Telangana: వీఆర్‌ఏల సర్దుబాటు షురూ.. ఈ కేటగిరీలో నియమకం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకుల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. పలు ప్రభుత్వశాఖల్లో వారిని విలీనం చేసేందుకు వీలుగా 14,954 సూపర్‌ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వీఆర్‌ఏల సర్దుబాటు షురూ.. ఈ కేటగిరీలో నియమకం

రెవెన్యూతోపాటు మిషన్‌ భగీరథలో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ ఆగస్టు 9న జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఏ పోస్టులో ఎంతమందిని నియమించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

చదవండి: Department of Revenue: వీఆర్‌ఏల కోసం సూపర్‌న్యూమరీ పోస్టులు!

రెవెన్యూ శాఖలో ఇలా... 

రెవెన్యూశాఖ పరిధిలో జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో 16, డివిజన్‌లో 7, మండల స్థాయిలో ఐదుగురిని నియమించాలని,  రికార్డు అసిస్టెంట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో ముగ్గురు, డివిజన్‌లో నలుగురు, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని వెల్లడించారు. ఇక, ఆఫీస్‌ సబార్డినేట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో 12 మంది, డివిజన్‌లో నలుగురిని, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని, చైన్‌మెన్లుగా డివిజన్, మండల స్థాయిలో ఒక్కరు చొప్పున నియమించుకోవాలని సూచించారు.  

చదవండి:  VRA Jobs: వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్త పోస్టులు

మిషన్‌ భగీరథలో... 

  • మిషన్‌ భగీరథకు సంబంధించి ప్రతి రూరల్‌ మండలంలో ఆరుగురుని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సూచించారు.  
  • మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, సాగునీటిశాఖలో లస్కర్లుగా ఎంత మంది వీఆర్‌ఏలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై ఆయా శాఖలు త్వరలోనే స్పష్టత ఇస్తాయి.   

#Tags