SSC 2023: పరీక్ష ఒకే ప్రశ్నపత్రం అయితే సమాధానాలను మాత్రం వేర్వేరు
ఈ నేపథ్యంలో ఫిజికల్, బయోలాజికల్ సైన్సులకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. అయితే సమాధానాలను మాత్రం వేర్వేరుగా 12 పేజీల బుక్‌లెట్లలో రాయాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఏప్రిల్ 11న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశ్నపత్రంలో పార్ట్–ఏలో ఫిజికల్ సైన్స్ ప్రశ్నలు క్రమ సంఖ్య 1 నుంచి 16 వరకు ఉంటాయి.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
పార్ట్–బీలో బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలు క్రమ సంఖ్య 17 నుంచి 33 వరకు ఉంటాయి. జవాబులు రాయడానికి వేర్వేరుగా ఓఎమ్మార్ పత్రాలు ఉన్న రెండు 12 పేజీల బుక్‌లెట్లను ఒకేసారి విద్యార్థులకు అందిస్తారు. ఫిజికల్ సైన్స్ ఓఎమ్మార్‌పై పేపర్ కోడ్– 19, పేపర్ పేరు.. సైన్స్ పి–1 అని, బయోలాజికల్ సైన్స్ ఓఎమ్మార్‌పై పేపర్ కోడ్– 20, పేపర్ పేరు.. సైన్స్ పి–2 అని ఉంటాయి.