TSPSC Released Final Key of AE Jobs 2024 : 832 ఏఈ పోస్టుల ఫైన‌ల్ 'కీ' విడుద‌ల‌.. ఈ ప్ర‌కార‌మే ఎంపిక‌.. ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) ఎట్ట‌కేల‌కు 832 ఏఈ ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వ‌హించిన రాత‌ప‌రీక్ష ఫైన‌ల్ కీ ని విడుద‌ల చేసింది. వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల కీ తో పాటు.. రెస్పాన్స్ షీట్లను కూడా విడుద‌ల చేసింది.

ఏఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గతేడాది అక్టోబర్ 18 నుంచి 26 వరకు రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. 832 ఏఈ పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ 832 పోస్టుల‌కు సంబంధించిన‌ ఫలితాలు వెల్లడిస్తామ‌ని తెలిపారు. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

☛ 832 ఏఈ పోస్టుల ఫైన‌ల్‌ ఫైన‌ల్ 'కీ' & రెస్పాన్స్ సీట్ల కోసం క్లిక్ చేయండి 


832 ఏఈ పోస్టుల పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags