TSPSC Hostel Welfare and Warden Hall Tickets 2024 : హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్‌ ఉద్యోగాల ప‌రీక్ష‌ల హల్ టికెట్లు విడుద‌ల‌.. www.tspsc.gov.inలో

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్– 1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2, వార్డెన్ గ్రేడ్–1 & గ్రేడ్–2, మాట్రాన్ గ్రేడ్– 1 & గ్రేడ్–2, లేడీ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల తేదీల‌ను వెల్లడించిన విష‌యం తెల్సిందే.

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ జూన్ 21వ తేదీ (శుక్ర‌వారం) నుంచి అందుబాటులో ఉంచింది.  https://hallticket.tspsc.gov.in/h252022214b481d3-ec74-49b6-8985-a3de6286a95b ఈ లింక్ ద్వారా హల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి, పుట్టిన తేదీని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్లను  హల్ టికెట్లను చేసుకోవచ్చు.

ప‌రీక్ష తేదీలు ఇవే..
ఈ పరీక్షలను జూన్ 24వ తేదీ నుంచి 29 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 581 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప‌రీక్ష‌లు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 10.00 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు.

అభ్య‌ర్థుల‌కు జాగ్ర‌త్త‌లు ఇవే..
ప‌రీక్ష‌కు హాజ‌రయ్యే అభ్యర్థులు హల్ టికెట్‌తో పాటు కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావలసి ఉంటుందని కమిషన్ ప్రకటించింది.

ప‌రీక్ష‌లు ఇలా..
ఉదయం సెషన్ లో పేపర్‌–1, మధ్యాహ్నం సెషన్ లో పేపర్–2 పరీక్షలను నిర్వహించనున్నారు. పేపర్–1 జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ గా నిర్వహించనున్నారు. అలాగే పేపర్–2 ను బ్యాచిలర్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కు సంబంధించి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నారు.

#Tags