను అనుమతిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 6,60,859 మంది దరఖాస్తులు అందినట్లు కమిషనర్ తెలిపారు. కస్తూరిబా బాలికా పాఠశాలలు, దివ్యాంగులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉందని పేర్కొన్నారు.
అధిక పరీక్ష ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థులనుంచి పరీక్ష ఫీజును నిరీ్ణత మొత్తం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. అపరాధ రుసుము లేకుండ పరీక్ష ఫీజు రూ.125 కాగా, ప్రైవేటు స్కూళ్లు అంతకుమించి తీసుకుంటున్నాయి. ఇలాంటి స్కూళ్లపై విచారణ చేస్తున్నామని, నిజమని తేలితే వాటిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఎంఎన్‌ఆర్ కాపీలను జనవరి 9వ తేదీలోపు డీఈవో ఆఫీసులకు అందించాలని గతంలో సూచించినట్లు తెలిపారు. కొన్ని పాఠశాలల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డిజిటలైజేషన్‌లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎంఎన్‌ఆర్ కాపీలను డీఈవో ఆఫీసు లేదా ఇతర ఆఫీసుల్లో ఎక్కడా సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
టెన్త్ పరీక్షల షెడ్యూల్
తేదీ |
సబ్జెక్టు |
మార్కులు |
సమయం |
03–04–2023 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (గ్రూప్ ఏ) |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) |
70 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
06–04–2023 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
08–04–2023 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
10–04–2023 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
13–04–2023 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
15–04–2023 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
17–04–2023 |
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సు) |
30 |
ఉదయం 9.30 నుంచి 11.15వరకు |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
|
18–04–2023 |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 |
100 |
ఉదయం 9.30 నుంచి 12.45వరకు |
ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు (థియరీ) |
40 |
ఉదయం 9.30 నుంచి 11.30వరకు |
|
ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు (థియరీ) |
30 |
ఉదయం 9.30 నుంచి 11.30వరకు |