TS Government Jobs : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇంకెప్పుడు భర్తీ చేస్తారు ...? ఈ ఏడాదిలో...
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. చెప్పి అధికారంలోకి వచ్చాక... కేవలం మాటలకే పరిమితం అయిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న కాంగ్రెస్ నేతల పోస్టులకు టీజీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు.
ఏడాదిలో ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు...?
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తరు ? మీరు ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు పదే పదే వల్లించే రోల్‌మాడల్ ప్రభుత్వమంటే హక్కుల సాధనకు చేస్తున్న శాంతియుత నిరసనలను అణిచివేడమేనా? అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
#Tags