TSPSC: గ్రూప్‌–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే..!

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో భర్తీ చేయనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్ష) తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Interview

ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్‌ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి. పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్‌ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం, టీఎస్‌పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. 

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ఇప్పటి వరకు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌..
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్‌–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే..


ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌–1 నియామకాల ప్రక్రియ 3 అంచెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంతరం మెరిట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్‌–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్‌–1, గ్రూప్‌–2ల సిలబస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని, నూతన సిలబస్‌ ఎంపిక, మెటీరియల్‌ ఫైనలైజేషన్‌ కొలిక్కి రావడానికి సమయం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిలబస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబంధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2 ఉద్యోగాలు ఇవే..:
గ్రూప్‌-1 పోస్టులు:  503

గ్రూప్‌-2 పోస్టులు : 582

Group 1&2 Exams Preparation Tips: గ్రూప్స్‌ గెలుపు బాటలో.. విజేతల వ్యూహాలు!

#Tags