10th Advanced Supplementary: ‘టెన్త్’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తేదీలు ఇవే..
ఈ పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 915 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మే 30న తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల(ఫ్లైయింగ్ స్క్వాడ్)ను నియమించినట్లు పేర్కొన్నారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తి కోసం విజయవాడలో 0866–2974540 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు.