To Issue Jr Lecturer Notification In TS :జూనియర్‌ లెక్చరర్‌ కావాలనుకుంటున్నారా... అయితే ఈ గైడెన్స్‌ మీకోసమే...

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇంత భారీగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమం. చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల్లో మిస్‌ చేసుకోవద్దు. మీ కోసం సాక్షి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం...

డిసెంబర్‌ 16 నుంచి ఆన్‌లైన్‌లో దర ఖాస్తు...
తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జేఎల్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు డిసెంబర్‌ 16 నుంచి 2023 జనవరి 6 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నియామక రాతపరీక్షను 2023 జూన్‌/ జులైలో  నిర్వహించనున్నారు.
పీహెచ్‌డీ చేసి ఉంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వొచ్చు...
జూనియర్‌ లెక్చరర్‌గా స్థిరపడాలని అనుకునేవారికి తాజా నోటిపికేషన్‌ మంచి అవకాశం. మొదటినుంచీ ప్రణాళిక ప్రకారం సన్నద్ధత సాగిస్తే.. పరీక్షలో సులభంగానే నెగ్గొచ్చు. జాబ్‌ కొట్టిన వారు పీహెచ్‌డీ చేసినా... లేక ఇప్పటికే చేసిఉన్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందొచ్చు. రాత పరీక్షలో మొత్తం 2 పేపర్లుంటాయి. నెగెటివ్‌ మార్కులు, ఇంటర్వ్యూ లేకపోవడం అభ్యర్థులకు కలిసివచ్చే అంశం. కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి సన్నద్ధత మెలకువలను తెలుసుకుని ఆచరిస్తే ఉద్యోగం పొందడం సులువు అవుతుంది.

#Tags