TSPSC JL Certificates Verification 2024 Dates : జేఎల్‌ కొలువుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఇవే.. అలాగే వెబ్‌ ఆప్షన్లు నమోదు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) జూనియర్ లెక్చరర్ రిజల్డ్స్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. 1,392 జూనియర్‌ లెక్చరర్(జేఎల్‌) పోస్టులకు ఎంపికైన‌ అభ్యర్థులకు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సాధారణ అభ్యర్థులకు 1:2, దివ్యాంగులకు 1:5 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. 

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు https://websitenew.tspsc.gov.in/ కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సూచించారు.

జేఎల్‌ కొలువుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి వివ‌రాలు ఇవే..
 

#Tags